
అభినవ్, తరుణ్ భాస్కర్, నవీన్
‘పెళ్ళిచూపులు’ సినిమాతో విజయ్ దేవరకొండకు మంచిహిట్ ఇచ్చి, హీరోగా నిలబెట్టారు దర్శకుడు తరుణ్ భాస్కర్. అయితే.. తనను హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్‌ని హీరోని చేశారు విజయ్ దేవరకొండ. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్‌లో షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విజయ్ దేవరకొండ, వర్థన్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని గురువారం విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ ్టప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కెమెరా: మదన్ గుణదేవా, సంగీతం: శివకుమార్, లైన్ ప్రొడ్యూసర్: విజయ్ మట్టపల్లి.
Comments
Please login to add a commentAdd a comment