చెల్లిపై అన్న దాడి | brother attacks sister with knife | Sakshi
Sakshi News home page

చెల్లిపై అన్న దాడి

Mar 19 2017 4:29 PM | Updated on Nov 6 2018 4:10 PM

చెల్లిపై అన్న దాడి - Sakshi

చెల్లిపై అన్న దాడి

సోంత చెల్లిపై అన్న కత్తితో దాడి చేసిన సంఘటన కృష్ణాజిల్లాలో జరిగింది.

కృష్ణా(కంకిపాడు): సొంత చెల్లిపై అన్న కత్తితో దాడి చేసిన సంఘటన కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పొద్దుటూరులో జరిగింది. వాణి(30) అనే ఆశావర్కర్‌పై తన అన్న కోటేశ్వరరావు కూరగాయలు తరిగే కత్తితో తలపై దాడిచేయడంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంటి స్థలం విషయమై గొడవపడి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. తల్లి పేరిట ఉన్న నాలుగు సెంట్ల స్థలాన్ని తన పేరు మీద రాయాలని ఒత్తిడిచేశాడు.

వాణికి ఇంకా వివాహం కానందున మొత్తం స్థలం ఇవ్వడం కుదరదని తల్లి చెప్పడంతో కోపంతో ఈ దురాగతానికి పాల్పడ్డాడు. గతంలోనూ చెల్లిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించాడని, కొంతకాలం తప్పించుకు తిరిగాడని స్థానికులు తెలిపారు. తల్లి, చెల్లి ఒక ఇంట్లో ఉంటుండగా పక్కనే ఉన్న ఇంట్లో ఇతను ఒక్కడే ఉంటున్నాడు. ఇతనికి భార్య చనిపోయింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement