Pittagoda
-
‘ప్రేమనగర్’ రీమేక్ చేయాలనుంది
– సురేశ్‌బాబు ‘‘ఇప్పడు కొత్తవాళ్లతో సినిమా చేయడం రిస్క్. రామ్మోహన్ ఓ ఫ్యాషన్‌తో కొత్త వాళ్లతోనే చిత్రాలు చేస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నారు’’ అని ‘పిట్టగోడ’ చిత్ర సమర్పకులు డి.సురేశ్‌బాబు అన్నారు. విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం జంటగా అనుదీప్ కె.వి.దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్ పి. నిర్మించిన ‘పిట్టగోడ’ ఈనెల 24న రిలీజవుతోంది. సురేశ్‌బాబు మాట్లాడుతూ... నలుగురు కుర్రాళ్లు తమ కలల్ని ఎలా నిజం చేసు కున్నారన్నదే ‘పిట్టగోడ’ కథ. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ఈ చిత్రం చూసినవారందరికీ తమ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ∙ తేజ దర్శకత్వంలో మా అబ్బాయి (రానా) హీరోగా ఓ మూవీ చేస్తున్నా. రవిబాబు దర్శకత్వంలో నేను నిర్మించిన ‘అదుగో’ చిత్రం పూర్తయింది. వేసవిలో విడుదల చేస్తాం. ∙నాగచైతన్య, రానా కాంబినేషన్లో ఓ చిత్రం నిర్మించనున్నాం. ‘పెళ్లిచూపులు’ ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త వాళ్లతో తీయనున్న చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు ‘ప్రేమనగర్’ చిత్రం రీమేక్ చేయాలని ఉంది’’ అన్నారు. చిత్ర నిర్మాత రామ్మోహన్, దర్శకుడు అనుదీప్, చిత్రబృందం తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఆలోచన నాకు లేదు
‘‘ముప్పై ఏళ్లుగా ఆర్.డి. బర్మన్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకూ చాలామంది సంగీతదర్శకులతో పనిచేశా. ఇప్పుడు కూడా రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న రజనీకాంత్ ‘2.0’ చిత్రానికి సంగీతం బృందంలో చేస్తున్నా. అనుభవం ఉన్న సంగీతదర్శకుల దగ్గర పని చేయడం వల్లే సంగీతదర్శకుడిగా నేనెక్కువ సినిమాలు చేయలేకపోయా’’ అన్నారు ‘ప్రాణం’ కమలాకర్. విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం జంటగా డి. సురేశ్‌బాబు సమర్పణలో అనుదీప్ కె.వి.దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్ పి. నిర్మించిన ‘పిట్టగోడ’ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రానికి స్వరాలు అందించిన కమలాకర్ మాట్లాడుతూ –‘‘రామ్మోహన్‌గారు ‘పిట్టగోడ’కు సంగీతం అందించమన్నప్పుడు మాంటేజ్ సాంగ్స్ షూట్ చూసి, పాటలకు ప్రాధాన్యం ఉందనిపించి ఒప్పుకున్నా. నేను సినిమాలకు సంగీతం అందించడం మానలేదు. మానేయాలనే ఆలోచనా లేదు. ఇప్పుడు కొన్ని చిత్రాలకు సంగీతం ఒకరు, నేపథ్య సంగీతం మరొకరు అందిస్తున్నారు. అది నాకిష్టం ఉండదు. అందుకే ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం రెండూ నేనే అందించా’’ అన్నారు. -
‘పిట్టగోడ’ మూవీ స్టిల్స్
-
ప్రతిభను ప్రోత్సహించాలి – సురేశ్‌బాబు
‘సురేశ్ ప్రొడక్షన్స్ స్థాపించి 52ఏళ్లయింది. ఈ జర్నీలో ఎంతో మంది కొత్తవారిని పరిచయం చేశాం. వారంతా సక్సెస్ అయ్యారు. ‘పిట్టగోడ’ చిత్రం ద్వారా ప్రతిభ ఉన్న మరికొంత మంది కొత్తవాళ్లను పరిచయం చేస్తున్నాం’’ అని నిర్మాత, చిత్ర సమర్పకుడు డి.సురేశ్ బాబు అన్నారు. విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం జంటగా అనుదీప్ కె.వి.దర్శకత్వంలో దినేష్ కుమార్, రామ్మోహన్ పి. నిర్మించిన ఈ చిత్రం నాలుగో పాటను సురేశ్ బాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ఎంతో మంది కొత్తవాళ్లను రామ్మోహన్ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇలా చేయడం వల్లే ప్రతిభ ఉన్న కొత్తవారు బయటికి వస్తారు. ఈనెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘రామానాయుడుగారు, సురేశ్‌గారు కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసి పలు చిత్రాలు నిర్మించారు. వారి స్ఫూర్తితోనే న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నా. మా బ్యానర్ లో స్వాతి తర్వాత ‘పిట్టగోడ’ ద్వారా మరో తెలుగమ్మాయి పునర్నవిని హీరోయిన్ గా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అని రామ్మోహన్ అన్నారు. ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుదీప్ ఓ సరదా సన్నివేశాన్ని బేస్ చేసుకుని ‘పిట్టగోడ’ కథ తయారు చేసుకున్నారు. -
నాని చేతుల మీదుగా పిట్టగోడ లాంచ్
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాల జంపాల లాంటి చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన రామ్మోహన్ నిర్మిస్తున్న మరో ఆసక్తికరమైన సినిమా పిట్టగోడ. విశ్వదేవ్ రాచకొండ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఉయ్యాల జంపాల మూవీలో హీరోను ప్రేమించే అమ్మాయిగా నటించిన పునర్ణవి భూపాలం హీరోయిన్గా నటిస్తోంది. కేవీ అనుదీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. శుక్రవారం ఈ సినిమా యూనిట్ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నాని, పిట్టగోడ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేయనున్నాడు. అంతా కొత్త వారితో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్మోహన్‌తో పాటు సురేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.