stuck in lift
-
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన సెక్యూరిటీ గార్డు
-
ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, పెద్దపల్లి:ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పెద్దపల్లిలో ఓ రెస్టారెంట్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌కు వెళ్తున్న మంత్రి.. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జిల్లాకేంద్రంలోని కూనారం చౌరస్తాలో తన అనుచరుని రెస్టారెంట్‌కు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు లిఫ్ట్‌ను ఆశ్రయించారు. సామర్థ్యం మించిపోవడంతో లిఫ్ట్ తలుపులు మూసుకున్నా.. ఎటూ కదల్లేదు.తలుపు తెరుచుకోకపోవడంతో మంత్రి కాసేపు లిఫ్ట్‌లోనే ఉండిపోయారు. దీంతో పోలీసులు, హోటల్ నిర్వాహకులు కాసేపు శ్రమించి తలుపులు తెరిచారు. అనంతరం మంత్రి నవ్వుకుంటూ బయటికొచ్చి ‘పెద్దపల్లి ఎప్పటికీ గుర్తుండిపోతుంది..’ అంటూ చెన్నూర్ పయనమయ్యారు. చదవండి: ముఖం చూశాకే ముందుకు! -
లిఫ్టులో ఇరుక్కొని.. రెండు కాళ్లు పోగొట్టుకున్న మెకానిక్
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్‌లోని ఓ హోటల్ లిఫ్టులో ఇరుక్కొని ఓ మెకానిక్ రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. లిఫ్టులో ఇరుక్కున్న పోలీస్ అధికారిని రక్షించేందుకు వచ్చి మెకానిక్ ప్రమాదవశాత్తు లిఫ్టులో ఇరికి రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం అత్తాపూర్‌లోని ఎస్వీఎం గ్రాండ్ బాంకెట్ హాల్లో సోమవారం రాత్రి విందును ఏర్పాటు చేసింది. ఈ విందు కోసం స్నేహితులను బంధువులను ఆహ్వానించారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ పోలీసు అధికారి సత్యనారాయణ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విందుకు హాజరయ్యేందుకు వచ్చారు. మొదట కుటుంబ సభ్యులు లిఫ్ట్ ద్వారా పైకి వెళ్లిన అనంతరం కిందికి వచ్చింది. పోలీసు అధికారితో పాటు మరో నలుగురు లిఫ్టులో ఎక్కారు. మొదటి అంతస్తుకు వెళ్ళగానే ఆ లెఫ్ట్ కాస్త చెడిపోయింది. దీంతో నిర్వాహకులు ఒరిస్సాకు చెందిన నిరంకర్ అనే లిఫ్ట్ మెకానిక్‌ను హోటల్ వద్దకు రప్పించి మరమ్మతులు ప్రారంభించారు. పోలీసు అధికారిని బయటకు తీశాడు. అనంతరం మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో ఇరికిపోయాడు. దీంతో రెండు కాళ్లు కాస్త అందులో నుజ్జు నుజ్జు అయ్యాయి. అప్పటికే చేరుకున్న ఇతర ఎలక్ట్రీషియన్లు మరమ్మతులు చేపట్టి గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చదవండి: హైదరాబాద్: మియాపూర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం -
Video: లిఫ్ట్‌లో ఇరుక్కున్న ముగ్గురు చిన్నారులు.. భయంతో కేకలు, ఏడుపు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో మరో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఓ సొసైటీ లిఫ్ట్‌లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవత్సరాల వయసున్న ముగ్గురు బాలికలు దాదాపు 25 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. ఘజియాబాద్‌లోని క్రాసింగ్స్ రిపబ్లిక్ టౌన్షిప్లో గల అసోటెక్ ది నెస్ట్‌లో నవంబర్ 29న ఈ ఘటన చోటుచేసుకుందిఈ దృశ్యాలన్నీ లిఫ్ట్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముగ్గురు చిన్నారులు లిఫ్ట్‌లో ఉండగా అది సడెన్‌గా ఆగిపోయింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేందుకు చిన్నారులు ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. ఎమర్జెన్సీ బటన్ నొక్కినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ముగ్గురిలో ఇద్దరు చిన్నారులు భయంతో ఏడవడం ప్రారంభించారు. మరో చిన్నారి వారికి దైర్యం చెప్పేందుకు ప్రయత్నించింది. లిఫ్ట్ డోర్‌ను బలంగా కొడుతూ.. సాయం కోసం గట్టిగా అరిచింది. అంతేగాక తన రెండు చేతులతో బలవంతంగా డోర్ తెరిచేందుకు ప్రయత్నించింది. అయినా అది ఓపెన్ కాపోవడంతో భయాందోళనకు గురైంది. ప్రాణ భయంతో ముగ్గురు పిల్లలు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ, ఏడ్చడం వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఆ చిన్నారులు అందులోనే ఉండిపోయారు. అనంతరం ఎట్టకేలకు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చదవండి: నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు #Ghaziabad क्रासिंग रिपब्लिक के assotech Nest society में बीती शाम 3 मासूम बच्चियां लिफ्ट में 25 मिनट तक फंसी रही, बेहद मुश्किलात के बाद उन्हें बाहर निकाल लिया गया,AOA के अध्यक्ष और सचिव के खिलाफ FIR दर्ज हुई है।यूपी की सोसाइटी में लिफ्ट एक्ट की जरूरत है @ghaziabadpolice @UPGovt pic.twitter.com/D0IsBChls9 — Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) December 1, 2022 ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ లిఫ్ట్‌లో జనాలు తరుచూ చిక్కుకుంటున్నారని, దీనిపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిపారు. లిఫ్ట్ ఆగిపోయిన సమయంలో అందులో సీనియర్ సిటీజన్లు, చిన్నారులు ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని వాపోయారు. చిన్న పిల్లలు లిఫ్ట్ వాడేందుకే భయపడుతున్నారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అపార్ట్మెంట్ బిల్డర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సొసైటీలో ఉన్న లిఫ్ట్లల్లో తరచూ ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయని చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా అపార్ట్మెంట్ బిల్డర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులతో బెంచ్.. చరిత్రలో మూడోసారి.. -
వైఎస్సార్సీపీ నేతకు తప్పిన ముప్పు!
సాక్షి,అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి లిఫ్టులో ఇరుక్కుపోయారు. శ్రీసెవన్ ఫంక్షన్ హాల్లో ఈ ఘటన జరిగింది. ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తలో సమావేశంలో పాల్గొన్న ఆయన.. సమావేశం అనంతరం కిందకు వెళ్తుండగా.. లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పోలీసులు, కార్యకర్తలు లిఫ్టును ధ్వంసం చేసి విశ్వేశ్వరరెడ్డిని బయటకు తీసుకురావడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. -
లిఫ్ట్‌లో ఇరుకున్న మంత్రి
భూపాలపల్లి : తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌజ్ పరిశీలనకు వచ్చిన జగదీశ్‌రెడ్డికి ఈ అనుభవం ఎదురైంది. పంప్‌హౌజ్ సందర్శిస్తున్న సమయంలో జగదీశ్‌రెడ్డి వెళ్తున్న లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో మంత్రి అందులో ఇరుక్కుపోయారు. దాదాపు గంటపాటు జగదీశ్‌రెడ్డి అందులోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత అధికారులు లిఫ్ట్ అద్దాలు పగులగొట్టి మంత్రిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం మంత్రి అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా.. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లక్ష్మాపూర్ గ్రామ సమీపంలోని 8వ పంప్‌హౌజ్‌ను మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. -
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన హోంమంత్రి
కాకినాడ : ఉప ముఖ్యమంత్రి, హోం శాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. లోడ్ అధికంగా ఉండటంతో ఆయన ఎక్కిన లిఫ్ట్ మొరాయించింది. దీంతో చినరాజప్ప దాదాపు పావుగంట పాటు లిఫ్ట్‌లో ఉండిపోయారు. వివరాల్లోకి వెళితే... కాకినాడలో ఇవాళ ఉదయం కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాన్ని చినరాజప్ప ప్రారంభించారు. అనంతరం కార్యాలయం పైభాగంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభించేందుకు ఆయన లిఫ్ట్ ఎక్కారు. అయితే చినరాజప్పతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు అందరూ ఒకేసారి లిఫ్ట్ ఎక్కేయడంతో లిఫ్ట్ తలుపులు మూసుకుపోయి అక్కడే ఆగిపోయింది. ఎంతసేపటికీ లిఫ్ట్ కదలకపోవడంతో కిందికీ, పైకీ అధికారులు పరుగులు తీశారు. లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు కొద్దిసేపు రకరకాల ప్రయత్నాలు చేశారు. దీంతో బయట ఉన్న పోలీసు అధికారులు, ఇతర శాఖలకు చెందిన అధికారులు భయాందోళనకు గురయ్యూరు. చివరకు లిఫ్ట్ ఒకేసారి కిందికి దిగింది. దీంతో అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు లిఫ్ట్‌లోకి అంతమందిని ఎలా అనుమతించారని అక్కడున్న పోలీసు అధికారులపై చినరాజప్ప చిందులు తొక్కారు. -
రాజ్‌నాథ్ గోడ దూకారట
-
రాజ్‌నాథ్ గోడ దూకారట..
న్యూఢిల్లీ: జెడ్ ప్లస్ కేటగిరీ, ఎన్ఎస్జీ కమాండోస్ పర్యవేక్షణ ఒకవైపు, వ్యక్తిగత భద్రతా దళాల పహారా మరోవైపు రక్షణగా ఉండే అత్యున్నత స్థాయి వ్యక్తి అకస్మాత్తుగా ఇబ్బందిలో పడితే ఎలా ఉంటుంది. సెక్యూరిటీ సిబ్బందికి ముచ్చెమటలు పట్టవూ.. సరిగ్గా ఇలాంటి పరిస్థితే కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సెక్యూరిటీ సిబ్బందికి ఎదురైంది. సౌత్ ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శౌర్యదివస్ సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న రాజనాథ్ సింగ్ తదితరులు ఒక లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దీంతో అందరూ కాసేపు భీతిల్లి పోయారట. సాంకేతిక కారణాలతో లిఫ్ట్ ఆగిపోవడంతో ముందుగా తేరుకున్న హోంమంత్రి సమయస్ఫూర్తిగా వ్యవహరించినట్టు సమాచారం. ఒక స్టూల్ సహాయంతో గోడెక్కి ఒకరి తర్వాత ఒకరుగా అంతా బయటపడ్డారు. అయితే ముందు మిగతావారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు స్వయంగా హోంమంత్రే చొరవ చూపినట్టు సమాచారం. ఈ విషయాలను రాజ్‌నాథ్ సమావేశంలో అందరితో పంచుకొన్నారు. అందరిలోనూ హరిభాయ్ చౌదరి బరువు ఎక్కువ ఉన్నారని... ఈసారి మాత్రం ఆయనకు దూరంగా ఉండాలని చమత్కరిస్తూ రాజ్‌నాథ్ నవ్వులు పూయించారట. కాగా సీఆర్పీఎఫ్ చీఫ్ ప్రకాష్ మిశ్రా , కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం డైరెక్టర్ బీకే సింగ్ , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ ప్రతిభాయ్ చౌదరి తదితరులు లిఫ్టులో ఇరుక్కున్న వారిలో ఉన్నారు.