Rammohan
-
'కరోనా' సమయంలో.. కానరాని పచ్చ నేతలు! ఫోన్లు సైతం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా నాయకులు జనం కోసం పనిచేయాలి. నమ్ముకున్న వారి క్షేమం కోసం పాటు పడాలి. కానీ టీడీపీ నేతలు ఆపత్కాలంలో ఆప్తులను వదిలేశారు. కోవిడ్ మహమ్మారి ఊళ్లకు ఊళ్లను వణికిస్తుంటే.. తమ దారి తాము చూసుకున్నారు. విశాఖలో ఒకరు, ఢిల్లీలో ఇంకొకరు, జనాలకు దూరంగా చాలామంది దాక్కున్నారు. ఓ వైపు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముమ్మరంగా సాయం చేస్తూ జనాలకు ధైర్యమిస్తూ ఉంటే.. టీడీపీ నాయకులు మాత్రం కనీసం తమ కార్యకర్తల కోసమైనా పనిచేయలేదు. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకులు నిరంతరం జనాల్లోనే ఉంటూ వారి బాగోగులు చూసుకున్నారు. అధికారంలో ఉన్నంతకాలం ఇసుక, నీరుచెట్టు, ప్రాజెక్టులు, మద్యం, అభివృద్ధి పనుల ముసుగులో కోట్లు వెనకేసుకున్న టీడీపీ నాయకులు జనాలకు ఓ కష్టం వచ్చిన వేళ అండగా నిలవలేకపోయారు. కనీసం సొంత పార్టీ క్యాడర్‌ను కూడా కరోనా కాలంలో వారు పట్టించుకున్న పాపాన పోలేదు. కరోనా కష్టకాలంలో టీడీపీ నేతలు జాడే కానరాలేదు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.జిల్లాను కరోనా సెకెండ్ వేవ్ ఎంతగా కబళించిందో జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. యువత సైతం మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇంత కష్టకాలంలో టీడీపీ నాయకులు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలీని పరిస్థితి ఉండేది. ఒక్కో నేత ఒక్కో చోట దాక్కుని ఉన్నారు. ఆపద వచ్చినప్పుడు తమ నాయకుడు ఆదుకుంటారని సాధారణంగా నియోజక వర్గ ప్రజలు, కేడర్ అనుకుంటారు. తమ నాయకుడు ఏదో ఒక ఆస్పత్రికి చెప్పి, బాగా చూడాలని, మెరుగైన వైద్యం అందించాలంటూ చెబుతారని ఆశిస్తారు. కానీ జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నం. టీడీపీ నేతలు ఎక్కడా ఆ రకంగా స్పందించిన దాఖలాల్లేవు. ఏ ఒక్క నేత కూడా కనీసం పట్టించుకోలేదు. దాక్కున్న టీడీపీ నేతలు..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు స్థానికంగా లేరు. కరోనా సమయంలో విశాఖలో తలదాచుకున్నారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ఎక్కడున్నారో నాయకులకు కూడా తెలియని పరిస్థితి. నాయకులు ఎవరు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం హడావుడి చేశారు. తానొక కంట్రోల్ రూమ్ ప్రారంభించినట్టు బిల్డప్ ఇచ్చారు.ఆయనేదో వ్యక్తిగతంగా సాయమందిస్తారేమో అనుకుని చాలా మంది ఫోన్లు చేశారు. కానీ ఆయన చేసిందేమీ లేదు. ఇద్దరు వ్యక్తులతో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు వచ్చిన విన్నపాలను అధికారులకు మళ్లించారు. అప్పటికే అధికారులు కంట్రోల్ రూమ్ నడుపుతున్నారు. వారికి నేరుగా వచ్చే ఫోన్లకు స్పందిస్తున్నారు. ఈయన వల్ల మరింత జాప్యం జరిగే పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ రోగులకు బెడ్లు ఎక్కడున్నాయని అడిగితే అధికారులను అడిగి చెబుతామంటూ దాట వేస్తూ చేతులు దులుపుకున్నారు.మాజీ మంత్రి కళా వెంకటరావు ఎక్కడున్నారో తెలియనట్టుగా ఇంటికి తాళాలు వేసుకుని లోపలే ఉన్నారు. కనీసం కేడర్ ఫోన్ ఎత్త లేదని ఆ పార్టీ కార్యకర్తలే వాపోయారు. జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పరిస్థితి దాదాపు ఇంతే. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, కావలి ప్రతిభా భారతి తదితరులు కరోనా కాలంలో జనాలకు కనిపించనే లేదు.అందుబాటులో వైఎస్సార్సీపీ నేతలు..కష్టకాలంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. కొందరు నేరుగా ప్రజల వద్దకు వెళ్లగా, మరికొందరు తన పీఏ నంబర్లను ప్రజల వద్ద ఉంచి, ఏ సమస్య వచ్చినా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ విధంగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు సేవలు పొందారు. తమకు అవకాశం ఉన్న మేరకు స్పందించారు. ఆస్పత్రిలో బెడ్ కావాలన్నా, రోగులకు మెరుగైన వైద్యం కోసం, మందులు, ఇతరత్రా అవసరాల కోసం ఎప్పటికప్పుడు స్పందించారు.తమ్మినేని సీతారాం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు. ఫోన్లో కూడా అందుబాటులో ఉన్నారు.డిప్యూటీ సీఎం హోదాలో ధర్మాన కృష్ణదాస్ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడమే కాకుండా కోవిడ్ ఆస్పత్రులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం ఉన్నా స్పందించారు.మంత్రి సీదిరి అప్పలరాజు కూడా అదే రకంగా స్పందించారు. కోవిడ్ ఆస్పత్రుల ఏర్పాటు, సేవలందించడంలో తనదైన పాత్ర పోషించారు.ఎమ్మెల్యే రెడ్డి శాంతి అయితే నిరంతరం నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉన్నారు. మహిళా ఎమ్మెల్యే అయినప్పటికీ ధైర్యంగా ప్రజలకు అందుబాటులోనే ఉండి సాయపడ్డారు.శ్రీకాకుళంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించి సాయం చేయడంలో తమదైన పాత్ర పోషించారు.ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ కరోనా బారిన పడినప్పటికీ తన అనుచరుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నారు.ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అయితే కరోనా కష్టకాలంలో రిస్క్ తీసుకుని పనిచేశారు. జిల్లా యంత్రాంగానికి రెండు ఆక్సిజన్ అంబులెన్స్‌లు అందించారు. రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం..కరోనా సమయంలో నిత్యావసర సరుకులకు బయటకు వెళ్లలేని పరిస్థితిలో వైఎస్సార్సీపీ నాయకులు వ్యక్తిగతంగా తమ సొంత సొమ్ముతో కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేశారు. ఎక్కడికక్కడ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ప్రత్యేకంగా వలంటీర్లను పెట్టుకుని తోచినంత సాయం చేశారు.ఇక ప్రభుత్వం ప్రతీ ఇంటికి సాయం చేసింది. ఒకవైపు కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. రోగులకు పౌష్టికాహారం అందజేసింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు ఇంటింటికీ ఉచితంగా మందులు పంపిణీ చేసింది. ముందస్తు జాగ్రత్తగా ప్రతి ఇంటికి మెడికల్ కిట్ అందజేసింది. అంతటితో ఆగకుండా ప్రతి ఇంటికి ఆర్థిక సాయం చేసింది.జిల్లాలో 6,70,438 మందికి రూ.707.61కోట్లు మేర సచివాలయంలోనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. అంతేకాకుండా విదేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లోనూ చిక్కుకున్న వారిని ప్రత్యేక బస్సులు, ట్రైన్లు, విమానాలు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు క్షేమంగా తీసుకొచ్చింది. ముఖ్యంగా జిల్లాలోని వలస కూలీలు, వలస మత్స్యకారులను ప్రత్యేక జాగ్రత్తలతో తీసుకొచ్చి, ప్రత్యేక క్వారంటైన్ ఏర్పాటు చేసి, ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా చర్యలు తీసుకుంది.ఇవి చదవండి: ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు -
వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య
రైల్వేకోడూరు: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలంలోని మైసూరువారిపల్లె పంచాయతీ మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు దివిటి రామ్మోహన్ (50) దారుణ హత్యకు గురయ్యారు. శనివారం స్వగ్రామమైన శాంతినగర్‌లోని ఆయన ఇంటి వద్ద బయట వరండాలో కూర్చుని ఉండగా, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించి కత్తులతో నరికారు. రామ్మోహన్ భార్య విజయలక్ష్మి ఇంట్లోంచి బయటకు వచ్చేలోపే వారు ద్విచక్రవాహనంపై పరారయ్యారు. శాంతినగర్‌లో విజయలక్ష్మి అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా, ఏపార్టీ వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఇరవై ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న రైల్వేకోడూరులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఐ విశ్వనాథ్‌రెడ్డికి సూచించారు. హతుడు గతంలో వివిధ చానళ్లలో విలేకరిగా పనిచేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ హత్య తానే చేశానని õపోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి లొంగిపోయినట్లు సమాచారం. -
Ultimate Kho Kho: సీకేదిన్నె టు చెన్నై.. ఖోఖో చిరుతకు బంపర్ ఛాన్స్!
ఆటలెందుకురా.. చదువుకో అన్న వారు ఉన్నారు.. అవకాశాలు రావడం లేదు.. ఇక ఆటలు ఆపేసేయ్ అని కుటుంబ సభ్యులు అన్నారు.. అయినా మొక్కవోని పట్టుదల, నిరంతరం శ్రమించే తత్వం.. కళ్లముందు తల్లిదండ్రుల పేదరికం.. వెరసి కోచ్ మార్గదర్శనంలో రాటుదేలాడు కాట్ల రామ్మోహన్.. ఖోఖో క్రీడను ప్రాణంగా భావించి సాధన చేస్తున్న పేదింటి బిడ్డకు పెద్ద అవకాశం లభించింది. అల్టిమేట్ ఖోఖో లీగ్ పోటీల్లో చెన్నై క్విక్‌గన్స్ జట్టు రూ. 2లక్షలు వెచ్చించి రామ్మోహన్‌ను కొనుగోలు చేసింది. చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన ఖోఖో క్విక్‌గన్ రామ్మోహన్‌పై ప్రత్యేక కథనం.. కడప స్పోర్ట్స్: చింతకొమ్మదిన్నె మండలం బయనపల్లెలోని ఎస్.వి.ఎయిడెడ్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్ శిక్షణలో ఓనమాలు దిద్దుకున్న రామ్మోహన్ ఖోఖో క్రీడలో జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. మండల పరిధిలోని ఆర్.టి.పల్లెకు చెందిన సాధారణ రైతుకూలీ కె. రాముడు, బాలసిద్ధమ్మల కుమారుడైన కట్లా రామ్మోహన్ బయనపల్లెలోని ఎస్.వి. హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇక్కడే ఖోఖోలో ఓనమాలు నేర్చుకుని జాతీయస్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం బాపట్ల జిల్లా ఇనకొల్లులోని డి.సి.ఆర్.ఎం.కళాశాలలో డిగ్రీ చదువుకుంటూ జె.పంగలూరులోని ఎస్.ఎస్.ఆర్. ఖోఖో అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఛేజింగ్, రన్నింగ్‌లో ప్రత్యేకత చాటుతూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎస్జీఎఫ్ మొదలు జూనియర్స్, సీనియర్స్, ఖేలో ఇండియా ఇలా అన్ని విభాగాల్లో జాతీయస్థాయిలో పతకాలు సాధించి ఖోఖో చరిత్రలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరుచుకుని, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడీ యువ క్రీడాకారుడు. చెన్నై క్విక్‌గన్స్ జట్టుకు.. క్రికెట్ ప్రీమియర్‌లీగ్, బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్, ప్రొ కబడ్డీ లీగ్ వలనే ఖోఖో క్రీడలో సైతం అల్టిమేట్ ఖోఖో పేరుతో లీగ్ పోటీలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఈనెల 14, 15 తేదీల్లో పుణేలోని ఛత్రపతి స్పోర్ట్స్‌హబ్‌లో తొలిసీజన్లో దేశవ్యాప్తంగా 6 ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసి క్రీడాకారులను కొనుగోలు చేశారు. ఇందులో చెన్నై క్విక్‌గన్స్ ఫ్రాంచైజీ రామ్మోహన్‌ను రూ. 2లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించనున్న అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో చెన్నై క్విక్‌గన్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇతడికి చక్కటి అవకాశం లభించడం పట్ల జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి, కార్యదర్శి నరేంద్ర, ఎస్.వి.ఎయిడెడ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు దీన్‌దయాళ్, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. రామ్మోహన్ ఘనత ►2015లో చత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన అండర్–14 జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం ►2017లో 63వ ఎస్జీఎఫ్ అండర్–17 నేషనల్స్‌లో గోల్డ్‌మెడల్ ►2018లో ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా అండర్–17 నేషనల్స్‌లో కాంస్యపతకం ►2019లో పూణేలో నిర్వహించిన ఖేలో ఇండియా అండర్–17 నేషనల్స్‌లో రజతపతకం ►2019లో గుజరాత్లో నిర్వహించిన జూనియర్ నేషనల్స్‌లో కాంస్యపతకం ►2020లో అస్సాంలో నిర్వహించిన ఖేలోఇండియా అండర్–17 నేషనల్స్‌లో ప్రాతినిధ్యం ►2021లో వరంగల్‌లో నిర్వహించిన సీనియర్ నేషనల్స్ (సౌత్‌జోన్)లో కాంస్యపతకం ►2021లో మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సీనియర్ నేషనల్స్‌తో ప్రాతినిధ్యం చదవండి: Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్ సేనకు భారీ షాక్! ఆలస్యంగా వెలుగులోకి.. Shikhar Dhawan: ఆ ముగ్గురు అద్భుతం చేశారు.. అలాంటి పొరపాట్లు సహజం.. ఆవేశ్ సైతం! -
యాక్షన్ ఎంటర్టైనర్
సుధీర్ బాబు హీరోగా కొత్త సినిమా షురూ అయింది. రచయిత, నటుడు హర్షవర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత రామ్మోహన్ రావు క్లాప్ కొట్టి, స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. సుధీర్ బాబు సరికొత్తగా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా. -
రామ్మోహన్ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం
సాక్షి, కడప : అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు పంతగాని రామ్మోహన్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు భార్య నాగరత్నమ్మకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 లక్షల పరిహారం అందించింది. జిల్లా కలెక్టర్ హరికిరణ్ బుధవారం రైతు రామ్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటన వివరాలను ఆ కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం యావత్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని అందచేశారు. కాగా చిట్వేలు మండలం నాగవరం హరిజనవాడకు చెందిన రామ్మోహన్ సోమవారం తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి మూడు ఎకరాల భూమి ఉంది. బొప్పాయి, అరటి పంటలను సాగు చేసుకుంటూ ఉండేవాడు. ఏటా ప్రకృతి వైపరీత్యాలకు పంట దెబ్బ తినడం, గిట్టుబాటు ధరలేక నష్టపోయాడు. ఆర్థికంగా దెబ్బతినడంతో మానసికంగా దిగులుపడుతూ ఉండేవాడు. అంతేకాకుండా నీటి సౌకర్యం తక్కువగా ఉండేది. బోరులో నీరు పూర్తిగా తగ్గిపోవడంతో చిట్వేలిలోని సహకార బ్యాకులో లక్ష రుణం, నాగవరం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో లక్ష రూపాయల రుణం, గ్రామంలో ఓ రైతు వద్ద మరో లక్ష తీసుకుని మూడు బోర్లు వేశాడు. అయితే ఒక్క బోరులో కూడా నీరు పడలేదు. పంట చేతికి వచ్చే సమయంలో నీరు లేక పంట పూర్తిగా ఎండిపోవడంతో ఆవేదన చెంది మొన్న సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామ్మోహన్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
‘పిట్టగోడ’ మూవీ స్టిల్స్
-
నాని చేతుల మీదుగా పిట్టగోడ లాంచ్
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాల జంపాల లాంటి చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన రామ్మోహన్ నిర్మిస్తున్న మరో ఆసక్తికరమైన సినిమా పిట్టగోడ. విశ్వదేవ్ రాచకొండ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఉయ్యాల జంపాల మూవీలో హీరోను ప్రేమించే అమ్మాయిగా నటించిన పునర్ణవి భూపాలం హీరోయిన్గా నటిస్తోంది. కేవీ అనుదీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. శుక్రవారం ఈ సినిమా యూనిట్ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నాని, పిట్టగోడ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేయనున్నాడు. అంతా కొత్త వారితో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్మోహన్‌తో పాటు సురేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. -
వేదాద్రిలో మాజీ గవర్నర్ పూజలు
వేదాద్రి (పెనుగంచిప్రోలు): కృష్ణా పుష్కరాల్లో భాగంగా వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం రాష్ట్ర మాజీ డీజీపీ, తమిళనాడు మాజీ గవర్నర్ టీఎస్ రామ్మోహనరావు దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో డీ శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం రామ్మోహనరావుకు స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేశారు. కాగా, దివంగత ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కృష్ణా జలాలను నెత్తిపై చల్లుకొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. -
తెలంగాణ పత్రిక చీఫ్ ఎడిటర్‌గా రామమోహన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని రానున్న ‘తెలంగాణ’ జర్నల్‌కు చీఫ్ ఎడిటర్‌గా అష్టకళ రామమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సిబ్బందిని సమాచార, పౌర సంబంధాల శాఖ నియమించుకోవాలని సమాచార శాఖ కార్యదర్శి ఆర్వీ చంద్రవదన్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శిక్షణపై చంద్రవదన్: వారంపాటు శిక్షణ కోసం హర్యానాలోని సోనెపట్‌కు కార్మికశాఖ కార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్ వెళ్తున్నారు. ఆయన స్థానంలో ఈ బాధ్యతలను పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి నిర్వహిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. -
టీడీపీలో సీన్ రివర్స్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : భాష, యాస, శైలితో జాతీయ స్థాయిలో ప్రత్యేకత చాటుకున్న మాజీ ఎంపీ, దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు అనంతరం తెర పైకి వచ్చిన ఆయన తనయుడు రామ్మోహన్నాయుడును చూసి అంతా వారసుడొచ్చాడనుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ ఆదరించారు. ఇటీవలి ఎన్నికల్లోనూ గెలిపించారు. ఆ తర్వాత జరుగుతున్న పరి ణామాలు మాత్రం అసలు వారసుడి వన్నె తగ్గిస్తున్నాయి. ఎర్రన్న కుటుంబ సభ్యులన్న సానుభూతితో ఎంపీగా రామ్మోహన్, టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు గెలిచారు. ఎన్నికల వరకు టీడీపీ వ్యవహారమంతా రామ్మోహన్ కేంద్రంగానే సాగింది. ఆయనే తమ గెలుపు చుక్కాని అని మెజారిటీ అభ్యర్థులు, పార్టీ నాయకులు భావించారు. ఎన్నికల్లో విజయం సాధించి అచ్చెన్నాయుడు మంత్రి కావడంతో ఎన్నికల వరకు ఉన్న సీన్ కాస్త రివర్స్ అయ్యింది. అధికార కేంద్రం అబ్బాయ్ నుంచి బాబాయ్‌కి బదిలీ అయినట్లు కనిపిస్తోంది. అధికారుల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తల వరకు సహజంగానే మంత్రి అచ్చెన్న చుట్టూ కేంద్రీకృతమవుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ పరిస్థితికి దర్పణం పడుతున్నాయి. సమీక్షలో రామ్మోహన్ మౌనం జిల్లా అధికారులతో మూడు రోజుల క్రితం జరిగిన సమీక్ష సమావేశంలో ఆద్యంతం అచ్చెన్న హవాయే కనిపించింది. ఎంపీగా రామ్మోహన్ ఈ సమావేశానికి హాజరైనా మౌనంగా కూర్చుండిపోయారు. అచ్చెన్న ప్రభ వెలిగించేందుకు అంతా ప్లాన్ ప్రకారం పక్కాగా జరిగింది. ఎమ్మెల్యేలుగా గెలిచినవారు అసెంబ్లీలో ప్రమాణం చేయకముందే జిల్లా సమీక్ష నిర్వహించడం.. సమీక్ష నిర్వహణ తేదీలు మారడం వెనుక కూడా అచ్చెన్న వ్యూహం ఉందని పార్టీకి చెందిన కొందరు పేర్కొంటున్నారు. సమావేశంలో కూడా ఒక వర్గాన్నే టార్గెట్ చేసుకుని మంత్రి మాట్లాడటం కూడా అనుమానాలు రేపుతోంది. తన ప్రసంగాల ద్వారా జాతీయ స్థాయి నాయకుల్ని ఆకట్టుకున్న రామ్మోహన్ ఈ సమావేశంలో మాత్రం మౌనం దాల్చడం, ఓ ఎంపీగా జిల్లా వాసులకు తాను ఏం చేయదలచుకున్నానో సమీక్ష సమావేశంలో అధికారులకు చెప్పకపోవడంపై టీడీపీలోని ఆయన అభిమానులను నిరాశకు గురి చేసింది. గ్రీవెన్స్‌లోనూ అదే తీరు సహజంగా అధికారులు మంత్రికే ప్రాధాన్యం ఇస్తారు కదా అని సరిపెట్టుకుందామంటే.. ఈ నేతల ఇళ్ల వద్ద నిర్వహిస్తున్న రోజువారీ గ్రీవెన్సులోనూ అదే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎంపీని పెద్దగా పట్టించుకోకుండా అందరూ అచ్చెన్న చెంతకు చేరుతుండటం చర్చనీయాంశమవుతోంది. పదేళ్ల తరువాత టీడీపీ అధికారంలోకి రావడం, త్వరలో నామినేటెడ్ సహా అనేక పదవులకు నియామకాలు జరగనున్న నేపథ్యంలో మంత్రిని మచ్చిక చేసుకుంటేనే పదవులు లభిస్తాయని భావిస్తున్న వారు ఆయన్ను కలిసి విన్నపాలు సమర్పిస్తున్నారు. ఈ మేరకు రిమ్స్ ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల భర్తీపై అచ్చెన్న జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ పనులకు సంబంధించి కూడా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అచ్చెన్న వ్యవహార శైలి తెలిసిన తన వారంతా తనను వదిలి ఆయన చుట్టూ తిరుగుతుండడం అబ్బాయ్ రామ్మోహన్‌కు ఇబ్బంది కలిగిస్తోందని ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్రంలోనూ అదే పరిస్థితి ఇక జిల్లా కేంద్రంలో పార్టీ క్యాడర్ గతంలో రెండు వర్గాలుగా ఉండేంది. ఇప్పుడు అందరూ అచ్చెన్న వద్దకు క్యూ కడుతున్నారు. అటు ఎంపీ వద్దకు గానీ, ఇటు స్థానిక ఎమ్మెల్యే వద్దకు గానీ ఎవరూ వెళ్లకపోవడం గమనార్హం. అదే విధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిలిచిపోయాయి. కోర్టు విచారణలో ఉన్నందున నిలిచిపోయిన శ్రీకాకుళం మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా సంబంధిత మున్సిపాలిటీ ఏ నియోజకవర్గం పరిధిలో ఉంటే.. ఆ ఎమ్మెల్యే, ఎంపీలకే అభ్యర్థుల ఎంపిక బాధ్యత అప్పగిస్తారు. అందుకు విరుద్ధంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎంపీ, ఎమ్మెల్యేలను మంత్రి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అలాగే మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారు కూడా మిగతా ప్రయత్నాలను పక్కన పెట్టి ప్రాపకం కోసం ఆరాటపడు తున్నారు. -
మన్యంలో భయానక వాతావరణం
=గొంతుకోసి, గునపాలతో పొడిచి ఇద్దరి హత్య =తప్పించుకున్న మరో మాజీ దళసభ్యుడు =బలపం సమీపంలో మావోయిస్టుల ఘాతుకం =ఇన్ఫార్మర్లంటూ సంఘటనా స్థలంలో కరపత్రం =మన్యంలో భయానక వాతావరణం మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టులు అతి కిరాతకంగా ఇద్దరిని హతమార్చడంతో ఈస్టు డివిజన్ వణుకుతోంది. చేతులు వెనక్కి కట్టేసి ఒకరిని గొంతుకోసి, మరొకరి మెడపై గునపాలతో పొడిచి చంపడంతో అంతటా భయానక వాతావరణం నెలకొంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన చెరువూరులో 2011లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు వీరే కారణమంటూ, అప్పట్లో పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేయడం వల్లే ఇద్దరిని మట్టుబెట్టినట్టు దళసభ్యులు సంఘటన స్థలంలో విడిచిపెట్టిన కరపత్రంలో పేర్కొన్నారు. చింతపల్లి, న్యూస్‌లైన్: చింతపల్లి మండలం బల పం పంచాయతీ జోహార్ గ్రామ సమీపంలో కిల్లో రాంబాబు, రామ్మోహన్‌లను శుక్రవారం రాత్రి మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. మండలంలోని వేలంజువ్వి గ్రామానికి చెందిన కిల్లో రాంబాబు(25), తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామ్మోహన్(35), జీకే వీధి మండలం బోనంగిపల్లికి చెందిన మాజీ దళసభ్యుడు సంజీ వరావు అలియాస్ వేణులు శుక్రవారం బలపం ప్రాంతానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా జోహార్ వద్ద మిలీషియా సభ్యులు అడ్డగించారు. ప్రమాదాన్ని పసిగట్టిన సంజీవరావు తప్పించుకుని పరారయ్యాడు. రాంబాబు, రామ్మోహన్‌లు చిక్కారు. ఇద్దరినీ రాత్రి 7 గంటల సమయంలో బలపం రహదారి వద్దకు తీసుకొచ్చారు. చేతులు వెనక్కి కట్టేసి ఒకరిని గొంతుకోసి, మరోకరి మెడపై గునపాలతో పొడిచి అతికిరాతకంగా హతమార్చారు. చెరువూరు ఎన్‌కౌంటర్‌కు బాధ్యులయినందునే హతమార్చినట్టు సంఘటనా స్థలంలో విడిచిపెట్టిన కరపత్రంలో పేర్కొన్నారు. కిల్లో రాంబాబు గతంలో దళసభ్యునిగా పనిచేసి స్వచ్ఛందంగా లొంగిపోయాడు. అనంతరం హోగార్డుగా నర్సీపట్నంలో విధులు చేపట్టాడు. అదే ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకేసులో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి మండల కేంద్రం చింతపల్లి చాడిపేటలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు. హోంగార్డుగా పనిచేసే సమయంలో తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడికి చెందిన రామ్మోహన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఏజెన్సీలో వ్యాపారం చేసేవారు. హోంగార్డుగా చేరినప్పటి నుంచి మావోయిస్టులు రాంబాబుపై దృష్టిపెట్టారు. అదను కోసం ఎదురు చూస్తున్నారు. బలపం ప్రాంతానికి వస్తున్నట్టు సమాచారంతో అతనిని పట్టుకోవాలని, ఆ ప్రాంత మిలీషియా సభ్యులకు ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మిలీషియా సభ్యులు వారిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తగులబెట్టారు. ఇద్దరినీ హతమార్చారు. ఆయా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.