సొంత తమ్ముడే హతమార్చాడు | Younger brother murders Elder brother | Sakshi
Sakshi News home page

సొంత తమ్ముడే హతమార్చాడు

Published Mon, Jul 20 2015 4:46 PM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM

సొంత తమ్ముడే హతమార్చాడు - Sakshi

సొంత తమ్ముడే హతమార్చాడు

అత్తాపూర్ (రంగారెడ్డి) : అన్న పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక అతడిని.. సొంత తమ్ముడే తన స్నేహితుడితో కలిసి హతమార్చాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులిద్దరినీ రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ ఉమేందర్ తెలిపిన వివరాల ప్రకారం... అత్తాపూర్ హుడాకాలనీకి చెందిన రానుకుమార్ పెద్ద కుమారుడు గిరీష్(25) ఈ నెల 11వ తేదీ సాయంత్రం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ రాంరెడ్డిబావి వద్ద గల ఓ హౌస్(నీటి సంపు)లో శవమై కనిపించాడు.

ఈ కేసులో పోలీసులు తొలుత రాజును, ఆ తర్వాత గిరీష్ సోదరుడు మధుసూదన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా... వారే హత్య చేసినట్టు వెల్లడైంది. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడుతుండడంతో సోదరుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు మధుసూదన్ వెల్లడించాడు. ఈ క్రమంలో 11వ తేదీన గిరీష్‌ను అత్తాపూర్ రాంరెడ్డిబావి వద్దకు తీసుకెళ్లి స్నేహితుడు రాజు సాయంతో నీటి సంపులోకి తోసి తలపై బండరాళ్లను వేశాడు. దీంతో గిరీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం నిందితులు పరారుకాగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement