![Niece Was Found To Have Kidnapped Uncle At Doddaballapur - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/25/01_0.jpg.webp?itok=AkZzDMvb)
నిందితురాలు మౌన, బాధితుడు అంజన్‌గౌడ
సాక్షి, బెంగళూరు: ఆస్తికోసం ఒక మేనకోడలు మేనమామనే కిడ్నాప్ చేయించి దొరికిపోయింది. ఈ సంఘటన దొడ్డ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. బెంగళూరు ఉత్తర తాలూకా హనియూరు గ్రామానికి చెందిన అంజన్‌గౌడ(50), ఇతని మేనకోడలు మౌన(23). మౌన ఇటీవల ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. తన తల్లి పుట్టింటి ఆస్తి తనకు ఇవ్వాలని మౌన పలుసార్లు మామ అంజనగౌడతో గలాటా పడింది. అతను ససేమిరా అన్నాడు. (హథ్రాస్ కేసు.. డీఐజీ భార్య ఆత్మహత్య)
దీంతో మనోజ్ అనే యువకునితో మౌన బేరం కుదుర్చుచుకుని అంజన్‌గౌడను కిడ్నాప్ చేయించింది. బాధితుని కుమార్తె ఈ నెల 22న దొడ్డబళ్లాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారంనాడు మొబైల్‌ఫోన్ల సంకేతాల ప్రకారం పోలీసులు వెంటాడి రాజానుకుంట సమీపంలోని మౌన ఇన్నోవాకారును అడ్డగించారు. ఈ సమయంలో మనోజ్ అతని స్నేహితులు పోలీసులపై దాడిచేయడంతో రాజానుకుంట ఎస్సై శంకరప్ప గాయపడ్డారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా మనోజ్ కాలికి బుల్లెట్ తగిలింది. అంజన్‌గౌడను కాపాడి మనోజ్‌ను, మౌనను అరెస్టు చేశారు. మిగతా నిందితులు పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment