
మిలియన్ మార్క్ చేరువలో..!
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్ల విషయంలో తడబడుతుంటే.. మంచి కంటెంట్తో తెరకెక్కుతున్న చిన్న సినిమాలు కూడా భారీ వసూళ్లతో సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా తెరకెక్కుతున్న సినిమాలు సక్సెస్తో పాటు మంచి లాభాలను కూడా సాధించి పెడుతున్నాయి. చిన్న సినిమాగా విడుదలైన పెళ్లి చూపులు కూడా అదే బాటలో సరికొత్త రికార్డ్లు సృష్టిస్తోంది.
రెండు వారాల క్రితం రిలీజ్ అయిన పెళ్లిచూపులు ఇప్పటికే పది కోట్లకు పైగా వసూళు చేసింది. పుల్ రన్లో 20 కోట్ల మార్క్ను కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఓవర్ సీస్ లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటికే 8 లక్షల డాలర్లు వసూళు చేసిన పెళ్లిచూపులు మరో వారంలో మిలియన్ మార్క్ను రీచ్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.