కేరాఫ్‌ నారప్ప | Karthik rathnam look released from Narappa Movie | Sakshi
Sakshi News home page

కేరాఫ్‌ నారప్ప

Published Mon, Jul 6 2020 1:03 AM | Last Updated on Mon, Jul 6 2020 1:03 AM

Karthik rathnam look released from Narappa Movie - Sakshi

కార్తీక్‌ రత్నం

‘నారప్ప’ తనయుడిగా మారారు ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేమ్‌ కార్తీక్‌ రత్నం. వెంకటేశ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో డి. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న చిత్రం ‘నారప్ప’. దేవి శ్రీదేవి సతీష్‌ ఈ చిత్రానికి సహ–నిర్మాత. ఈ సినిమాలో నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. ‘నారప్ప’ పెద్ద కొడుకు ముని కన్నా పాత్రలో ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేమ్‌ కార్తీక్‌ రత్నం నటిస్తున్నట్లు చిత్రబృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. పైగా ఆదివారం కార్తీక్‌ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రంలోని మున్నాకన్నా లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా తమిళ హిట్‌ మూవీ ‘అసురన్‌’(2019) చిత్రానికి ‘నారప్ప’ తెలుగు రీమేక్‌ అనే సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement