Raghu Dixit
-
సింగర్ టు యాక్టర్
‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘చల్ చలో చలో..’, శ్రీమంతుడులో ‘జాగో జాగోరే జాగో’, జనతా గ్యారేజ్ ‘రాక్ ఆన్ బ్రో’ వంటి బ్లాక్‌బస్టర్ పాటలు సింగర్ రఘు దీక్షిత్ లిస్ట్‌లో ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సింగర్‌గా సూపర్ పాపులర్ ఆయన. తాజాగా మ్యూజిక్ కిట్ పక్కన పెట్టి మేకప్ కిట్ అందుకున్నారు. సింగర్ కాస్త యాక్టర్‌గా మారారని చెబుతున్నాం. ‘గరుడ’ అనే కన్నడ సినిమాలో రఘు దీక్షిత్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. -
నో సాంగ్స్.. ఓన్లీ బ్యాగ్రౌండ్!
‘‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా నేను చేయడానికి రీజన్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తన ‘పెళ్ళి చూపులు’ సినిమా చూసి బావుందని మెసేజ్ పెట్టా. అలా మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ‘వైఫ్ ఆఫ్ రామ్’ దర్శకుడు విజయ్, తరుణ్ ఫ్రెండ్స్. విజయ్‌ని నాకు తరుణే పరిచయం చేశారు’’ అని సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ అన్నారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో విజయ్ యలకంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైఫ్ ఆఫ్ రామ్’. టీజీ విశ్వప్రసాద్, లక్ష్మీ మంచు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ మాట్లాడుతూ– ‘‘నేను బాలీవుడ్, కన్నడ చిత్రాలకు సంగీతం అందించా. తెలుగులో ‘వైఫ్ ఆఫ్ రామ్’ నా మొదటి సినిమా. విజయ్ గతేడాది ఫోన్ చేసి ఒక సినిమా చేస్తున్నా. పాటలు ఉండవు. కేవలం నేపథ్య సంగీతం ఉంటుందన్నారు. కథ విన్నాను. చాలా ఎగై్జటింగ్‌గా అనిపించి చేశా. నిజంగా అలా పని చేయడం ఓ మ్యూజిక్ డైరెక్టర్‌కి పెద్ద ఛాలెంజ్. పైగా నాకు మొదటి తెలుగు సినిమా, బడ్జెట్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి మధ్య పని చేయడం నిజంగా ఛాలెంజే. నేను కూడా అలాగే ఫీల్ అయి చేశా. కథకి తగ్గట్టే మ్యూజిక్ అందించా. రెగ్యులర్ తెలుగు ఫిల్మ్స్ సంగీతంలా ఉండదు. స్క్రీన్‌ప్లే టైట్‌గా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు’’ అన్నారు. -
పాటల్లేని సినిమాకు మ్యూజిక్ చేయమన్నారు..!
మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో విజయ్ ఎలకంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’. వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే గాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన రఘు తొలిసారిగా తెలుగు సినిమాకు సంగీతమిస్తుండటంపై తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. పెళ్లిచూపులు సినిమా నచ్చటంతో తరుణ్ భాస్కర్‌ను అభినందిస్తూ మెసేజ్ చేశాను. అలా తరుణ్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. తరుణ్ కామన్ ఫ్రెండ్ వల్ల వైఫ్ ఆఫ్ రామ్ సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది. వైఫ్ ఆఫ్ రామ్ సినిమాకు సంబంధించి తొలిసారిగా దర్శకుడు విజయ్ను కలిసినప్పుడు సినిమాలో పాటలు లేవు. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే ఇస్తే చాలన్నారు. ఎక్కువగా మెలోడియస్, యూత్‌ఫుల్ సాంగ్స్ చేసే నాకు ఈ సినిమాకు వర్క్ చేయటం చాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా నాలుగు బాలీవుడ్ సినిమాలతో పాటు పలు కన్నడ, మలయాళ చిత్రాలకు పనిచేశాను. తెలుగులో గాయకుడిగా దేవీ శ్రీ ప్రసాద్, తమన్, హిప్ హాప్ తమిళ లాంటి సంగీత దర్శకులతో కలిసి ఆరు పాటలు పాడాను. భాషా పరంగా వర్కింగ్ స్టైల్లో మార్పేమి ఉండదు. కేవలం దర్శకుడి అభిరుచి మేరకే సంగీతమిస్తాం. విజయ్ నాతో చాలా డిఫరెంట్ మ్యూజిక్ చేయించారు. ఎక్కడా కమర్షియాలిటీ లేకుండా తక్కువ సౌండ్‌తో కొత్తగా ప్రయత్నించాం. అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. సినిమాకు కథే మూలం. సంగీతానిది రెండో స్థానమే. కథ బాగుంటే అందుకు తగ్గ సంగీతం అదే వస్తుంది. నా వంతుగా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రయత్నించాను. తెలుగు నేటివిటీకి తగ్గ సంగీతాన్ని అందించేందుకు డైరెక్టర్ విజయ్ సహాయం చేశారు. ఎప్పుడూ సంగీత దర్శకుడిని అవుతాననుకోలేదు. ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. చాలాఏళ్లు భరతనాట్యం నేర్చుకున్నా.. తరువాత సైంటిస్ట్ గా వర్క్ చేశా.. కానీ టైం నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌ను చేసింది. ప్రస్తుతం సంగీతం తప్ప మరో ఆలోచనే లేదు. గాయకుడిగా కంటే కంపోజర్‌గానే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను. ఇతర సంగీత దర్శకుల కోసం పాటలు పాడేప్పుడు పెద్దగా సలహాలేమి ఇవ్వను. కంపోజర్ ఆలోచనకు తగ్గట్టుగా పాడేందుకు ప్రయత్నిస్తా. చాలా కాలంగా టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నా వైఫ్ ఆఫ్ రామ్ టాలీవుడ్లో నా తొలి చిత్రం. అందరికి నచ్చుతుందరని ఆశిస్తున్నాను.