నో సాంగ్స్‌.. ఓన్లీ బ్యాగ్రౌండ్‌! | Music Director raghu dikshith special | Sakshi
Sakshi News home page

నో సాంగ్స్‌.. ఓన్లీ బ్యాగ్రౌండ్‌!

Published Wed, Jul 11 2018 12:35 AM | Last Updated on Wed, Jul 11 2018 12:35 AM

Music Director raghu dikshith special - Sakshi

‘‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ సినిమా నేను చేయడానికి రీజన్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌. తన ‘పెళ్ళి చూపులు’ సినిమా చూసి బావుందని మెసేజ్‌ పెట్టా. అలా మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ దర్శకుడు విజయ్, తరుణ్‌ ఫ్రెండ్స్‌. విజయ్‌ని నాకు తరుణే పరిచయం చేశారు’’ అని సంగీత దర్శకుడు రఘు దీక్షిత్‌ అన్నారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో విజయ్‌ యలకంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’. టీజీ విశ్వప్రసాద్, లక్ష్మీ మంచు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రఘు దీక్షిత్‌ మాట్లాడుతూ– ‘‘నేను బాలీవుడ్, కన్నడ చిత్రాలకు సంగీతం అందించా. తెలుగులో ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ నా మొదటి సినిమా. విజయ్‌ గతేడాది ఫోన్‌ చేసి ఒక సినిమా చేస్తున్నా. పాటలు ఉండవు.

కేవలం నేపథ్య సంగీతం ఉంటుందన్నారు. కథ విన్నాను. చాలా ఎగై్జటింగ్‌గా అనిపించి చేశా. నిజంగా అలా పని చేయడం ఓ మ్యూజిక్‌ డైరెక్టర్‌కి పెద్ద ఛాలెంజ్‌. పైగా నాకు మొదటి తెలుగు సినిమా, బడ్జెట్‌ లిమిటేషన్స్‌ కూడా ఉన్నాయి. వీటన్నిటి మధ్య పని చేయడం నిజంగా ఛాలెంజే. నేను కూడా అలాగే ఫీల్‌ అయి చేశా. కథకి తగ్గట్టే మ్యూజిక్‌ అందించా. రెగ్యులర్‌ తెలుగు ఫిల్మ్స్‌ సంగీతంలా ఉండదు.  స్క్రీన్‌ప్లే టైట్‌గా ఉంటుంది.  సినిమా స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులు ఎక్కడా బోర్‌ ఫీల్‌ అవ్వరు’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement