
పని మనిషిపై ప్రొఫెసర్ వేధింపులు
అత్తాపూర్: ఇంట్లో పనిచేస్తున్న యువతికి మాయమాటలు చెప్పి లైంగికంగా వేధింపులకు గురి చేశాడో ప్రొఫెసర్. ఈ సంఘటన నార్సింగ్ పరిధిలో పప్పులగూడలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముండే ఓ ప్రొఫెసర్ తన ఇంట్లో పని చేస్తున్న యువతితో మసాజ్ సెంటర్ పెట్టిస్తానని, ఆర్థికంగా లోటు ఉండదని మాయమాటలు చెప్పాడు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె శనివారం ఉదయం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.