అత్తాపూర్ (హైదరాబాద్) : మధ్యాహ్న భోజన పథకం కింద తమకు పెట్టాల్సిన భోజనం సరిగా పెట్టడం లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నగరంలోని రాజేంద్రనగర శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.