జగన్‌తోనే జనరంజక పాలన
కంకిపాడు :
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మంగళవారం మద్దూరు ఏటిపాయలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథితో పాటుగా పెనమలూరు నియోజకవర్గ నేత, కోలవెన్ను సర్పంచి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), మండల అధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులపాటి రామచంద్రరావు, జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు, ఎస్సీ, బీసీ విభాగాల మండల అధ్యక్షుడు కలపాల వజ్రాలు, నకరికంటి శేఖర్, కోలవెన్ను ఉపసర్పంచి నక్కా శ్రీనివాసరావు, నాగిడి మహారుద్రుడు తదితరులు ప్రత్యేక బోటులో ఏటిపాయ మధ్యకు వెళ్లి కృష్ణమ్మను ఆరాధిస్తూ పూజ చేశారు. జగన్, వైఎస్సార్‌సీపీతోనే ప్రజా రంజక పాలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అభిమానులు పుష్కరస్నానం ఆచరించారు.