పేకాట స్ధావరాలపై దాడి: 19 మంది అరెస్టు
Published Mon, Jan 25 2016 10:19 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
అత్తాపూర్: నగరంలోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో 19 మంది పేకాట రాయుళ్లను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇంద్రానగర్‌లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్‌ఐ నారాయణరెడ్డి సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 19 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10, 500 స్వాధీనం చేసుకున్నారు. అదే ఇంటి నుంచి మాంసం కత్తులను కూడా స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Advertisement
Advertisement