నాని చేతుల మీదుగా పిట్టగోడ లాంచ్ | Nani to unveil the first look of Pittagoda | Sakshi
Sakshi News home page

నాని చేతుల మీదుగా పిట్టగోడ లాంచ్

Published Thu, Nov 24 2016 1:39 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

నాని చేతుల మీదుగా పిట్టగోడ లాంచ్

నాని చేతుల మీదుగా పిట్టగోడ లాంచ్

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాల జంపాల లాంటి చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన రామ్మోహన్ నిర్మిస్తున్న మరో ఆసక్తికరమైన సినిమా పిట్టగోడ. విశ్వదేవ్ రాచకొండ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఉయ్యాల జంపాల మూవీలో హీరోను ప్రేమించే అమ్మాయిగా నటించిన పునర్ణవి భూపాలం హీరోయిన్గా నటిస్తోంది. కేవీ అనుదీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. శుక్రవారం ఈ సినిమా యూనిట్ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నాని, పిట్టగోడ ఫస్ట్ లుక్ పోస్టర్ను లాంచ్ చేయనున్నాడు. అంతా కొత్త వారితో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్మోహన్తో పాటు సురేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement