వేదాద్రిలో మాజీ గవర్నర్ పూజలు
వేదాద్రి (పెనుగంచిప్రోలు):
కృష్ణా పుష్కరాల్లో భాగంగా వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం రాష్ట్ర మాజీ డీజీపీ, తమిళనాడు మాజీ గవర్నర్ టీఎస్ రామ్మోహనరావు దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో డీ శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం రామ్మోహనరావుకు స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేశారు. కాగా, దివంగత ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కృష్ణా జలాలను నెత్తిపై చల్లుకొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు.