
తరుణ్ భాస్కర్
‘పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో యాక్టర్ అయ్యారు. ప్రస్తుతం యాంకర్‌గానూ మారారు. ఎన్ని పనులు చేసినా కథలు చెప్పడమే నా అంతిమ లక్ష్యం అంటారాయన. తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వెంకటేశ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన కథ రాయడం పూర్తయిందని తెలిపారు తరుణ్. వెంకటేశ్ ‘నారప్ప’ తర్వాత ఈ సినిమాను సెట్స్ మీద తీసుకెళ్తారని సమాచారం. అలాగే నెట్‌ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’ ఆంథాలజీలో ఓ కథను డైరెక్ట్ చేశారు తరుణ్. ఆయన డైరెక్ట్ చేసిన భాగంలో మంచు లక్ష్మీ ఓ కీలక పాత్ర చేశారు. ఇందులోనే మేఘనా శానీ అనే కొత్త అమ్మాయి పరిచయం కాబోతున్నారు. త్వరలో ఈ ఆంథాలజీ ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment