property clashes
-
Viveka Case: వివేకా హత్య కుటుంబ ఆస్తి కోసమే!
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుటుంబ ఆస్తి వివాదాలే ప్రధాన కారణమని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. కుటుంబ వారసత్వ ఆస్తి కోసమే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈ హత్య చేయించారని ఆధారాలతో సహా వివరించారు. వివేకా తన రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడి పేరిట రాసిన నోటరీ వీలునామాను నిందితులు నర్రెడ్డి కుటుంబానికి అందచేశారని తెలిపారు. షమీమ్‌కు వాటా ఇవ్వకుండా వివేకా ఆస్తి మొత్తాన్ని సునీత తన పేరిట మ్యుటేషన్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్ దురుద్దేశపూరితంగా ఈ అంశాలపై దర్యాప్తు చేయకుండా పక్కదారి పట్టించారన్నారు. అధికారికంగా బాధ్యతలు స్వీకరించటానికి మూడున్నర నెలల ముందు నుంచే రాంసింగ్ దర్యాప్తు చేపట్టడం, సాక్షులు చెప్పినదానికి భిన్నంగా వాంగ్మూలాలను నమోదు చేయడాన్ని ప్రస్తావించారు. ఈమేరకు ఎంపీ అవినాశ్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు సవివరంగా రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలు, అనంతర పరిణామాలను లేఖలో వివరించారు. హత్యలో పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఇప్పించిన వాంగ్మూలం పూర్తిగా అసత్యాల పుట్ట అని స్పష్టం చేశారు. వివేకా బాత్రూమ్లో లభ్యమైన గుర్తు తెలియని వేలి ముద్రలు ఎవరివి? అనే విషయాన్ని సీబీఐ పట్టించుకోకపోవడాన్ని ఎంపీ అవినాశ్ లేఖలో ప్రస్తావించారు. కడప ఎంపీ టికెట్‌పై ఎలాంటి సందిగ్దత లేదని స్పష్టం చేస్తూ హత్యకు ముందు రోజు వరకు ఎంపీగా తన గెలుపు కోసం వివేకా ప్రచారం చేశారని గుర్తు చేశారు. రాంసింగ్ ఉద్దేశపూర్వకంగా విస్మరించిన అంశాలను పునఃసమీక్షించి ఐపీసీ 457, 460, 394, 398, 302 సెక్షన్ల కింద సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు. వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30 లోగా పూర్తి చేయాలని న్యాయస్థానం సీబీఐకి గడువు నిర్దేశించింది. అంటే అప్పటిలోగా సీబీఐ తుది చార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 19న సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాశ్‌రెడ్డి ఈ లేఖను రాశారు. సీబీఐ నమోదు చేసి న్యాయస్థానానికి సమర్పించిన సాక్షుల వాంగ్మూలాలు, అంతకు ముందు ఛార్జ్షీట్లలో పేర్కొన్న అంశాలను విశ్లేషించిన అనంతరం తాను సహేతుకంగా ఈ సందేహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీబీఐ గత గత ఛార్జ్ షీట్ల లో విస్మరించిన కీలక అంశాలను పునసమీక్షించి సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేయలని కోరారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి లేఖలో ప్రస్తావించిన ప్రధానాంశాలు సంక్షిప్తంగా... పక్కదారి పట్టించిన రాంసింగ్ రాంసింగ్ దర్యాప్తు అధికారిగా 2021 నవంబరు 9న అధికారికంగా బాధ్యతలు స్వీకరించగా అప్పటికి మూడున్నర నెలల ముందే సీఆర్పీసీ నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబరు 2నే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. నాతోపాటు నా తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే సాక్షుల పేరిట వాంగ్మూలాలు నమోదు చేశారు. సాక్షులు చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలాలు నమోదు చేసి తన కింది అధికారులతో వాటిపై సంతకాలు చేయించారు. సీఐ శంకరయ్య, అభిషేక్‌రెడ్డి చెప్పని విషయాలను చెప్పినట్లుగా రాంసింగ్ ఏకపక్షంగా వాంగ్మూలాలను నమోదు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ శంకరయ్య కడప ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. తాను చెప్పినట్లు అబద్ధాలు చెప్పాలని ఉదయకుమార్‌రెడ్డిని రాంసింగ్ చిత్రహింసలకు గురి చేయడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021 నవంబర్ 9వరకు రాంసింగ్ దర్యాప్తు కొనసాగించి రెండు చార్జ్షీట్లు దాఖలు చేశారు. వివేకా రెండో వివాహం అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. బెంగళూరు భూవివాదం కట్టుకథే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి రాంసింగ్ ఇప్పించిన వాంగ్మూలంలోని అంశాలు పూర్తి అవాస్తవమని సీబీఐ దర్యాప్తులోనే వెల్లడైంది. బెంగళూరులోని ఓ భూవివాదానికి సంబంధించి డబ్బుల కోసం వివేకాను హత్య చేయమని, తనకు వైఎస్ భాస్కర్‌రెడ్డి సహకారం ఉందని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. బెంగళూరు భూవివాదానికి సంబంధించి 10 మందిని సీబీఐ విచారించింది. ఆ భూమికి సంబంధించిన పత్రాలు నకిలీవని తేలడంతో వాటిని బెంగళూరుకు చెందిన వై.వెంకట ప్రసాద్‌కు అప్పటికే అప్పగించేసినట్టు వెల్లడైంది. అంటే వివేకా హత్యకు చాలా నెలల ముందే బెంగళూరు భూవివాదం సమసిపోయింది. దస్తగిరి వాంగ్మూలం పూర్తిగా అవాస్తవమని స్పష్టమైంది. ఆ వాంగ్మూలం ఆధారంగా రాంసింగ్ దర్యాప్తు చేయడం దురుద్దేశపూరితమే. చెక్ పవర్ రద్దుతో ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ సభ్యులు తన చెక్ పవర్ రద్దు చేయడంతో వివేకా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విపరీతంగా మద్యానికి బానిసయ్యారు. మోసగాడైన సునీల్ యాదవ్ చెప్పిన వజ్రాల కథను విశ్వసించారు. వాటిని విక్రయించి డబ్బులు ఇప్పించాలని సునీల్ యాదవ్ కోరడంతో తన వాహనాన్ని ఇవ్వడంతోపాటు అతడితో కలసి పలు ప్రాంతాలు తిరిగారు. తరువాత సునీల్ యాదవ్ చెప్పినదంతా కట్టుకథేనని ఎర్ర గంగిరెడ్డి గ్రహించాడు. అప్పటి నుంచి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి వివేకా ఇంటికి రావడం మానేశారు. వారిద్దరి కుటుంబాల్లో మహిళలతో వివేకాకు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో వారిద్దరూ ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వివేకాపై దాడి చేసిన తరువాత ఆయన మర్మాంగంపై సునీల్ యాదవ్ కాలితో తన్ని తీవ్రంగా దూషించారు. నర్రెడ్డి కుటుంబానిదే ఆ కుట్ర కుటుంబ వారసత్వ ఆస్తి కోసమే వివేకానందరెడ్డిని హత్య చేశారు. ఆ హత్య వెనుక వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఇతర నర్రెడ్డి కుటుంబ సభ్యులున్నారు. ఎందుకంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వివేకా తన రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడు షెహన్‌షాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చలేకపోయారు. తన కుమారుడి విద్యాభ్యాసం, భవిష్యత్ కోసం తన ఆస్తిలో కొంత వాటా రాసివ్వాలనుకున్నారు. కుటుంబ ఉమ్మడి ఆస్తిలో తన పేరిట ఉన్న 25 శాతం వాటాను షమీమ్, ఆమె కుమారుడి పేరిట ఆయన నోటరైజ్డ్ వీలునామా రాసినట్లు తెలిసింది. దీన్ని ఆయన మొదటి భార్య, కుమార్తె, అల్లుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్య జరిగింది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిలతో ఎర్ర గంగిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ద్వారానే వారు వివేకా హత్యకు పన్నాగం పన్ని ఉంటారు. తమ కుటుంబ సభ్యులతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని వివేకాపై ఆగ్రహంతో ఉన్న సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డిల సహకారంతో ఎర్ర గంగిరెడ్డి ఈ హత్యకు పథకం వేశాడు. డబ్బు ఆశ చూపించి దస్తగిరిని కూడా పాత్రధారిని చేశారు. వివేకా హత్య తరువాత ఆ ఇంట్లో కొన్ని పత్రాల కోసం ఎర్ర గంగిరెడ్డి, ఇతర నిందితులు గాలించారు. హత్యలో పాలు పంచుకున్న దస్తగిరితోపాటు వాచ్మెన్ రంగయ్య కూడా తన వాంగ్మూలంలో ఇదే విషయాన్ని చెప్పారు. బెంగళూరు భూవివాదం లేదని ఎర్ర గంగిరెడ్డికి తెలుసు కాబట్టి వారు వెతికింది వివేకా రాసిన నోటరీ వీలునామా గురించే అని స్పష్టమవుతోంది. నోటరీ వీలునామాను ఎర్ర గంగిరెడ్డి వివేకా కుమార్తె, అల్లుడికి ఇచ్చి ఉంటారు. అంటే కుటుంబ ఆస్తి కోసమే వివేకాను హత్య చేశారు. వివేకా హత్య తరువాత ఆ కుటుంబ ఆస్తి మొత్తాన్ని సునీత తన పేరిట మ్యుటేషన్ ద్వారా మార్పించుకోవడం గమనార్హం. షమీమ్‌కు ఎలాంటి ఆస్తి దక్కలేదు. ఆస్తి కోసమే వివేకాను ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హత్య చేయించారని ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ సమీప బంధువైన భరత్ యాదవ్ తన వాంగ్మూలంలో చెప్పాడు. తాము చెప్పినట్లు సీబీఐకి అవాస్తవాలు చెప్పకుంటే ఈ కేసులో ఇరికిస్తామని వివేకా పీఏ కృష్ణారెడ్డిని సునీత బెదిరించారు. ఈ వాస్తవాలన్నీ వివేకా హత్య వెనుక నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. సీబీఐ ఈ కోణంలో అసలు దర్యాప్తు చేయలేదు. ఆ వేలిముద్రలు ఎవరివి? వివేకా హత్య జరిగిన ప్రదేశాన్ని కడప పోలీసుల క్లూస్ టీమ్ పరిశీలించి బాత్రూమ్ గోడలు, తలుపు వెనుక ఉన్న వేలిముద్రలను సేకరించింది. ఆ వేలిముద్రల్లో కొన్ని నలుగురు నిందితుల వేలిముద్రలతో సరిపోలేదు. అంటే హత్య జరిగిన రోజు రాత్రి ఆ నలుగురు నిందితులే కాకుండా ఆ ఇంట్లో మరెవరో ఉన్నట్లు స్పష్టమవుతోంది. సీబీఐ అప్రూవర్‌గా మార్చిన దస్తగిరి ఆ వ్యక్తి పేరును వెల్లడించలేదు. ఆ వేలి ముద్రలు ఎవరివి? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. ఎవరినో రక్షించేందుకే ఆ వేలి ముద్రలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని స్పష్టమవుతోంది. ఆ వేలి ముద్రలు ఎవరివన్న కోణంలో దర్యాప్తు చేస్తే ఈ హత్య వెనుక అసలు కుట్ర బయటపడుతుంది. ఆ తరువాత మాట మార్చిన సునీత కడప ఎంపీ టికెట్ కోసమే వివేకాను హత్య చేశారని రాంసింగ్ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు పూర్తిగా అవాస్తవం. అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న నన్నే (అవినాష్‌రెడ్డి) 2019 ఎన్నికల్లోనూ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. నా గెలుపు కోసం పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా వివేకానందరెడ్డి ఉన్నారు. ఆయన చనిపోయే ముందు రోజు వరకూ నా గెలుపు కోసం కృషి చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డితో కలసి ప్రచారం కూడా చేశారు. సీబీఐ ఈ విషయాలపై ఏమాత్రం దృష్టి సారించలేదు. కనీసం రఘురామిరెడ్డినిగానీ పార్టీ నేతలను గానీ సంప్రదించలేదు. వివేకా హత్య తరువాత తొలుత సునీత కూడా మీడియాకు ఇదే విషయాలను చెప్పారు. తన తండ్రి చివరి వరకు అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం పని చేశారని వెల్లడించారు. 2019 అక్టోబరు తరువాత ఆమె మాట మార్చి నాపై, మా పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇదీ చదవండి: వివేకా కేసులో పుకార్లేంటీ? నిజాలేంటీ? -
నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ శివన్ బాబాయ్
దర్శకుడు విగ్నేష్ శివన్, నయనతారలపై ఆస్తి అపహరణ కేసు నమోదు అయ్యింది. ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ గత రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంచలన జంట నయనతార, విఘ్నేష్ శివన్. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో నయనతార నటిగా రానిస్తూ.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్నా వ్యక్తిగతంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ జంట సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం కూడా వివాదంగా మారింది. (ఇదీ చదవండి; 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్ హీరో) తాజాగా వీళ్లకు మరో సమస్య ఎదురైంది. విఘ్నేశ్ శివన్ పూర్వీకం తిరుచ్చి జిల్లా, లాల్‌కుడి గ్రామం ఈయన తండ్రి పేరు శివకొళుదు. వీళ్లు తొమ్మిది మంది అన్నదమ్ములు. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసిన విఘ్నేష్ శివన్ తండ్రి శివకొళుదు ఇప్పుడు లేరు. అయితే ఈయన జీవించి ఉండగా తమ ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండా మోసపూరితంగా అపహరించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం కోయంబత్తూర్‌లో నివసిస్తున్న మరో సోదరుడు కుంచిత పాదం గురువారం తిరిచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. (ఇదీ చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) అందులో మాణిక్యం పేర్కొంటూ తమ సోదరుడు విఘ్నేష్ శివన్ తండ్రి ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండా వేరే వారికి విక్రయించి మోసానికి పాల్పడ్డాడని, తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బును తిరిగి ఇచ్చి, ఆస్తిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా తమ సోదరుడు కుమారుడు విఘ్నేశ్ శివన్ అతని తల్లి మీనాకుమారి, సోదరి ఐశ్వర్య, భార్య నయనతారలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తిరుచ్చి డీఎస్పీ ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నటి నయనతారకు కూడా తలనొప్పిగా మారింది. -
ఆస్తికోసం సొంత బావల చేతిలోనే బావమరిది దారుణ హత్య
కొల్చారం(నర్సాపూర్): ఆస్తికోసం సొంత బావల చేతిలోనే బావమరిది హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కొల్చారం మండలం అప్పాజీపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొంగోటి శేకులు (23) తండ్రి నర్సింలు మూడేళ్ల క్రితమే చనిపోయాడు. మృతుడికి ముగ్గురు అక్క చెల్లెలు. శేకులు పేరుపై గ్రామ సమీపంలో రెండు, ఏడుపాయల సమీపంలోని కురువగడ్డలో మరో రెండు ఎకరాల పొలం ఉంది. స్వగ్రామంలో ఇటీవల రూ.20 లక్షలతో ఇల్లు నిర్మించాడు. కాగా శేకులు తల్లి పోచమ్మతో తరచూ గొడవపడుతుండేవాడు. దీంతో విసిగి పోయిన తల్లి కూతుళ్లకు ఈ విషయం చెప్పింది. దీంతో అదే రోజు సాయంత్రం కూతుళ్లు తమ భర్తలను వెంటబెట్టుకొని అప్పాజీపల్లికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి కుల సంఘం చిట్టి మీటింగ్ ఉండడంతో వారి వద్దకు వెళ్లిన పోచమ్మ తన గోడును వెల్లబోసుకుంది. దీంతో వారు శేకులును పిలిపించి మాట్లాడుతామని ఆమెకు సర్ది చెప్పారు. మరుసటి రోజు(మంగళవారం) తల్లి, కొడుకు మధ్య ఉన్న వైరాన్ని మాట్లాడేందుకు సంఘం పెద్దలు సమావేశమై తల్లి కొడుకును పిలిపించేందుకు ఇంటికి మనిషిని పంపించినట్లు తెలిపారు. అంతలోనే శేకులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అతని అక్క చెల్లెలు, బావలు ఏడుస్తుండడం గమనించిన వ్యక్తి సంఘం పెద్దలకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి వెళ్లిన గ్రామ పెద్దలు అక్కడికి వెళ్లి చూడగా ఆత్మహత్యకు సంబంధించి అనుమానం వ్యక్తం కావడంతో, వెంటనే కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్‌కు సమాచారం అందజేశారు. మెదక్ డీఎస్పీ సైదులు, మెదక్ రూరల్ సీఐ విజయ్‌కి సమాచారం చేరవేసి క్లూస్ టీంను రప్పించినట్లు తెలిపారు. క్లూస్ టీం ఆధారాల కోసం వెతుకుతుండగా ఇంట్లోని ఓ మూలన డ్రమ్ములో రక్తపు మరకలతో కూడిన శేకులు ప్యాంటు, చొక్కా, రక్తపు మరకలతో కూడిన కరల్రు లభించినట్లు తెలిపారు. మృతుని తల్లి పోచమ్మ ద్వారా వివరాలు తెలుసుకున్న డీఎస్పీ కుటుంబ సభ్యులందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. శేకులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియాసుపత్రికి తరలించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆస్తి కోసం హత్య.. శేకులు పేరుమీద భూమి, ఇల్లుకు సంబంధించి దాదాపు రూ.రెండు కోట్ల ఆస్తి ఉంటుందని, ఈ విషయంలోనే అతని అక్క చెల్లెల్లు తరచూ ఆస్తి విషయమై గొడవ పడేవారని చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. ఆస్తి కోసమే అతని బావలు శేకులును కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేసినట్లు గ్రామస్తులు అనుమానాలను వ్యక్తం చేశారు. -
తమ్ముడిపై ప్రేమ నటించి.. ఇంట్లోకి పిలిచి ఓ అన్న ఘాతుకం
ఖిలా వరంగల్ : ఆస్తి విషయంలో మాట్లాడుకుందా మని ఓ అన్న.. తన సొంత తమ్ముడిని పిలిచి ఇంట్లోకి తీసుకెళ్లాడు. మాటల్లో పెట్టి కర్రలతో కొట్టి.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం 6 గంటలకు కరీమాబాద్ ఉర్సు ప్రతాప్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి భార్య కథనం ప్రకారం..వరంగల్ ఉర్సు కరీమాబాద్ కురుమవాడ వెంకటేశ్వర హైసూ్కల్ సమీప కాలనీలో గోవిందుల కొమ్మాలుకు ముగ్గురు కుమారులు శ్రీని వాస్, శ్రీకాంత్, శ్రీధర్ ఉన్నారు. ఇటీవల శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందాడు. శ్రీధర్‌కు తన తమ్ముడు శ్రీకాంత్(35)తో కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై శ్రీకాంత్ తన అన్న శ్రీధర్‌పై మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు మార్లు శ్రీధర్‌ను మందలించి వదిలేశారు. అన్న శ్రీధర్ అరాచకంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ భార్య రాణితో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వలసవెళ్లాడు. అక్కడే తాపీమేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఇంటి స్థలం విషయం మరోసారి మాట్లాడుకుందామంటూ శ్రీధర్ తన తమ్ముడు శ్రీకాంత్‌ను వరంగల్‌లోని తన ఇంటికి పిలిపించాడు. అన్న మాటలు నమ్మిన తమ్ముడు ఇంట్లోకి రాగానే బలమైన కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. మంటలు తాళలేక రోడ్డుపై పరుగులు పెట్టాడు. శ్రీకాంత్ డ్రెయినేజీలో పడగానే అతడి తలపై శ్రీధర్ బండరాయి ఎత్తేసి హత్య చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ ముస్కు శ్రీనివాస్, ఎస్సై సాంబయ్య, క్లూస్ టీం బృందంతో ఏసీపీ బోనాల కిషన్ చేరుకున్నారు. శ్రీ కాంత్ హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరి శీలించి వివరాలు సేకరించారు. ఆ తర్వాత మృతదేహా న్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. నింది తుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న మృతుడి భార్య రాణి ఘటన స్థలానికి చేరుకొని భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రాథమిక విచారణ.. కరీమాబాద్‌లో జరిగిన హత్య ఘటన వద్ద కర్ర, బండరాయి, పెట్రోల్ డబ్బాను గుర్తించామని పోలీసులు తెలిపారు. శ్రీకాంత్‌పై శ్రీధర్ కర్రతో మోది ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్ పోసి బండరాయితో మోది హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని పేర్కొన్నారు. -
ఆస్తి వివాదం.. తండ్రి ప్రాణం తీసిన కుమారుడు
పాలకుర్తి టౌన్: ఆస్తి వివాదంలో ఓ తనయుడు తండ్రిని కొట్టి చంపాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్నులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈరవెన్ను గ్రామానికి చెందిన చిడిమిండ్ల నర్సిరెడ్డి (57)కి రాజు, రమేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అతనికి ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గత ఏడాది ఇద్దరు కుమారులకు మూడు ఎకరాల చొప్పున పంపకాలు చేశాడు. ఎకరం 20 గుంటల భూమిని తన భాగంగా తీసుకున్నాడు. కాగా, తరచూ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నర్సిరెడ్డి భార్య చనిపోవడంతో అతను చిన్న కుమారుడు రమేశ్ వద్ద ఉంటున్నాడు. ఇదిలా ఉండగా పెద్ద కుమారుడు రాజు తనకు అప్పులు పెరిగాయని, ఇంటిని అమ్మాలంటూ గొడవ పడుతుండేవాడు. పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇంటి పంపకం విషయంలో తనకు అన్యాయం జరిగిందని, తండ్రిని, తమ్ముడిని చంపుతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో గురువారం నర్సిరెడ్డి పొలం పనులు చేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా రాజు వెళ్లి గొడవ పడ్డాడు. తండ్రిని బురదలో పడేసి తలపై కొట్టి చంపాడు. నర్సిరెడ్డి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అతనికోసం కుటుంబ సభ్యులు వెతకగా రాత్రి సమయంలో పొలంలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటనపై శుక్రవారం రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ విశ్వేశ్వర్, ఎస్సైశ్రీకాంత్ సందర్శించి దర్యాప్తు చేపట్టారు. చదవండి: బాత్రూం కిటికీ నుంచి దూరి చోరీ.. భర్తతో కలిసి రూ.47 లక్షలు.. -
IPCC: వాతావరణ మార్పులతో దేశాలన్నీ అతలాకుతలం
వాతావరణ మార్పులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. దీని ప్రభావంతో వచ్చిపడుతున్న అకాల వరదలు, కరువులతో దేశాలకు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అపార ఆస్తి, ప్రాణ నష్టాలతో అల్లాడుతున్నాయి.æ అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు తరచూ తలెత్తుతాయని, వాటి తీవ్రత కూడా గతం కంటే అత్యంత ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ మార్పుల ప్యానల్ (ఐపీసీసీ) వేసిన అంచనాలు నూటికి నూరు శాతం నిజమవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ► వారాంతపు వరదలతో ఆస్ట్రేలియా అల్లాడింది. దేశంలో చాలాచోట్ల ఇంకా కుండపోత కొనసాగుతూనే ఉంది. మరికొన్ని రోజుల పాటు అతి తీవ్ర వర్షాలు తప్పవంటూ వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ► మధ్య ఆఫ్రికా దేశమైన చాద్ రిపబ్లిక్‌ది విచిత్ర పరిస్థితి. నిన్నామొన్నటిదాకా దుర్భరమైన కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ఇప్పుడేమో గత 30 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ► థాయ్‌లాండ్‌ను కూడా నెల రోజులుగా భారీ వరదలు ఊపిరి సలపనివ్వడం లేదు. 77 రాష్ట్రాలకు గాను ఏకంగా 59 రాష్ట్రాలు వరద బారిన పడ్డాయి. 4.5 లక్షల ఇళ్లు దెబ్బ తినడమో కూలిపోవడమో జరిగింది. 40 శాతం ప్రాంతాలు ఇంకా మునకలోనే ఉన్నాయి. తాజాగా సోమవారం 8 దక్షిణాది రాష్ట్రాలకు భారీ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి! ► ఫిలిప్పీన్స్దీ ఇదే పరిస్థితి. తుఫాను కారణంగా వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ► భారీ వరదలతో మెక్సికో తీరం అల్లాడుతోంది. ► భారత్‌లోనూ తుఫాన్ల దెబ్బకు ఢిల్లీ, బెంగళూరు అల్లాడిపోయాయి. హైదరాబాద్‌నైతే కొన్ని వారాలుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కారణాలెన్నో...! గ్లోబల్ వార్మింగ్ మొదలుకుని మితిమీరిపోయిన శిలాజ ఇంధన వాడకం దాకా తాజా వాతావరణ మార్పులకు కారణాలెన్నో! ప్రధాన కాలుష్య కారణమైన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు 90 శాతం దాకా శిలాజ ఇంధనమే కారణమవుతోంది. అడవుల విచ్చలవిడి నరికివేత, అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న పెట్రో ఉత్పత్తుల వెలికితీత వంటివి కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు మరో పదేళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రత ఏకంగా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగితే ఆశ్చర్యం లేదని ఐపీసీసీ సర్వే హెచ్చరించింది! ‘‘ఇప్పటికైతే వాతావరణ మార్పులు అకాల వర్షాలకు, భారీ వరదలకు కారణంగా మారుతున్నాయి. వర్షపాతపు తీరుతెన్నులను కూడా అవి చాలావరకు మార్చేస్తున్నాయి’’ అని వివరించింది. నైజీరియాలో వరదలు.. 600కు చేరిన మరణాలు అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో ఈ సీజన్లో ఆగస్ట్ నుంచి సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా 603 మంది మృతి చెందారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలకు గాను 33 రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆస్తి కోసమే నా భర్తను చంపేశారు
అనంతపురం క్రైం: చనిపోయిన ఓ ఆటోడ్రైవర్ మృతదేహానికి 15 రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించాలని త్రీటౌన్ పోలీసులు నిర్ణయించారు. త్రీటౌన్ సీఐ హరినాథ్ వివరాల మేరకు ... స్థానిక ఇందిరానగర్‌కు చెందిన మహబూబ్‌పీరా (46) ఆటోడ్రైవర్‌గా విధులు నిర్వర్తించేవాడు. అతనికి భార్య ఆశా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహబూబ్‌పీరా పదేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ అతని చెల్లెళ్ల వద్ద ఉంటున్నాడు. గత నెల 22న మహబూబ్‌పీరా వాంతి కాగా, ఈనో ప్యాకెట్ తెచ్చుకుని సేవించాడు. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబీకులు జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఇందిరానగర్ సమీపంలోని ముస్లిం శ్మశాన వాటికలో ఖననం చేశారు. భర్త మృతిపై ఆమె భార్య ఆశా అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త వద్ద రూ.30 లక్షల నగదు, ఆటోలు, ఇతర ఆస్తులు ఉన్నాయని వాటి కోసమే భర్తింటి వారు ఆయన్ను చంపేశారని ఇటీవల త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే మహబూబ్‌పీరా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగానికి త్రీటౌన్ పోలీసులు లిఖిత పూర్వకంగా విన్నవించారు. రెండ్రోజుల్లో మహబూబ్‌పీరా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. (చదవండి: న్యూడ్ ఫొటోలు పంపుతామని బెదిరించారు.. తెల్లారి అన్నంత పనీ చేసేశారు) -
సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల హత్య
సత్తెనపల్లి: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను అతి దారుణంగా నరికి చంపిన ఉదంతం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నాగార్జున నగర్లో శనివారం రాత్రి కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లి పట్టణంలోని నాగార్జుననగర్‌కు చెందిన కోనూరు శివప్రసాద్ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. అనారోగ్యంతో కొంతకాలం కిందట ఆయన మృతిచెందారు. శివప్రసాద్‌కు భార్య పద్మావతి (55), కుమార్తె లక్ష్మీ ప్రత్యూష (30), కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు. లక్ష్మీనారాయణ గుంటూరు ఆర్డీఓ సీసీగా పనిచేస్తున్నాడు. లక్ష్మీ ప్రత్యూష గర్భిణి కావడంతో తల్లి వద్ద ఉంటోంది. శివప్రసాద్ మరణానంతరం ఆయన సోదరుడు మధుసూదనరావు కుటుంబంతో విభేదాలు తలెత్తాయి. బెల్లంకొండ మండలం నందిరాజుపాలెంలో సుమారు ఆరు ఎకరాల పొలం శివప్రసాద్ పేరుతో ఉంది. అందులో తమకు వాటా ఉందని మధుసూదనరావు కుమారుడు శ్రీనివాసరావు తరచూ ఘర్షణ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో.. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ గుంటూరులో ఉంటున్న శ్రీనివాసరావు శనివారం సత్తెనపల్లి వచ్చి పిన్ని పద్మావతి, సోదరి లక్ష్మీ ప్రత్యూషను అతికిరాతకంగా నరికి చంపాడు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి టౌన్, రూరల్ సీఐలు యూ. శోభన్‌బాబు, బి. నరసింహారావు, ఎస్ఐ రఘుపతి పరిశీలించి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. -
పిన్నితో గొడవ.. ఆవేశంతో తలపై రోకలితో బాదిన కుమారుడు..
సాక్షి, హసన్‌పర్తి(వరంగల్ అర్బన్): హసన్‌పర్తి మండలం పెంబర్తిలో మంగళవారం రాత్రి హత్య జరిగింది. సొంత అక్క కుమారుడే రోకలితో తలపై బాదడంతో వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు... పెంబర్తికి చెందిన కనుకయ్య సొంత అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నాడు. సింగరేణిలో విధులు నిర్వర్తించిన ఆయన ఇటీవల ఉద్యోగ పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం ఆయన ఇద్దరు భార్యలు ప్రవీణ, విజయ(55)తో కలిసి పెంబర్తిలో ఉంటున్నాడు. అయితే, చిన్న భార్య విజయ ఇటీవల కనుకయ్య పేరిట నల్లబెల్లిలో ఉన్న ఆస్తిని విక్రయించి నగదు ఆమె కుమారుడికి ఇచ్చింది. దీంతో ప్రవీణ కుమారుడు వేణుగోపాల్ ఆ డబ్బులో తనకు వాటా ఇవ్వాలని కొంతకాలంగా పిన్నితో గొడవ పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదేక్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగింది. ఈ మేరకు ఆవేశంతో వేణుగోపాల్ ఇంట్లోని రోకలితో విజయ తలపై బాదగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు, ఎస్సై జితేందర్‌రెడ్డి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, నిందితుడు వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. ఆస్తి కోసం
సాక్షి, బెంగళూరు: ఆస్తికోసం ఒక మేనకోడలు మేనమామనే కిడ్నాప్ చేయించి దొరికిపోయింది. ఈ సంఘటన దొడ్డ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. బెంగళూరు ఉత్తర తాలూకా హనియూరు గ్రామానికి చెందిన అంజన్‌గౌడ(50), ఇతని మేనకోడలు మౌన(23). మౌన ఇటీవల ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. తన తల్లి పుట్టింటి ఆస్తి తనకు ఇవ్వాలని మౌన పలుసార్లు మామ అంజనగౌడతో గలాటా పడింది. అతను ససేమిరా అన్నాడు. (హథ్రాస్ కేసు.. డీఐజీ భార్య ఆత్మహత్య) దీంతో మనోజ్ అనే యువకునితో మౌన బేరం కుదుర్చుచుకుని అంజన్‌గౌడను కిడ్నాప్ చేయించింది. బాధితుని కుమార్తె ఈ నెల 22న దొడ్డబళ్లాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారంనాడు మొబైల్ఫోన్ల సంకేతాల ప్రకారం పోలీసులు వెంటాడి రాజానుకుంట సమీపంలోని మౌన ఇన్నోవాకారును అడ్డగించారు. ఈ సమయంలో మనోజ్ అతని స్నేహితులు పోలీసులపై దాడిచేయడంతో రాజానుకుంట ఎస్సై శంకరప్ప గాయపడ్డారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా మనోజ్ కాలికి బుల్లెట్ తగిలింది. అంజన్‌గౌడను కాపాడి మనోజ్‌ను, మౌనను అరెస్టు చేశారు. మిగతా నిందితులు పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. -
14 ఏళ్లు.. 6 హత్యలు
కొజికోడ్: 14 ఏళ్ల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల అనుమానాస్పదంగా మృతి చెందడంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు కేరళలోని కొజికోట్ గ్రామీణ ఎస్పీ కేజీ సైమన్ శనివారం వెల్లడించారు. వారందరు సైనైడ్ అనే విష ప్రయోగం కారణంగానే చనిపోయినట్లు తేలిందన్నారు. 2011లో చనిపోయిన రాయ్ థామస్ భార్య జూలీని ప్రధాన అనుమానితురాలిగా భావించి అరెస్ట్ చేశామన్నారు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడైన ఎంఎస్ మాథ్యూని, వారికి సైనైడ్ సరఫరా చేసిన ప్రాజి కుమార్‌లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆస్తి కోసమే జూలీ ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. వారి ఆహారంలో సైనైడ్‌ను కలపడం ద్వారా ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. అమెరికాలో ఉండే థామస్ రాయ్ సోదరుడు తమకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించాన్నారు. ఇంటి పెద్ద అయిన అన్నమ్మ థామస్ 2002లో చనిపోయారు. ఆరేళ్ల తరువాత 2008లో ఆమె భర్త టామ్ థామస్ చనిపోయారు. 2011లో వారి కుమారుడు, జూలీ భర్త రాయ్ థామస్ మరణించాడు. అన్నమ్మ సోదరుడు మేథ్యూ 2014లో, వారి బంధువు సిలీ, ఆమె ఏడాది వయస్సున్న కుమార్తె 2016లో ప్రాణాలు కోల్పోయారు. రాయ్ థామస్ మరణించిన తరువాత సిలీ భర్తను జూలీ పెళ్లి చేసుకుంది. ఆస్తి వ్యవహారాలు చూసే అన్నమ్మను ఆస్తిపై హక్కు కోసం చంపేశారని, ఆస్తిలో మరింత వాటా కోసం అన్నమ్మ భర్త టామ్‌ను, భర్తతో విబేధాలు రావడంతో రాయ్ థామస్‌ను, రాయ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ చేయాలని ఒత్తిడి చేసినందువల్ల అన్నమ్మ సోదరుడు మేథ్యూని, సిలీ భర్తను పెళ్లి చేసుకోవడంకోసం సిలీతో పాటు ఆమె కూతురుని జూలీ హతమార్చినట్లు తెలుస్తోందని వివరించారు. అనుమానస్పద మరణాలు కావడంతో వారి మృతదేహాల నుంచి డీఎన్ఏ శ్యాంపిల్స్‌ను వెలికి తీసి ఫొరెన్సిక్ లాబ్‌కు పంపించామన్నారు. ఈ అన్ని మృతదేహాల్లోనూ విషపూరిత సైనైడ్ ఆనవాళ్లు ఉన్నాయని సైమన్ తెలిపారు. రాయ్ థామస్ సైనైడ్ వల్ల చనిపోగా, జూలీ మాత్రం తన భర్త గుండెపోటుతో చనిపోయాడని చెప్పారన్నారు. -
ఆస్తి కోసం ‘శవ’ పంచాయితీ
సాక్షి, హన్మకొండ: కష్టపడి ఆస్తిని సంపాదించిన వారు కాటికి పోయారు. కానీ వారి వారసులుగా చెప్పుకుని తేరగా వచ్చే ఆస్తి కోసం మృతదేహాన్ని ముందర పెట్టుకుని పంచాయితీకి దిగారు. మావన సంబంధాలకు మచ్చతెచ్చే అమానవీయ ఘటన గురువారం హన్మకొండలోని గుడిబండల్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గుడిబండల్‌కు చెందిన పిట్టల స్వామి కొన్ని సంవత్సరాల క్రితం కొమురమ్మ(76)ను పెళ్లి చేసుకున్నాడు. కొమురమ్మకు సంతానం కలగకపోవడంతో లచ్చమ్మను మరో పెళ్లి చేసుకున్నాడు. లచ్చమ్మకు 9 మంది సంతానం. కాగా సుమారు దశాబ్దకాలం క్రితం స్వామి మృతి చెందాడు. ఆయన సంపాదించిన ఆస్తిని ఇద్దరు భార్యలకు చెందేలా రాసిచ్చి కాలం చేశాడు. ఇదిలా ఉండగా కొమురమ్మ(76) బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. దహన సంస్కారాలు చేసే క్రమంలో మృతురాలు కొమురమ్మ సోదరి వెంకటమ్మ కూతురు వచ్చి మాపెద్దమ్మ ఆస్తిని తనకు రాసిచ్చిందని, ఆస్తి తనకే దక్కుతుందని గొడవకు తెరలేపింది. దీంతో లచ్చమ్మ వారసులు మీకెలా చెందుతుందని, ఇది మా నాన్న సంపాధించిన ఆస్తి కాబట్టి తమకే దక్కుతుందని, అలా తమ పెద్దమ్మ రాసిచ్చిందని వాదనకు దిగారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాస్త పోలీస్ ఠాణా మెట్లక్కెంది. కేసు నమోదు చేసుకున్న హన్మకొండ పోలీసులు ముందుగా దహన సంస్కారాలు కానివ్వండి అని చెప్పడంతో గురువారం సాయంత్రం దహన సంస్కారాలు చేశారు. -
ఆస్తి కోసం తమ్ముడి హత్య
సాక్షి, నార్పల(అనంతపురం) : ఆస్తి కోసం తమ్ముడిని కడతేర్చిన అన్న ఉదంతం నార్పలలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన మేరకు... గారబావి కొట్టాల కాలనీకి చెందిన చిన్న నాగమునికి బండి రాజు, బండి నాగార్జున (30) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి మధ్య కొంత కాలంగా తండ్రికి చెందిన 12 సెంట్ల స్థలానికి సంబంధించి వివాదం నడుస్తోంది. మంగళవారం పెద్దల సమక్షంలో అన్నదమ్ముల స్థల వివాదం పంచాయితీ జరగాల్సి ఉండగా అది వాయిదా పడింది. తమ్ముడు బండి నాగార్జునను అంతమొందిస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని బండి రాజు భావించాడు. మంగళవారం అర్ధరాత్రి నాగార్జున, నాగరత్న దంపతులు ఆరుబయట పడుకుని ఉండటాన్ని రాజు గమనించాడు. ఇదే అదునుగా భావించి ఇనుపరాడ్‌తో తమ్ముడు నాగార్జునపై దాడి చేశాడు. తలకు బలమైన గాయమై నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య నాగరత్న ఫిర్యాదు మేరకు సీఐ విజయభాస్కర్‌గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నాడు. నాగరాజుకు నాలుగు నెలల కిందటే వివాహమైంది. భర్త మృతితో నాగరత్న బోరున విలపించింది. -
ఆస్తి కోసమే అంతమొందించారు
సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్) : కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాల్సిన భార్య కట్టుకున్నోడినే ఆస్తి కోసం హత్య చేసింది. ఉన్నంతలో కొడుకుల బాగోగులు చూసిన తండ్రికి ఆ కనికరం లేకుండా నిద్రిస్తున్న చోటనే మెడకు ఉరేసి హత్య చేసిన సంఘటన మండలంలో మంగళవారం కలకలం సృష్టించింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన ముక్కిడి కామయ్య(65) అనే వ్యక్తిని అతడి భార్య లాలవ్వ, ఇద్దరు కుమారులు వీరేశం, సాయిలు కలిసి సోమవారం అర్ధరాత్రి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనం వద్ద నిద్రిస్తున్న కామయ్యను మెడకు ఉరి బిగించి హత్య చేశారు. ఆ వెంటనే నిందితులు ముగ్గురు బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. దీంతో పాటు బీర్కూర్ ఎస్ఐ పూర్ణేశ్వర్ పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.. బాన్సువాడ డీఎస్పీ యాదగిరి, బాన్సువాడ టౌన్ సీఐ మహేష్ అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పూర్ణేశ్వర్ తెలిపారు. ఆలనాపాలనా తమ్ముడిదే... హత్యకు గురైన కామయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంత కాలం క్రితం కుమార్తెకు వివాహం చేశారు. అయితే ఏడాది కాలంగా ఆస్తి కోసం కుటుంబ సభ్యులు కామయ్యను వేధిస్తుండేవారని గ్రామస్తులు తెలిపారు. కామయ్య తన సోదరుడి కుటుంబంతో కలిసి మొత్తం నాలుగు ఎకరాల 12 గుంటల భూమి ఉంది. అయితే ఇద్దరు అన్నదమ్ములు చెరిసగం పంచుకోగా కామయ్యకు 2ఎకరాల 6 గుంటల భూమి వచ్చింది. అయితే కొంత కాలంగా కుటుంబంలో కలతలు రావడంతో గ్రామంలో పలుమార్లు కులపెద్దల సమక్షంలో పంచాయితీలు నిర్వహించి కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కుదిర్చారు. అయినా మార్పు రాకపోవడంతో మృతుడు వీధుల్లోనే స్నానం చేస్తూ ఇంటికి దగ్గరలో ఉన్న మున్నూరుకాపు భవనంలో నిద్రించేవాడు. భార్య పిల్లలు ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో తమ్ముడే కామయ్య ఆలనాపాలన చూసేవాడు. ఆస్తి పంచిన 24గంటల్లోనే.. సోమవారం కామయ్య తన పేరిట ఉన్న 2 ఎకరాల 6 గుంటల భూమిలో 20 గుంటల భూమిని తన తమ్ముడి పేరిట రాసి మిగిలిన 66 గుంటల భూమిని కొడుకులిద్దరికి సమానంగా పంచి ఇచ్చాడు. అయితే చిన్నాన్నకు భూమి ఎందుకు ఇచ్చావంటూ కొడుకులతో గొడవ కాగా గ్రామస్తులు సర్ది చెప్పారు. ఎప్పటి మాదిరిగానే భోజనం చేసి సంఘ భవనంలో నిద్రిస్తున్న కామయ్యను అర్ధరాత్రి సమయంలో తాడుతో మెడకు ఉరి బిగించి అరవకుండా తప్పించుకోకుండా చేతులు కాళ్లు కట్టేసి ప్రాణం పోయే వరకు తాడును బిగించినట్లు పోలీసులు వివరించారు. కామయ్య మృతి చెందిన తరువాత తాను పిల్లర్‌కు కట్టేసి అక్కడి నుండి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. కామయ్య స్వతహాగా మృదుస్వభావి అని గ్రామస్తులు వివరించారు. -
కుమారుడి హత్య కేసులో తల్లికి..
సాక్షి, గుంటూరు : ఆస్తి వివాదంలో కన్న కొడుకును హతమార్చిన తల్లికి జీవిత ఖైదు, రూ.2వేలు జరిమానా విధిస్తూ గుంటూరు మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్.సత్యవతి శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంచుల వరదరాజు కథనం మేరకు 2014వ సంవత్సరంలో కాకుమాను మండలం బోడిపాలెం గ్రామానికి చెందిన బత్తినేని అంజనాదేవి కుమారుడు కోటేశ్వరరావుతో పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామానికి చెందిన శైలజ వివాహం అయింది. కోటేశ్వరరావుకు రెండో వివాహం కావడంతో వివాహ సమయంలో మూడున్నర ఎకరాలు కోటేశ్వరరావు పేరుమీద అతని తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంతో శైలజతో వివాహం జరిపించారు. అనంతరం ఎకరం 67 సెంట్లను మాత్రమే కోటేశ్వరరావు తల్లిదండ్రులు అతని పేర రిజిస్ట్రేషన్ చేయించారు. మిగతా పొలం విషయమై కోటేశ్వరరావు తన పేరు మీద రాయాలని తల్లి అంజనాదేవిని, సోదరి ముప్పవరపు శివనాగలక్ష్మి అలియాస్ లక్ష్మిపై ఒత్తిడి పెంచాడు. ఈక్రమంలో తల్లి అంజనాదేవి, సోదరి శివనాగలక్ష్మి, మేనమామ గార్లపాటి నాగేశ్వరరావు కలిసి కోటేశ్వరరావును వారి నివాసంలోనే గొడ్డలి, పచ్చడిబండతో దాడిచేసి హత్య చేశారు. అనంతరం అంజనాదేవి కుమారుడు మృతదేహాన్ని కొద్దిరోజులపాటు ఇంట్లోనే బయటి వారికి తెలియకుండా ఉంచింది. మృతదేహం దుర్వాసన వస్తుండటంతో అంజనాదేవి 2016 అక్టోబరు 19వ తేదీన మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి యూరియా గోతంలో పెడుతుండగా గ్రామస్తులు గమనించి పండుగ నిమిత్తం పుట్టింటికి వెళ్లిన మృతుడి భార్య శైలజకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె బోరుపాలెం చేరుకుని కాకుమాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసిన సీఐ సి.హెచ్.వి.జి. సుబ్రహ్మణ్యం కేసు విచారించి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయస్థానం అంజనా దేవిపై నేరం రుజువు కావడంతో ఆమెకు జీవిత ఖైదు, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. గార్లపాటి నాగేశ్వరరావు, ముప్పవరపు శివనాగలక్ష్మిలపై కేసు రుజువు కాకపోవడంతో వారిపై కేసు కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
అండగా నిలవాల్సిన అత్తమామలే..
సాక్షి, నెల్లూరు : భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, అండగా నిలవాల్సిన అత్తమామలే ఆస్తి కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై గురువారం స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నాయుడుపేట పట్టణానికి చెందిన సాదు హర్ష అనే యువతిని 2016 ఆగస్ట్ నెలలో వైఎస్సార్ జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన సాదు చంద్రశేఖర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చి పెద్దల సమక్షంలో వివాహం చేశారు. హర్ష, చంద్రశేఖర్‌లు బెంగళూరులో నివాసముండేవారు. 2018 ఫిబ్రవరి నెలలో చంద్రశేఖర్ స్నేహితుడి వివాహం కోసం స్వగ్రామానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. భర్త మరణించడంతో హర్ష అత్తమామల వద్దే ఉంటోంది. ఈక్రమంలో అండగా ఉండాల్సిన అత్తమామలు తనకు పిల్లల్లేరని, భర్త ఆస్తి తమకే చెందుతుందని చెప్పారని హర్ష ఫిర్యాదులో పేర్కొంది. వారు, ఆడపడుచు ఆమె భర్త ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టాలంటూ కొద్దినెలలుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె చెబుతోంది. ఈ మేరకు పోలీసులు హర్ష అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్తపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని గోరంట్లలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్తిపంపకాల విషయంలో గొడవపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఈ రోజు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి ఆస్తి పంపకంలో గొడవపడిన గోరంట్లకు చెందిన రామకృష్ణమ్మ, ఆమె కుమారుడు వేణుగోపాల్, సోదరులు మోహన్, సోమశేఖర్ మంగళవారం రాత్రి ఊరి చివర గల స్మశానం వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈరోజు ఉదయం అటువైపుగా వెళ్లిన గ్రామస్తులు వారిని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వీరిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మోహన్, సోమశేఖర్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రామకృష్ణమ్మ, వేణుగోపాల్ ల పరిస్థితి విషమంగా ఉందనీ, మరో 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కోసం మామను చంపిన అల్లుడు
-
నడిరోడ్డుపై రిటైర్డు ఎస్సై దారుణహత్య
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో విషాదం చోటు చేసుకుంది. ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ రిటైర్డు పోలీసు అధికారి హత్యకు గురయ్యాడు. ఎస్ఐగా పనిచేసి పదవీ విరమణ చేసిన గుంజి వెంకటేశ్వర్లు కుటుంబంతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. తన స్వగ్రామం నందిగామకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఇతనికి ఆస్తి విషయంలో పినతండ్రి కొడుకులతో తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నందిగామలో రోడ్డుపై మాట్లాడుతుండగా కోపంతో పినతండ్రి కొడుకులు గుంజి శ్రీను, అతని ఇద్దరు తమ్ముళ్లు కత్తులతో పొడిచారు. సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేశ్వర్లు మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన నెల క్రితమే నందిగామకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు.