puskara snanam
-
వేదాద్రిలో మాజీ గవర్నర్ పూజలు
వేదాద్రి (పెనుగంచిప్రోలు): కృష్ణా పుష్కరాల్లో భాగంగా వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం రాష్ట్ర మాజీ డీజీపీ, తమిళనాడు మాజీ గవర్నర్ టీఎస్ రామ్మోహనరావు దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో డీ శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం రామ్మోహనరావుకు స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేశారు. కాగా, దివంగత ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కృష్ణా జలాలను నెత్తిపై చల్లుకొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. -
జగన్‌తోనే జనరంజక పాలన
కంకిపాడు : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం మద్దూరు ఏటిపాయలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథితో పాటుగా పెనమలూరు నియోజకవర్గ నేత, కోలవెన్ను సర్పంచి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), మండల అధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులపాటి రామచంద్రరావు, జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు, ఎస్సీ, బీసీ విభాగాల మండల అధ్యక్షుడు కలపాల వజ్రాలు, నకరికంటి శేఖర్, కోలవెన్ను ఉపసర్పంచి నక్కా శ్రీనివాసరావు, నాగిడి మహారుద్రుడు తదితరులు ప్రత్యేక బోటులో ఏటిపాయ మధ్యకు వెళ్లి కృష్ణమ్మను ఆరాధిస్తూ పూజ చేశారు. జగన్, వైఎస్సార్‌సీపీతోనే ప్రజా రంజక పాలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అభిమానులు పుష్కరస్నానం ఆచరించారు. -
వరాలు ఇచ్చేనా
నేడు విజయవాడకు రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు రాక పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం నంద్యాల – కడప లైను ప్రారంభం సాక్షి, విజయవాడ : రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు మంగళవారం నగరానికి రానున్నారు. పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరిస్తారు. అనంతరం డీఆర్ఎం కార్యాలయం చేరుకుని అక్కడ నుంచే నంద్యాల – ఎర్రగంట్ల రైల్వేలైనును, నంద్యాల– కడప పాసింజర్ రైలును రిమోట్ వీడియో లింక్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. ఏపీలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనుల గురించి ఆ శాఖ ఉన్నతాధికారోలనూ సమీక్షిస్తారని తెలిసింది. సాయంత్రం సంగమం వద్ద పుష్కరాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ ప్రభు ఇప్పటికే రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.తొలిసారిగా ఆయన విజయవాడ వచ్చినప్పుడు విజయవాడ– అమరావతి రైల్వే లైను నిర్మాణానికి సర్వే చేయించేందుకు శ్రీకారం చుట్టారు. రెండవసారి వచ్చినప్పుడు విజయవాడ– సికింద్రాబాద్ సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేశారు. తాజాగా విజయవాడ–ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ను ఇచ్చి రాయలసీమ వాసులు రాష్ట్రానికి వచ్చేందుకు వీలు కల్పించారు. ఈసారి ఏమీ వరాలు ఇస్తారనే అంశంపై రైల్వే వర్గాలో చర్చ జరుగుతోంది. ఈ క్రింద అంశాలపై సురేష్ ప్రభు దృష్టి పెడితే ఈ ప్రాంతవాసులకు ఉపయుక్తంగా ఉంటుందని అధికార, అనధికార వర్గాలు భావిస్తున్నాయి. –విశాఖపట్నం–తిరుపతి, విశాఖపట్నం– సికింద్రాబాద్ వయా విజయవాడ మీదగా డబుల్ డెక్కర్ రైలు నడిపేందుకు ఇప్పటికే ట్రయిల్ రన్‌ను అధికారులు పూర్తి చేశారు. కేవలం రైల్వే బోర్డు నుంచి అనుమతులు వస్తే ఈ రైళ్లు నడిచే అవకాశం ఉంది. పుష్కరాల్లో వీటిని నడపాలని చూసినా రైల్వే బోర్డు నుంచి అనుమతి రాలేదు. వీటిని మంజూరు చేస్తే ఉపయుక్తంగా వుంటుంది. – విజయవాడ రైల్వే స్టేషన్లో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జి చాలా అవసరం. గతంలో ఉన్న పుట్ ఓవర్ బ్రిడ్జికి ఒకవైపు మెట్లు తీసివేసి ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఒకవైపు రైలు ఎక్కేవాళ్లు దిగేవాళ్లు వస్తూ ఉండటంతో తొక్కిసలాట జరుగుతోంది. – పుష్కరాల సందర్భంగా గుణదల, మధురానగర్, కృష్ణాకెనాల్, రాయనపాడు రైల్వేస్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా మార్చారు. పుష్కరాల తరువాత దీన్ని కొనసాగిస్తే విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. – విజయవాడ నుంచి నాగోర్ (నాగపట్నం), అహ్మదాబాద్, ముంబాయి, షిర్డీ, కోల్‌కతాలకు కొత్త రైళ్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – విజయవాడ– గుడివాడ– నర్సాపురం– భీమవరం– మచిలీపట్నం, గుంటూరు– తెనాలి లైన్ల డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.120 కోట్లు గతంలో ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో గుంటూరు–తెనాలి లైను రూ.20 కోట్లు మిగిలిన వంద కోట్లు మొదటి లైనుకు కేటాయిస్తారు. ఈ రెండు లైన్లు పూర్తి చేయడానికి రూ.1,140 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేయగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించేందుకు ముందుకు వచ్చింది. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటిని వేగవంతం చేయించాల్సి ఉంది. -
200 మంది ముస్లింల పుష్కర స్నానం...
దాచేపల్లి: దాచేపల్లి మండలం తంగెడ పుష్కర ఘాట్‌లో సుమారు 200 మంది ముస్లింలు పుష్కర స్నానం చేసి మతసామరస్యాన్ని చాటి చెప్పారు. అమరావతి, విజయపురిసౌత్ కృష్ణవేణి ఘాట్, సీతానగరం ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సత్రశాల పుష్కర ఘాట్‌లో పరాశక్తి సిమెంట్స్, వివిధ సామాజిక వర్గాలకు చెందిన సత్రాల్లో పుష్కరాలకు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. అచ్చంపేట మండలం నందులరేవు పుష్కర ఘాట్‌లో భక్తులు స్నానాలు చేస్తుండగా హఠాత్తుగా కొండచిలువ రావడంతో భయంతో పరుగులు తీశారు. పోలీసులు దాన్ని చంపడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
అడుగుడుగునా అభిమానం..
జనహృదయ నేతకు ఘనస్వాగతం కరచాలనం చేసేందుకు పోటీపడిన యువత జయంతి(వీరులపాడు) : పుష్కర మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్రప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పుష్కర స్నానానికి వెళ్లి మృతి చెందిన నందిగామ నగేష్ కుటుంబసభ్యులను పరామర్శించడానికి గురువారం ఆయన వీరులపాడు మండలం జయంతి గ్రామానికి వచ్చారు. జగన్ గ్రామానికి వస్తున్నారని తెలియటంతో ఆయనను చూసేందుకు ప్రజలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామస్తులు, నాయకులు గ్రామ శివారులోనే జగన్‌కు స్వాగతం పలికి మృతుని నివాసం వద్దకు తీసుకెళ్లారు. దారి పొడవునా జగన్‌తో కరచాలనం చేసేందుకు యువత ఒకరికొకరు పోటీ పడ్డారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు ఆధ్వర్యంలో పార్టీ మండల కన్వీనర్ కోటేరు ముత్తారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఆవుల రమేష్‌బాబు, జెడ్పీటీసీ సభ్యురాలు షహనాజ్‌బేగం, సర్పంచిలు కోటేరు సూర్యనారాయణ రెడ్డి, ఆవుల మాధవి, ఎంపీటీసీ సభ్యులు సాదా భారతి, ఆదాం, బాయమ్మ, పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్‌కు స్వాగతం పలికారు. -
రాముడుపాలెంలో ఉపసభాపతి పుష్కరస్నానం
నడకుదురు (చల్లపల్లి) : ఏపీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కుటుంబసమేతంగా మంగళవారం ఉదయం రాముడుపాలెం పుష్కరఘాట్‌లో స్నానమాచరించారు. వారికి ప్రజా ప్రతినిథులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. బుద్ధప్రసాద్, ఆయన సతీమణి విజయలక్ష్మి, కుమారుడు మండలి వెంకట్రామ్ (రాజా), ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్‌లు పుష్కరస్నానం చేశారు. అనంతరం సర్పంచ్ పుట్టి వీరాస్వామి నూతన వస్త్రాలు బహూకరించగా, అర్చకస్వాములు, జంగందేవరలు ఆశీర్వచనం పలికారు. -
బాసరలో పుష్కరస్నానం చేసిన అంధులు
-
కరీంనగర్లో 8లక్షలమంది పుష్కరస్నానం
-
పుష్కరస్నానం చేస్తే తరతరాల పాపాలుపోతాయి