నల్గొండ: వ్యక్తిగత వివాదాలతో సొంత అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. నల్గొండలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పట్టణానికి చెందిన సహవీర్, సహకీర్ సోదరులు. వారి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. శుక్రవారం ఉదయం స్థానిక ప్రకాశం బజార్ చేపల మార్కెట్‌లో ఉన్న సహవీర్‌ను సహకీర్ గొడ్డలితో నరికాడు. చుట్టుపక్కల వారు అడ్డుకోవటంతో సహకీర్ అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సహవీర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.