హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ : హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు.