లిఫ్టులో ఇరుక్కొని.. రెండు కాళ్లు పోగొట్టుకున్న మెకానిక్‌  | Mechanic Lost His Legs After Getting Stuck In Hotel Lift Attapur | Sakshi
Sakshi News home page

లిఫ్టులో ఇరుక్కొని.. రెండు కాళ్లు పోగొట్టుకున్న మెకానిక్‌ 

Published Tue, Dec 13 2022 2:36 PM | Last Updated on Tue, Dec 13 2022 3:15 PM

Mechanic Lost His Legs After Getting Stuck In Hotel Lift Attapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్తాపూర్‌లోని ఓ హోటల్‌ లిఫ్టులో ఇరుక్కొని ఓ మెకానిక్‌ రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. లిఫ్టులో ఇరుక్కున్న పోలీస్‌ అధికారిని రక్షించేందుకు వచ్చి మెకానిక్‌ ప్రమాదవశాత్తు లిఫ్టులో ఇరికి రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌ హౌస్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం అత్తాపూర్‌లోని ఎస్వీఎం గ్రాండ్‌ బాంకెట్‌ హాల్లో సోమవారం రాత్రి విందును ఏర్పాటు చేసింది.

ఈ విందు కోసం స్నేహితులను బంధువులను ఆహ్వానించారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్‌ పోలీసు అధికారి సత్యనారాయణ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విందుకు హాజరయ్యేందుకు వచ్చారు. మొదట కుటుంబ సభ్యులు లిఫ్ట్‌ ద్వారా పైకి వెళ్లిన అనంతరం కిందికి వచ్చింది.  పోలీసు అధికారితో పాటు మరో నలుగురు లిఫ్టులో ఎక్కారు. మొదటి అంతస్తుకు వెళ్ళగానే ఆ లెఫ్ట్‌ కాస్త చెడిపోయింది. దీంతో నిర్వాహకులు ఒరిస్సాకు చెందిన నిరంకర్‌ అనే లిఫ్ట్‌ మెకానిక్‌ను హోటల్‌ వద్దకు రప్పించి మరమ్మతులు ప్రారంభించారు.

పోలీసు అధికారిని బయటకు తీశాడు. అనంతరం మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో ఇరికిపోయాడు. దీంతో రెండు కాళ్లు కాస్త అందులో నుజ్జు నుజ్జు అయ్యాయి. అప్పటికే చేరుకున్న ఇతర ఎలక్ట్రీషియన్లు మరమ్మతులు చేపట్టి గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
చదవండి: హైదరాబాద్‌: మియాపూర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement