మృతుడు శ్రీకాంత్.. (ఫైల్), రోధిస్తున్న అతని భార్య
ఖిలా వరంగల్ : ఆస్తి విషయంలో మాట్లాడుకుందా మని ఓ అన్న.. తన సొంత తమ్ముడిని పిలిచి ఇంట్లోకి తీసుకెళ్లాడు. మాటల్లో పెట్టి కర్రలతో కొట్టి.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం 6 గంటలకు కరీమాబాద్ ఉర్సు ప్రతాప్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి భార్య కథనం ప్రకారం..వరంగల్ ఉర్సు కరీమాబాద్ కురుమవాడ వెంకటేశ్వర హైసూ్కల్ సమీప కాలనీలో గోవిందుల కొమ్మాలుకు ముగ్గురు కుమారులు శ్రీని వాస్, శ్రీకాంత్, శ్రీధర్ ఉన్నారు. ఇటీవల శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందాడు.
శ్రీధర్‌కు తన తమ్ముడు శ్రీకాంత్(35)తో కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై శ్రీకాంత్ తన అన్న శ్రీధర్‌పై మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు మార్లు శ్రీధర్‌ను మందలించి వదిలేశారు. అన్న శ్రీధర్ అరాచకంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ భార్య రాణితో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వలసవెళ్లాడు. అక్కడే తాపీమేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఇంటి స్థలం విషయం మరోసారి మాట్లాడుకుందామంటూ శ్రీధర్ తన తమ్ముడు శ్రీకాంత్‌ను వరంగల్‌లోని తన ఇంటికి పిలిపించాడు. అన్న మాటలు నమ్మిన తమ్ముడు ఇంట్లోకి రాగానే బలమైన కర్రతో తీవ్రంగా కొట్టాడు.
ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. మంటలు తాళలేక రోడ్డుపై పరుగులు పెట్టాడు. శ్రీకాంత్ డ్రెయినేజీలో పడగానే అతడి తలపై శ్రీధర్ బండరాయి ఎత్తేసి హత్య చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ ముస్కు శ్రీనివాస్, ఎస్సై సాంబయ్య, క్లూస్ టీం బృందంతో ఏసీపీ బోనాల కిషన్ చేరుకున్నారు. శ్రీ కాంత్ హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరి శీలించి వివరాలు సేకరించారు. ఆ తర్వాత మృతదేహా న్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. నింది తుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న మృతుడి భార్య రాణి ఘటన స్థలానికి చేరుకొని భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ప్రాథమిక విచారణ..
కరీమాబాద్‌లో జరిగిన హత్య ఘటన వద్ద కర్ర, బండరాయి, పెట్రోల్ డబ్బాను గుర్తించామని పోలీసులు తెలిపారు. శ్రీకాంత్‌పై శ్రీధర్ కర్రతో మోది ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్ పోసి బండరాయితో మోది హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment