![Minister Srinivas Goud Stuck In Lift At Mancherial - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/25/srinivas.jpg.webp?itok=iwcRBX9j)
సాక్షి, పెద్దపల్లి:ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పెద్దపల్లిలో ఓ రెస్టారెంట్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌కు వెళ్తున్న మంత్రి.. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జిల్లాకేంద్రంలోని కూనారం చౌరస్తాలో తన అనుచరుని రెస్టారెంట్‌కు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు లిఫ్ట్‌ను ఆశ్రయించారు.
సామర్థ్యం మించిపోవడంతో లిఫ్ట్ తలుపులు మూసుకున్నా.. ఎటూ కదల్లేదు.తలుపు తెరుచుకోకపోవడంతో మంత్రి కాసేపు లిఫ్ట్‌లోనే ఉండిపోయారు. దీంతో పోలీసులు, హోటల్ నిర్వాహకులు కాసేపు శ్రమించి తలుపులు తెరిచారు. అనంతరం మంత్రి నవ్వుకుంటూ బయటికొచ్చి ‘పెద్దపల్లి ఎప్పటికీ గుర్తుండిపోతుంది..’ అంటూ చెన్నూర్ పయనమయ్యారు.
చదవండి: ముఖం చూశాకే ముందుకు!
Comments
Please login to add a commentAdd a comment