
కర్ణాటక, యశవంతపుర : ఓ తండ్రి కన్న కొడుకునే కిడ్నాప్ చేసిన ఘటన బుధవారం బెంగళూరులో జరిగింది. వివరాలు... బెళ్లందూరు చెందిన దంపతులు విభేదాల కారణంగా విడివిడిగా ఉంటున్నారు. తాగుడుకు బాని సైన భర్తతో విసిగిపోయిన భార్య తన బిడ్డతో దూరంగా ఉంటోంది. భార్యను భయపెట్టడానికి భర్త ఇంటి ముందు ఆడుకుంటున్న కొడు కుని ఎవరికి తెలియకుండా బైక్‌పై కూర్చోపెట్టుకుని బయలుదేరాడు. దీనిని గమనించిన ఓ మహిళ ఫొటోతో పాటు వీడియో తీసి ఫేస్‌బుక్‌లోని పోలీస్ పేజీకి అప్‌లోడ్ చేసింది. చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ సందేశం పంపింది దీంతో క్షణాల్లో అప్రమత్తమైన పోలీసులు బైక్‌పై వెళ్తున్న నిందితుడిని ఓ మాల్‌వద్ద అడ్డుకుని విచారించారు. కొడుకును ఎందుకు కిడ్నాప్ చేశావని ప్రశ్నించడంతో భార్యను భయపెట్టడానికి ఇలా చేసినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితుడిని హెచ్చరించి చిన్నారిని తల్లి చెంతకు చేర్చారు. దంపతుల మధ్య ఉన్న గొడవ కారణంగా కన్న కొడుకునే కిడ్నాప్ చేసిన డ్రామాకు పోలీసులు తెరదించారు.
Comments
Please login to add a commentAdd a comment