అన్న చేతిలో తమ్ముడి హతం | sibling rivalry, younger brother killed by elder | Sakshi
Sakshi News home page

అన్న చేతిలో తమ్ముడి హతం

Published Fri, Oct 16 2015 12:26 PM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

sibling rivalry, younger brother killed by elder

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో అన్న సొంత తమ్ముడిని హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.  రమేశ్ అనే వ్యక్తి తన తమ్ముడు శ్రీనివాస్ని హత్య చేశాడు.

గురువారం రాత్రి డబ్బుల విషయమై అన్నదమ్ములు గొడవపడ్డారు. దీంతో రమేశ్ కోపంతో కర్ర తీసుకుని శ్రీనివాస్ తలపై  బలంగా కొట్టాడు. తీవ్ర రక్త స్రావమైన శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement