కంటెంట్ ఈజ్ కింగ్! | contant is king said by raj kandukoori | Sakshi
Sakshi News home page

కంటెంట్ ఈజ్ కింగ్!

Published Sun, Oct 9 2016 12:55 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

కంటెంట్ ఈజ్ కింగ్! - Sakshi

కంటెంట్ ఈజ్ కింగ్!

‘‘సినిమాకు హీరో, బడ్జెట్ ముఖ్యమే. కంటెంట్ కూడా చాలా ముఖ్యం. అది కింగ్ లాంటిది. మంచి కథ, ఆ కథకు సూటయ్యే హీరో సినిమా చేస్తే విజయం సాధించ వచ్చు’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ‘పెళ్లి చూపులు’తో ఘనవిజయం అందుకున్నారీయన. ఆ సినిమా 20 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందని ఆయన తెలిపారు. ఆ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో ‘సైన్మా’, విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమా ప్లానింగ్‌లో ఉన్నాయన్నారు.

నేడు పుట్టినరోజు సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ‘‘9 ఏళ్లలో పది సినిమాలు తీశా. ‘పెళ్లి చూపులు’ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది.  ఒకట్రెండు కోట్ల బడ్జెట్‌లో కొత్త వాళ్లతో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉంది. నా దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా. ఓ స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement