brother attacks
-
తమ్ముడిపై ప్రేమ నటించి.. ఇంట్లోకి పిలిచి ఓ అన్న ఘాతుకం
ఖిలా వరంగల్ : ఆస్తి విషయంలో మాట్లాడుకుందా మని ఓ అన్న.. తన సొంత తమ్ముడిని పిలిచి ఇంట్లోకి తీసుకెళ్లాడు. మాటల్లో పెట్టి కర్రలతో కొట్టి.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం 6 గంటలకు కరీమాబాద్ ఉర్సు ప్రతాప్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి భార్య కథనం ప్రకారం..వరంగల్ ఉర్సు కరీమాబాద్ కురుమవాడ వెంకటేశ్వర హైసూ్కల్ సమీప కాలనీలో గోవిందుల కొమ్మాలుకు ముగ్గురు కుమారులు శ్రీని వాస్, శ్రీకాంత్, శ్రీధర్ ఉన్నారు. ఇటీవల శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందాడు. శ్రీధర్‌కు తన తమ్ముడు శ్రీకాంత్(35)తో కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై శ్రీకాంత్ తన అన్న శ్రీధర్‌పై మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు మార్లు శ్రీధర్‌ను మందలించి వదిలేశారు. అన్న శ్రీధర్ అరాచకంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ భార్య రాణితో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వలసవెళ్లాడు. అక్కడే తాపీమేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఇంటి స్థలం విషయం మరోసారి మాట్లాడుకుందామంటూ శ్రీధర్ తన తమ్ముడు శ్రీకాంత్‌ను వరంగల్‌లోని తన ఇంటికి పిలిపించాడు. అన్న మాటలు నమ్మిన తమ్ముడు ఇంట్లోకి రాగానే బలమైన కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. మంటలు తాళలేక రోడ్డుపై పరుగులు పెట్టాడు. శ్రీకాంత్ డ్రెయినేజీలో పడగానే అతడి తలపై శ్రీధర్ బండరాయి ఎత్తేసి హత్య చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ ముస్కు శ్రీనివాస్, ఎస్సై సాంబయ్య, క్లూస్ టీం బృందంతో ఏసీపీ బోనాల కిషన్ చేరుకున్నారు. శ్రీ కాంత్ హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరి శీలించి వివరాలు సేకరించారు. ఆ తర్వాత మృతదేహా న్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. నింది తుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న మృతుడి భార్య రాణి ఘటన స్థలానికి చేరుకొని భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రాథమిక విచారణ.. కరీమాబాద్‌లో జరిగిన హత్య ఘటన వద్ద కర్ర, బండరాయి, పెట్రోల్ డబ్బాను గుర్తించామని పోలీసులు తెలిపారు. శ్రీకాంత్‌పై శ్రీధర్ కర్రతో మోది ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్ పోసి బండరాయితో మోది హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని పేర్కొన్నారు. -
సోదరుడు కాదు..ఉన్మాది
సాక్షి, కర్నూలు : దివ్యాంగుడితో పెళ్లికి సిద్ధపడిన సొంత పిన్ని కూతురిపై ఓ కసాయి వ్యక్తి హత్యాయత్నం చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాలలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి లక్ష్మిదేవి తెలిపిన వివరాల మేరకు.. నంద్యాలకు చెందిన లక్ష్మిదేవికి, మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన అమర్నాథ్కు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత వీరు విజయవాడకు వెళ్లి అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఏకైక కుమార్తె జ్యోతిని విజయవాడలోనే డిగ్రీ వరకు చదివించారు. ఉన్నత చదువులు చదివించే స్తోమత లేకపోవడంతో కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. కర్నూలు జిల్లా మిడుతూరు మండలం రోళ్లపాడు గ్రామానికి చెందిన సుదర్శన్‌తో వివాహం చేయాలని నిర్ణయించుకుని 20 రోజుల క్రితం నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. సుదర్శన్ బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు చిన్నతనంలోనే పోలియో సోకగా, ఒక కాలు, ఒక చేయి సరిగా పనిచేయవు. అయినా ఉన్నత విద్యావంతుడు కావడంతో పెళ్లికి సిద్ధపడ్డారు. అయితే రుద్రవరం మండలం తిప్పారెడ్డిపాలెంలో ఉండే జ్యోతి సొంత పెద్దమ్మ రామలక్ష్మమ్మ కుమారుడు సుబ్బరాయుడికి ఈ సంబంధం నచ్చలేదు. దివ్యాంగుడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావంటూ తరచూ ఫోన్‌చేసి బెదిరించేవాడు. ఈ క్రమంలో జ్యోతి తన తల్లితో కలిసి నంద్యాలలోని నూనెపల్లెలో ఉన్న తాత ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న సుబ్బరాయుడు వారితో మాట్లాడేందుకు నూనెపల్లెకు చేరుకున్నాడు. పెళ్లి రద్దు చేసుకోవాలని గట్టిగా గద్దించాడు. ఇందుకు తల్లీకూతుళ్లు ససేమిరా అనడంతో జ్యోతిని చంపటానికి సిద్ధపడ్డాడు. ఆమె తల్లి స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన వెంటనే కూరగాయలు తరుగుతున్న జ్యోతి చేతిలోని కత్తిని లాక్కుని ఆమె మెడపై పొడిచాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయటంతో సుబ్బరాయుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువతిని ఆమె తల్లి 108 సహాయంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెడ నరాలు తెగిపోవటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జ్యోతి ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ సుదర్శన్ ప్రసాద్ కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
తమ్ముళ్లే కడతేర్చారు!
మద్దూరు (కొడంగల్): ఒకే రక్తం పంచుకుని పుట్టిన తమ్ముల్లే.. చిన్నపాటి తగాదాలతో సొంత అన్నను బండరాయితో మోది హతమార్చారు. ఈ ఘటన మండలంలోని గోకుల్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త అంజయ్య(29) తండ్రి గోవిందు కొంతకాలం క్రితం మృతి చెందడంతో హైదరాబాద్‌లో కూలీ పనిచేసుకుంటూ తన ఇద్దరు తమ్ముళ్లు (కొత్త రాజు, కొత్త రమేష్)తోపాటు తల్లి తిరుమలమ్మ, భర్త వదిలేసిన అక్క అంజమ్మను పోషిస్తున్నాడు. పెద్ద తమ్ముడు కొత్త రాజు కూడా హైదరాబాద్‌లో కూలీ పనిచేస్తుండేవాడు. గ్రామంలో తల్లి తిరుమలమ్మ, అక్క అంజమ్మ, చిన్న తమ్ముడు రమేష్ ఉండేవారు. మరో చెల్లెలు అనితను గ్రామంలోనే ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే తిమ్మారెడ్డిపల్లిలో బావాజీ జాతర జరుగుతుండడంతో గత నాలుగు రోజుల క్రితం కొత్త అంజయ్య గ్రామానికి వచ్చాడు. అలాగే ఒక తర్వాత తమ్ముడు కొత్త రాజు సైతం గ్రామానికి వచ్చాడు. కొంతకాలం క్రితం నిర్మించిన ఇంటిపై ఉన్న అప్పు విషయమై శనివారం రాత్రి కొత్త అంజయ్య కుటుంబ సభ్యులకు చెబుతూ పనిచేయాలని ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలు, తల్లికి చెప్పాడు. ఇదే క్రమంలో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో ఇద్దరు తమ్ముళ్లు రాజు, రామేష్‌లు బండరాయి తీసుకువచ్చి కొత్త అంజయ్య నెత్తిపై వేశారు. దీంతో అంజయ్య తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరో చెల్లెలు బసుల అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు
-
చెల్లిపై అన్న దాడి
కృష్ణా(కంకిపాడు): సొంత చెల్లిపై అన్న కత్తితో దాడి చేసిన సంఘటన కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పొద్దుటూరులో జరిగింది. వాణి(30) అనే ఆశావర్కర్‌పై తన అన్న కోటేశ్వరరావు కూరగాయలు తరిగే కత్తితో తలపై దాడిచేయడంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంటి స్థలం విషయమై గొడవపడి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. తల్లి పేరిట ఉన్న నాలుగు సెంట్ల స్థలాన్ని తన పేరు మీద రాయాలని ఒత్తిడిచేశాడు. వాణికి ఇంకా వివాహం కానందున మొత్తం స్థలం ఇవ్వడం కుదరదని తల్లి చెప్పడంతో కోపంతో ఈ దురాగతానికి పాల్పడ్డాడు. గతంలోనూ చెల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించాడని, కొంతకాలం తప్పించుకు తిరిగాడని స్థానికులు తెలిపారు. తల్లి, చెల్లి ఒక ఇంట్లో ఉంటుండగా పక్కనే ఉన్న ఇంట్లో ఇతను ఒక్కడే ఉంటున్నాడు. ఇతనికి భార్య చనిపోయింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.