మంత్రాల నెపంతో అన్నను చంపిన తమ్ముడు | younger brother kills sibling in guise of black magic | Sakshi
Sakshi News home page

మంత్రాల నెపంతో అన్నను చంపిన తమ్ముడు

Published Wed, Oct 8 2014 11:39 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

younger brother kills sibling in guise of black magic

భూతగాదాల నేపథ్యంలో మంత్రాల నెపం చూపి అన్నను చంపాడో తమ్ముడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం కమ్మరిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన ధర్మయ్యను చంపేసిన తమ్ముడు వెంకటయ్య.. ఆ తర్వాత పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మంత్రాలు వేస్తున్నందువల్లే అతడిని చంపినట్లు చెప్పాడు.

గత కొంత కాలంగా పాముకాటు, తేలుకాటుకు ధర్మయ్య మంత్రాలు వేసేవాడు. ఇప్పుడు మనుషులపై కూడా మంత్రాలు ప్రయోగిస్తున్నాడని వెంకటయ్య ఆరోపించాడు. కానీ, తమకున్న వ్యవసాయ భూమిని దక్కించుకోడానికే ఇలా మంత్రాల నెపం పెట్టుకుని ధర్మయ్యను పొట్టన పెట్టుకున్నట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement