అగ్నిప్రమాదంలో 30 గుడిసెలు దగ్ధం | fire accident in attapur | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో 30 గుడిసెలు దగ్ధం

Published Fri, Mar 20 2015 10:58 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in attapur

హైదరాబాద్ : నగరంలోని అత్తాపూర్‌, నలందానగర్ కాలనీలో శుక్రవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల నలందానగర్ కాలనీలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రమాదంతో 30కి పైగా గుడిసెలు మంటల్లో చిక్కుకున్నాయి. అంతేకాకుండా గుడిసెల్లో ఉన్న సిలిండర్లు పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
(అత్తాపూర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement