రేస్‌ మొదలు | Venkatesh New Movie Under The Direction Of Tarun Bhaskar | Sakshi
Sakshi News home page

రేస్‌ మొదలు

Published Thu, Oct 17 2019 1:49 AM | Last Updated on Thu, Oct 17 2019 1:49 AM

Venkatesh New Movie Under The Direction Of Tarun Bhaskar - Sakshi

వెంకటేశ్‌

‘వెంకీ మామ’ సినిమా కోసం అల్లుడు నాగచైతన్యతో కలసి అల్లరి చేశారు వెంకటేశ్‌. ఇప్పుడు కొత్త సినిమా కోసం రేసు మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ రేసు డిసెంబర్‌ నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. ‘పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలను తెరకెక్కించిన తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ ఓ సినిమా చేయనున్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ రేసింగ్‌ క్లబ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ సాగనుందట. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబర్‌లో మొదలు కానుందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్లను హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో రూపొందిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement