Younger brother
-
అన్న, వదినను రోడ్డుపై కట్టేసిన తమ్ముడు
సిద్దిపేట కమాన్: అప్పు చెల్లించడం లేదని అన్నా, వదినలను.. ఓ ప్రబుద్ధుడు తన భార్య, కొడుకుతో కలిసి గ్రిల్స్‌కు కట్టేశాడు. సిద్దిపేటలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. దొంతరబోయిన పర్శరాములు, తార దంపతులు ఏడో తరగతి చదివే తమ కుమార్తెతో సిద్దిపేట కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్నారు. పర్శరాములు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అవసరాల నిమిత్తం నాసర్పూరలో నివసిస్తున్న సొంత తమ్ముడు దొంతరబోయిన కనకయ్య వద్ద 8 నెలల క్రితం రూ.1.20 లక్షలు అప్పు తీసుకున్నాడు. నాలుగు నెలల క్రితం రూ.లక్ష తిరిగి చెల్లించాడు. ఈ క్రమంలో శుక్రవారం కౌన్సిలర్ కనకరాజు.. పర్శరాములుకు ఫోన్ చేసి డబ్బుల వివాదంపై మాట్లాడేందుకు తన ఇంటికి రమ్మన్నాడు. దీంతో పర్శరాములు తన భార్య తారతో కలిసి నాసర్‌పూరకు వచ్చారు. అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో కనకరాజు ఆగ్రహం వ్యక్తం చేసి వారిద్దరిని బయటకు పంపించారు. బకాయి ఉన్న రూ.20వేలు, వడ్డీ డబ్బులు చెల్లించాలని తమ్ముడు కనకయ్య, అతడి భార్య భాగ్య, వీరి కుమారుడు భాను కలసి.. పర్శరాములు, అతని భార్య తారను కొట్టి నాసర్‌పూర హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద ఉన్న గ్రిల్స్‌కు తాడుతో కట్టేశారు. స్థానికులు కలి్పంచుకుని వారిని విడిపించడంతో బాధితులు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ అక్కాతమ్ముడు ఎవరంటే (ఫోటోలు)
-
నమ్మరు కానీ రతన్ టాటా తమ్ముడితడే.. చిన్న అపార్ట్మెంట్లో..
Ratan Tata Brother Jimmy Naval Tata: భారతీయ ఆటో మొబైల్ రంగానికి ఆజ్యం పోసిన టాటా కుటుంబం గురించి అందరికి తెలుసు. అయితే ఇప్పుడు టాటా గ్రూప్ అనగానే 'రతన్ టాటా' గుర్తుకు వస్తాడు. అయితే రతన్ టాటాకి వివాహం కాలేదు, కానీ తోబుట్టువులతో కూడిన ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో చెప్పుకోదగ్గ వ్యక్తి రతన్ టాటా తమ్ముడు 'జిమ్మీ నావల్ టాటా'. రతన్ టాటా తమ్ముడంటే ఆయన మాదిరిగానే వ్యాపార లావాదేవీలు బాగా చూసుకునే వ్యాపార వేత్త, బిలీనియర్ అని ఊహిస్తారు. కానీ ఆలా ఊహిస్తే మీ ఊహ తప్పే అవుతుంది. ఎందుకంటే జిమ్మీ నావల్ టాటా వారి వ్యాపార సామ్రాజ్యానికి దూరంగా సాధారణ ప్రజలలో ఒకరుగా కలిసి జీవిస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన ముంబైలో ఒక 2BHK అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. జిమ్మీ నావల్ టాటా మీడియాకి దూరంగా ఉండటమే కాకూండా, వ్యాపారాలన్నింటికీ కూడా దూరంగా ఉంటూ చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. నావల్ టాటా కుమారుడు, రతన్ టాటా తమ్ముడై ఉండి ఇలాంటి జీవితం గడుపుతున్న జిమ్మీ నావల్ టాటాను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. 90వ దశకంలోనే జిమ్మీ నావల్ తన తండ్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన వస్త్ర వ్యాపారంలో వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక టాటా ఆధ్వర్యంలో ఉన్న కంపెనీలలో పనిచేసి అనతి కాలంలోనే విరమణ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒక చిన్న ఫ్లాట్‌లో సామాన్యుడిలా జీవిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) ఈ ఏడాది ప్రారంభంలో రతన్ టాటా తన తమ్ముడు జిమ్మీ టాటాతో కలిసి ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'అవి సంతోషకరమైన రోజులు, మా మధ్య ఏమి రాలేదు' అని ఇందులో రాసారు. ఆ ఫోటో 1945లో తీసుకున్నట్లు ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. వారు చేసే బిజినెస్ ఏంటో తెలుసా?) రతన్ టాటా ఆస్తులు సుమారు రూ. 3500 కోట్లకంటే ఎక్కువ. అయితే ఇప్పటి వరకు చాలా మందికి తెలియని జిమ్మీ నావల్ రతన్ టాటా కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. ఎందుకు ఈయన వ్యాపారాల మీద ఆసక్తి చూపడం లేదు అనేదానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకోవడం వల్ల అన్నింటికీ దూరంగా ఉన్నాడని తెలుస్తుంది. (ఇదీ చదవండి: అమెరికా వద్దు భారత్ ముద్దు.. 60 ఏళ్ల వయసులో 100 వ్యాపారాలు) Did you know of Ratan Tata's younger brother Jimmy Tata who lives a quiet reticent life in a humble 2 bhk flat in Colaba, Mumbai! Never interested in business, he was a very good squash player and would beat me every time. Low profile like the Tata group! pic.twitter.com/hkp2sHQVKq — Harsh Goenka (@hvgoenka) January 19, 2022 RGP ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయాంక్ గతంలో షేర్ చేసిన ఒక ట్విటర్ పోస్ట్‌లో జిమ్మీ టాటా ఒక చిన్న ఫ్లాట్‌లో ఉన్నారని, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదని చెప్పారు. అంతే కాకుండా అతడు మంచి స్క్వాష్ ప్లేయర్ అని తనని (గోయెంకాను) ఎప్పుడూ ఓడించేవాడని చెప్పుకొచ్చాడు. కొన్ని వార్తా పత్రికలు అందించిన సమాచారం ప్రకారం.. జిమ్మీ టాటాకు మొబైల్ ఫోన్ లేదని, కేవలం వార్తాపత్రిక ద్వారా అతని అన్ని అప్డేట్లను పొందుతారని తెలిసింది. -
తమ్ముడిపై ప్రేమ నటించి.. ఇంట్లోకి పిలిచి ఓ అన్న ఘాతుకం
ఖిలా వరంగల్ : ఆస్తి విషయంలో మాట్లాడుకుందా మని ఓ అన్న.. తన సొంత తమ్ముడిని పిలిచి ఇంట్లోకి తీసుకెళ్లాడు. మాటల్లో పెట్టి కర్రలతో కొట్టి.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం 6 గంటలకు కరీమాబాద్ ఉర్సు ప్రతాప్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి భార్య కథనం ప్రకారం..వరంగల్ ఉర్సు కరీమాబాద్ కురుమవాడ వెంకటేశ్వర హైసూ్కల్ సమీప కాలనీలో గోవిందుల కొమ్మాలుకు ముగ్గురు కుమారులు శ్రీని వాస్, శ్రీకాంత్, శ్రీధర్ ఉన్నారు. ఇటీవల శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందాడు. శ్రీధర్‌కు తన తమ్ముడు శ్రీకాంత్(35)తో కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై శ్రీకాంత్ తన అన్న శ్రీధర్‌పై మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు మార్లు శ్రీధర్‌ను మందలించి వదిలేశారు. అన్న శ్రీధర్ అరాచకంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ భార్య రాణితో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వలసవెళ్లాడు. అక్కడే తాపీమేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఇంటి స్థలం విషయం మరోసారి మాట్లాడుకుందామంటూ శ్రీధర్ తన తమ్ముడు శ్రీకాంత్‌ను వరంగల్‌లోని తన ఇంటికి పిలిపించాడు. అన్న మాటలు నమ్మిన తమ్ముడు ఇంట్లోకి రాగానే బలమైన కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. మంటలు తాళలేక రోడ్డుపై పరుగులు పెట్టాడు. శ్రీకాంత్ డ్రెయినేజీలో పడగానే అతడి తలపై శ్రీధర్ బండరాయి ఎత్తేసి హత్య చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ ముస్కు శ్రీనివాస్, ఎస్సై సాంబయ్య, క్లూస్ టీం బృందంతో ఏసీపీ బోనాల కిషన్ చేరుకున్నారు. శ్రీ కాంత్ హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరి శీలించి వివరాలు సేకరించారు. ఆ తర్వాత మృతదేహా న్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. నింది తుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న మృతుడి భార్య రాణి ఘటన స్థలానికి చేరుకొని భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రాథమిక విచారణ.. కరీమాబాద్‌లో జరిగిన హత్య ఘటన వద్ద కర్ర, బండరాయి, పెట్రోల్ డబ్బాను గుర్తించామని పోలీసులు తెలిపారు. శ్రీకాంత్‌పై శ్రీధర్ కర్రతో మోది ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్ పోసి బండరాయితో మోది హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని పేర్కొన్నారు. -
బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్: తమ్ముడిని చంపి, స్టోర్‌రూంలో
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేయొద్దని వారించిన తమ్ముడిని అక్క(మైనర్ బాలిక )అమానుషంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయ్ బరేలి జిల్లాలో ఈ ఘటన గత గురువారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 15 ఏళ్ల బాలిక తన సోదరుడు (9)ని ఇయర్‌ఫోన్ కేబుల్ గొంతుకు బిగించి చంపేసింది. తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో బాయ్ ఫ్రెండ్‌తో అక్క ఫోన్లో చాట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. గంటలు గంటలు ఫోన్ ఎందుకు మాట్లాడతావంటూ గతంలో చాలాసార్లు అక్కను ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని అమ్మానాన్నకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతోవారు బాలికను మందలించారు. అయితే తాజాగా అదే తరహాలో ఫోన్లోమాట్లాడటం గుర్తించి వారించాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో అక్కపై దాడి చేశాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన బాలిక ఇయర్ ఫోన్స్ కేబుల్‌ను అతడి మెడకు బిగించడంతో ఊపరాడక చనిపోయాడు. ఆ తరువాత మృతదేహాన్ని గుట్టుగా స్టోర్ రూంలో దాచి పెట్టి, ఏమీ తెలియనట్టుగా నటించింది. అయితే పిల్లవాడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి తండ్రి పొరుగువారిపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులను కూడా ఆరా తీయాలని భావించారు. మరుసటి రోజు, దుర్వాసన రావడంతో స్టోర్ రూం తెరిచి కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరికి పోలీసుల విచారణలో బాలిక తన నేరాన్ని అంగీకరించింది. అయితే తనపై అమ్మా నాన్నకు పదే పదే ఫిర్యాదు చేయడంతో కోపం వచ్చిందని, కానీ తమ్ముడిని చంపాలని అనుకోలేదని పోలీసులతో వాపోయింది. సోమవారం సాయంత్రం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని రాయ్ బరేలి పోలీస్ సూపరింటెండెంట్ శ్లోక్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితురాలిని జువైనల్ హోంకు తరలించినట్టు చెప్పారు. -
దారుణం: 'నన్ను కాదన్న అమ్మాయిని పెళ్లిచేసుకుంటావా'
సాక్షి, అచ్యుతాపురం: తనను కాదన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే కక్షతో తోడబుట్టిన తమ్ముడిని ఓ అన్న కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం జాలరిపాలెంలో జరిగింది. వివరాలు.. పూడిమడక శివారు జాలరిపాలేనికి చెందిన మడ్డు పోలమ్మ పెద్ద కుమారుడు రాజుకు పెళ్లి చేయడానికి ఇటీవల భీమిలికి చెందిన అమ్మాయిని చూశారు. కానీ ఆ అమ్మాయి పోలమ్మ చిన్న కుమారుడు యర్లయ్య(21)ను చేసుకుంటానని చెప్పింది. దీంతో పోలమ్మ ఆ సంబంధాన్ని యర్లయ్యకు ఖాయం చేసింది. రాజుకు మరో సంబంధం చూస్తానని నచ్చచెప్పింది. మే నెలలో పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టుకున్నారు. యర్లయ్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండడంతో రాజు అసహనానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో సోమవారం యర్లయ్య ఫోన్ కొనుక్కుంటానని తల్లి పోలమ్మను డబ్బులడిగాడు. ఆమె రూ.2 వేలు ఇవ్వగా.. అవి సరిపోవని రూ.4వేలు కావాలంటూ తల్లితో గొడవ పడ్డాడు. ఇంతలో యర్లయ్యను అడ్డుకున్న రాజు.. వలను అల్లడానికి ఉపయోగించే ఒరుగు అని పిలిచే కత్తిని అమాంతం తమ్ముడి గొంతులో దించాడు. వెంటనే అక్కడ్నుంచి పారిపోయాడు. యర్లయ్యను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ జరిపారు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. తనను కాదన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే కక్షతోనే తమ్ముడిని హత్య చేసినట్లు రాజు అంగీకరించాడని సీఐ నారాయణరావు, ఎస్ఐ లక్ష్మణరావు వెల్లడించారు. -
ఎంత కర్కశం: తోబుట్టువులనే కనికరం లేకుండా..
ఆస్తిపై పెంచుకున్న మమకారం ఆప్తులపై లేకుండా పోయింది. రూ.5 లక్షల డబ్బుపై పెరిగిన ప్రేమ రక్తం పంచుకు పుట్టిన అన్న, అక్కలపై ద్వేషానికి కారణమైంది. పరిహారం విషయంలో తలెత్తిన స్ఫర్థ ఓ కుటుంబంలో దారుణ హత్యలకు దారి తీసింది. తలకెక్కిన దురాశ విచక్షణను కోల్పోయేలా చేసింది. రణస్థలం మండలం రామచంద్రాపురం గ్రామంలో ఓ వ్యక్తి సొంత అన్న, అక్కలనే హత్య చేశాడు. కేవలం ఆస్తిలో వాటా డబ్బు కోసం తోబుట్టువులను కర్కశంగా నరికి మట్టు పెట్టాడు. రణస్థలం (శ్రీకాకుళం): కొవ్వాడ మత్స్యలేశం పంచాయతీలో గల రామచంద్రాపురం గ్రామంలో గొర్లె సన్యాసిరావు (54), అక్క జయమ్మ(50)లు ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. సొంత తమ్ముడు రామకృష్ణ వీరి పాలిట కాలయముడయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జేఆర్ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్కశంగా దాడి.. గ్రామంలో ఉదయం 5.45 గంటల సమయంలో గొర్లె సన్యాసిరావు తన ఇంటి వ ద్ద ఆవు పాలు పితుకుతుండగా.. వెనక నుంచి వచ్చిన రామకృష్ణ కత్తిలో బలంగా అతడి తలపై వేటు వేశాడు. ఆ తర్వాత కూడా మెడ, ఇతర భాగాలపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. బాధతో అతను అరుస్తుంటే.. లోపల నుంచి అక్క జయమ్మ బయటకు వచ్చి చూసి నిశ్చేష్టురాలైంది. దివ్యాంగురాలైన ఆమె వచ్చి ప్రతిఘటించగా రామకృష్ణ ఆమెపైనా దాడికి దిగా డు. శరీరమంతా కత్తితో గాయాలు చేయడంతో అక్కడికక్కడే చనిపోయింది. చుట్టుపక్కల వారు చూసి వచ్చే సరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయా డు. సన్యాసిరావును ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా కొద్ది దూరం వెళ్లే సరికే ప్రాణాలు వదిలేశాడు. దీనిపై సమాచారం అందుకున్న శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహీంద్ర, సీఐ వి.చంద్రశేఖర్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఘటన జరిగిన రెండు గంటల తర్వాత నిందితుడు రామకృష్ణ జేఆర్ పురం పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. జేఆర్ పురం ఎస్ఐ కె.వాసునారాయణ మృతదేహాలను శవ పంచనామాకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారసత్వ ఇంటితోనే వివాదం.. రామచంద్రాపురంలో సన్యాసిరావు కుటుంబానికి ఆస్తులు ఉన్నాయి. సన్యాసిరావు ఇద్దరు అక్కలు అవివాహితులు కావడంతో వారు అన్నతోనే ఉంటున్నారు. రామకృష్ణ తన కుటుంబంతో వేరేగా ఉంటున్నారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంలో భాగంగా ఊరి వారికి పరిహారాలు చెల్లిస్తున్నారు. పరిహారాల పంపిణీలో భాగంగా వీరికి పంపకాలు జరిగిపోయాయి. అయితే అవివాహితులైన మహిళలు ఇంతకు ముందు ఓ పెంకుటింట్లో ఉండేవారు. ఆ ఇంటికి కూడా రూ.16 లక్షల వరకు పరిహారం వచ్చింది. ఆ డబ్బులో తనకు వాటా కావాలని రామకృష్ణ పంచాయతీ పెట్టాడు. ఆడవాళ్ల సొమ్ము మనకు వద్దని సన్యాసిరావు సర్ది చెప్పినా వినలేదు. తన వాటాగా రూ.5 లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీనిపై తోబుట్టువుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. శనివారం రాత్రి కూడా దీనిపై వాదోపవాదాలు జరిగాయి. ఆఖరకు రామకృష్ణకు రూ.5లక్షలు ఇవ్వడానికి సన్యాసిరావు, అక్కలు ఒప్పుకున్నారు. అయితే ఇకపై తమతో ఆర్థిక లావాదేవీలేవీ పెట్టుకోకూడదని, తమను ఏ విషయంలోనూ వేధించకూడదని పెద్ద మనుషుల సమక్షంలో రాత పూర్వకంగా ఒప్పుకోవాలనే డిమాండ్ పెట్టారు. ఈ డిమాండ్ విషయంలో రామకృష్ణ కోపోద్రిక్తుడయ్యాడు. తానెందుకు సంతకం పెట్టాలంటూ గొడవ పెట్టుకున్నాడు. తెల్లవారే సరికి ఆ కోపంతోనే అన్న, అక్కలపై దాడి చేసి హతమార్చాడని స్థానికులు చెబుతున్నారు. ముగ్గురు కూతుళ్ల భవిష్యత్ ఏంటి..? సన్యాసిరావుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు మే 26న పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా తీశారు. అంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. మరోవైపు నిందితుడు రామకృష్ణ తన కూతురికి ఓ పోలీసు అధికారితో వివాహం చేయడం గమనార్హం. సన్యాసిరావు మృతితో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి.. ‘అప్పు తీరుస్తారా.. బిడ్డను అమ్ముతారా..?’ -
తీవ్ర విషాదంలో డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ శనివారం న్యూయార్క్‌లో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. 72 ఏండ్ల రాబర్ట్ ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతూ మన్‌హటన్‌లోని న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ట్రంప్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. 2016లో రాబర్ట్ ట్రంప్ తన సోదరుడితో పాటు రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా మిల్‌బ్రూక్‌లో అనేక కార్యక్రమాలు నిర్వహించి నిధులు సైతం సేకరించారు. శుక్రవారం రాత్రి న్యూజెర్సీకి వెళ్ళిన ట్రంప్ తన సోదరుడిని పరామర్శించేందుకు న్యూయార్క్ వెళ్లాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా తమ్ముడు ఆకస్మిక మృతి ట్రంప్‌ను బాగా కలచివేసింది.1948లో జన్మించిన రాబర్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి నలుగురి సోదరులలో ఒకరు. రాబర్ట్ మృతికి బరువెక్కిన హృదయంతో ట్రంప్ సంతాపం తెలిపారు. 'నా అద్భుత సోదరుడు రాబర్ట్ శాంతియుతంగా ఈ రాత్రి కన్నుమూశాడు. అతను నా సోదరుడు మాత్రమే కాదు.. మంచి స్నేహితుడు. అతడి జ్ఞాపకాలు నా హృదయంలో శాశ్వతంగా ఉంటాయి. ఐ లవ్ యూ రాబర్ట్. ఇక మీదట విశ్రాంతి తీసుకో' అని అమెరికా అధ్యక్షుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.(టిక్‌టాక్.. అమెరికా ఆస్తులను అమ్ముకోండి) -
అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి
నల్గొండ: వ్యక్తిగత వివాదాలతో సొంత అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. నల్గొండలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణానికి చెందిన సహవీర్, సహకీర్ సోదరులు. వారి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. శుక్రవారం ఉదయం స్థానిక ప్రకాశం బజార్ చేపల మార్కెట్లో ఉన్న సహవీర్ను సహకీర్ గొడ్డలితో నరికాడు. చుట్టుపక్కల వారు అడ్డుకోవటంతో సహకీర్ అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సహవీర్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
అన్న చేతిలో తమ్ముడి హతం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో అన్న సొంత తమ్ముడిని హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. రమేశ్ అనే వ్యక్తి తన తమ్ముడు శ్రీనివాస్‌ని హత్య చేశాడు. గురువారం రాత్రి డబ్బుల విషయమై అన్నదమ్ములు గొడవపడ్డారు. దీంతో రమేశ్ కోపంతో కర్ర తీసుకుని శ్రీనివాస్ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్త స్రావమైన శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సొంత తమ్ముడే హతమార్చాడు
అత్తాపూర్ (రంగారెడ్డి) : అన్న పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక అతడిని.. సొంత తమ్ముడే తన స్నేహితుడితో కలిసి హతమార్చాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులిద్దరినీ రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ఉమేందర్ తెలిపిన వివరాల ప్రకారం... అత్తాపూర్ హుడాకాలనీకి చెందిన రానుకుమార్ పెద్ద కుమారుడు గిరీష్(25) ఈ నెల 11వ తేదీ సాయంత్రం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ రాంరెడ్డిబావి వద్ద గల ఓ హౌస్(నీటి సంపు)లో శవమై కనిపించాడు. ఈ కేసులో పోలీసులు తొలుత రాజును, ఆ తర్వాత గిరీష్ సోదరుడు మధుసూదన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా... వారే హత్య చేసినట్టు వెల్లడైంది. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడుతుండడంతో సోదరుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు మధుసూదన్ వెల్లడించాడు. ఈ క్రమంలో 11వ తేదీన గిరీష్‌ను అత్తాపూర్ రాంరెడ్డిబావి వద్దకు తీసుకెళ్లి స్నేహితుడు రాజు సాయంతో నీటి సంపులోకి తోసి తలపై బండరాళ్లను వేశాడు. దీంతో గిరీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం నిందితులు పరారుకాగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరించినట్లు పోలీసులు తెలిపారు. -
అన్నను చంపిన తమ్ముడు
మహబూబ్‌నగర్(బిజినేపల్లి): ఆస్తుల పంపకం దగ్గర గొడవపడి క్షణికావేశంలో అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లిలో ఆదివారం జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన రైతు చిన్న నిరంజన్, చంద్రమ్మ దంపతులకు ఆంజనేయులు, యాదయ్య, మార్కండేయ ముగ్గురు కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రులతోపాటు మార్కండేయ వ్యవసాయ పనులు చూస్తుంటాడు. ఆంజనేయులు, యాదయ్య హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు. ఆంజనేయులు(24) ఎప్పుడొచ్చినా ఆస్తి విషయంలో తరచూ తల్లిదండ్రులతోపాటు తమ్ముడు మార్కండేయతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం మరోమారు గొడవ జరిగింది. మాటామాట పెరిగి చేతికందిన కత్తితో ఆంజనేయులుపై మార్కండేయ దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సరస్వతి ఫిర్యాదుమేరకు ఆంజనేయులి తల్లిదండ్రులు, తమ్ముడు మార్కండేయపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అన్నను చంపిన తమ్ముడు
మహబూబ్ నగర్ (బిజినేపల్లి) : కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా బిజేనేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని శయనిపల్లి గ్రామంలో ఆంజనేయలు అనే వ్యక్తి.. అతని తమ్ముడు మార్కేండయపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఆస్తి కోసం తమ్ముడి హత్య
దోమ (రంగారెడ్డి జిల్లా) : ఆస్తి కోసం ఓ యువకుడు అక్క, బావతో కలిసి సొంత తమ్ముడిని హత్య చేశాడు. అడ్డువచ్చిన తండ్రిని కూడా తీవ్రంగా గాయపర్చాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నారాయణపూర్ గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దోమ మండలం బొంపల్లి గ్రామానికి చెందిన ముద్దం శ్రీనివాస్(25)కు ఆస్తి విషయంలో అన్న, సోదరితో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తన పొలంలో పని చేస్తున్న శ్రీనివాస్‌పై అన్న కృష్ణయ్య, అక్క నర్సమ్మ, బావ అంజలయ్యలు కలిసి దాడి చేశారు. ట్రాక్టర్ సహాయంతో పొలం దున్నుతున్న తమ్ముడిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా సంఘటనా స్థలంలోనే పొలం పనులు చేస్తున్న తండ్రి ముద్దం రామయ్య(55) వారిని అడ్డుకోవడంతో అతనిపై కూడా దాడి చేశారు. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉండటంతో గ్రామస్తులు పరిగిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా నిందితులు ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
మంత్రాల నెపంతో అన్నను చంపిన తమ్ముడు
భూతగాదాల నేపథ్యంలో మంత్రాల నెపం చూపి అన్నను చంపాడో తమ్ముడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం కమ్మరిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన ధర్మయ్యను చంపేసిన తమ్ముడు వెంకటయ్య.. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మంత్రాలు వేస్తున్నందువల్లే అతడిని చంపినట్లు చెప్పాడు. గత కొంత కాలంగా పాముకాటు, తేలుకాటుకు ధర్మయ్య మంత్రాలు వేసేవాడు. ఇప్పుడు మనుషులపై కూడా మంత్రాలు ప్రయోగిస్తున్నాడని వెంకటయ్య ఆరోపించాడు. కానీ, తమకున్న వ్యవసాయ భూమిని దక్కించుకోడానికే ఇలా మంత్రాల నెపం పెట్టుకుని ధర్మయ్యను పొట్టన పెట్టుకున్నట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తమ్మున్ని చంపిన ఆన్న
-
తమ్ముడ్ని కత్తితో నరికి చంపిన అన్న
విశాఖపట్నం: అరకు సుకూరుగూడలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సొంత తమ్ముడ్ని అన్న కత్తితో నరికి చంపాడు. అనంతరం నిందితుడు స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
మంత్రి తమ్ముడి తడాఖా
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్‌లోని శాయంపేటలో ప్రభుత్వ పాఠశాల పక్కనే 305/ఏబీ సర్వే నెంబర్లో 2.16 ఎకరాల స్థలముంది. 23 ఏళ్ల కిందట టీచర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. కట్కు వీరయ్య నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. సొసైటీ అధ్యక్షుడు డోలి రాజలింగం పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పట్టాదారు అడంగల్ పహాణీలో ఆయన పేరే ఉంది. ఈ స్థలంలో ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్‌ను సైతం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆమోదించింది. సొసైటీ పరిధిలో 27 మంది సభ్యులు ఇక్కడి ప్లాట్లను కొనుగోలు చేశారు.. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. హద్దు రాళ్లు కూడా పాతుకున్నారు. కాలక్రమంలో ఈ స్థలానికి డిమాండ్ పెరిగింది. నగరం విస్తరించిన కొద్దీ.. శాయంపేట ఖరీదైన ప్రాంతంగా అవతరించింది. ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. 1991లో సొసైటీ సభ్యులు ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు ఇక్కడ చదరపు గజం రేటు కేవలం 40 రూపాయలే. ఇదే ప్రాంతం లో ఇప్పుడు గజం రూ.5000 నుంచి రూ.6000 ధర పలుకుతోంది. ఈ లెక్కన టీచర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరిట ఉన్న స్థలం విలువ రూ.5 కోట్లు దాటింది. అంత ఖరీదైన స్థలం కావడంతో మంత్రి తమ్ముడు దీనిపై కన్నేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఏళ్లకేళ్లుగా తమ స్వాధీనంలో ఉన్న భూములను ఈ ఏడాది మే నెలలో ఆయన పేరిట ఎలా మార్చారో అంతు చిక్కటం లేదని, బోగస్ రిజిస్ట్రేషన్ చేయించుకొని భూమి కబ్జాకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ‘రసుమతి హోటల్స్ లిమిటెడ్, బాలసముద్రం-హన్మకొండ’ చిరునామాతో మేనేజింగ్ డెరైక్టర్ రామ్మోహన్ పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందని.. ప్లాట్ల యజమానులకు సంబంధం లేకుండా అక్రమంగా ఈ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో ఆరా తీయాలని డిమాండ్ చేస్తున్నారు. హద్దురాళ్లు తొలగించి దౌర్జన్యానికి పాల్పడుతున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, తమ లేఅవుట్ ప్లాట్లకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పాటు... ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వడంతో ఈ బాగోతం బట్టబయలైంది.