బెజవాడలోనైనా సినిమా తీయొచ్చు | Film enthusiastic in Vijayawada : D. Suresh Babu | Sakshi
Sakshi News home page

బెజవాడలోనైనా సినిమా తీయొచ్చు

Published Sat, Jul 12 2014 2:27 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

బెజవాడలోనైనా సినిమా తీయొచ్చు - Sakshi

బెజవాడలోనైనా సినిమా తీయొచ్చు

  • నిర్మాత డి.సురేష్‌బాబు
  • విజయవాడ :  టెక్నీషియన్‌‌స ఉంటే బెజవాడలోనైనా  చలనచిత్రాన్ని నిర్మించవచ్చని  ప్రముఖ సినీ నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు.   ‘దృశ్యం’ చిత్రం విడుదల సందర్భంగా శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన  ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం అందజేశారు.  

    ఈ సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడారు.  రాష్ర్టం విడిపోవడం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు   ఎటువంటి నష్టం ఉండదన్నారు.  సరైన టెక్నీషియన్స్ ఉంటే బెజవాడలోకూడా సినిమా తీసే అవకాశాలు ఉన్నాయన్నారు. కేరళలో ఏప్రాంతంలోనైనా సినిమాలు తీస్తారని చెప్పారు.  దృశ్యం సినిమా యూత్,  ఫ్యామిలీని  ఆకట్టుకుంటుందన్నారు.

    చిత్రం బావుందని చాలంమంది ప్రశంసిస్తున్నారని చెప్పారు. వెంకటేష్, పవన్ కల్యాణ్ కలిసి నటిస్తున్న గోపాలా..గోపాలా చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement