అన్నా వదినను కట్టేసిన తమ్ముడు, మరదలు.. ముగ్గురిపై కేసు నమోదు
సిద్దిపేట కమాన్: అప్పు చెల్లించడం లేదని అన్నా, వదినలను.. ఓ ప్రబుద్ధుడు తన భార్య, కొడుకుతో కలిసి గ్రిల్స్‌కు కట్టేశాడు. సిద్దిపేటలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. దొంతరబోయిన పర్శరాములు, తార దంపతులు ఏడో తరగతి చదివే తమ కుమార్తెతో సిద్దిపేట కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్నారు.
పర్శరాములు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అవసరాల నిమిత్తం నాసర్‌పూరలో నివసిస్తున్న సొంత తమ్ముడు దొంతరబోయిన కనకయ్య వద్ద 8 నెలల క్రితం రూ.1.20 లక్షలు అప్పు తీసుకున్నాడు. నాలుగు నెలల క్రితం రూ.లక్ష తిరిగి చెల్లించాడు. ఈ క్రమంలో శుక్రవారం కౌన్సిలర్ కనకరాజు.. పర్శరాములుకు ఫోన్ చేసి డబ్బుల వివాదంపై మాట్లాడేందుకు తన ఇంటికి రమ్మన్నాడు. దీంతో పర్శరాములు తన భార్య తారతో కలిసి నాసర్‌పూరకు వచ్చారు.
అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో కనకరాజు ఆగ్రహం వ్యక్తం చేసి వారిద్దరిని బయటకు పంపించారు. బకాయి ఉన్న రూ.20వేలు, వడ్డీ డబ్బులు చెల్లించాలని తమ్ముడు కనకయ్య, అతడి భార్య భాగ్య, వీరి కుమారుడు భాను కలసి.. పర్శరాములు, అతని భార్య తారను కొట్టి నాసర్‌పూర హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద ఉన్న గ్రిల్స్‌కు తాడుతో కట్టేశారు. స్థానికులు కలి్పంచుకుని వారిని విడిపించడంతో బాధితులు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment