‘ప్రేమనగర్‌’ రీమేక్‌ చేయాలనుంది | Suresh Babu said want to remake premnagar movie | Sakshi
Sakshi News home page

‘ప్రేమనగర్‌’ రీమేక్‌ చేయాలనుంది

Published Thu, Dec 22 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

‘ప్రేమనగర్‌’ రీమేక్‌ చేయాలనుంది

‘ప్రేమనగర్‌’ రీమేక్‌ చేయాలనుంది

 – సురేశ్‌బాబు
‘‘ఇప్పడు కొత్తవాళ్లతో సినిమా చేయడం రిస్క్‌.  రామ్మోహన్‌ ఓ ఫ్యాషన్‌తో కొత్త వాళ్లతోనే చిత్రాలు చేస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నారు’’ అని ‘పిట్టగోడ’ చిత్ర సమర్పకులు డి.సురేశ్‌బాబు అన్నారు. విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి భూపాలం జంటగా అనుదీప్‌ కె.వి.దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్‌ పి. నిర్మించిన ‘పిట్టగోడ’ ఈనెల 24న రిలీజవుతోంది.

సురేశ్‌బాబు మాట్లాడుతూ...
నలుగురు కుర్రాళ్లు తమ కలల్ని ఎలా నిజం చేసు కున్నారన్నదే ‘పిట్టగోడ’ కథ. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ఈ చిత్రం చూసినవారందరికీ తమ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ∙  తేజ దర్శకత్వంలో మా అబ్బాయి (రానా) హీరోగా ఓ మూవీ చేస్తున్నా. రవిబాబు దర్శకత్వంలో నేను నిర్మించిన ‘అదుగో’ చిత్రం పూర్తయింది. వేసవిలో విడుదల చేస్తాం.  ∙నాగచైతన్య, రానా కాంబినేషన్‌లో ఓ చిత్రం నిర్మించనున్నాం. ‘పెళ్లిచూపులు’ ఫేం తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో కొత్త వాళ్లతో తీయనున్న చిత్రానికి స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు ‘ప్రేమనగర్‌’ చిత్రం రీమేక్‌ చేయాలని ఉంది’’ అన్నారు.  చిత్ర నిర్మాత రామ్మోహన్, దర్శకుడు అనుదీప్, చిత్రబృందం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement