రాజ్నాథ్ గోడ దూకారట.. | Rajnath gets stuck in lift, scales wall to be out | Sakshi
Sakshi News home page

రాజ్నాథ్ గోడ దూకారట..

Published Thu, Apr 9 2015 4:11 PM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

రాజ్నాథ్  గోడ దూకారట..

రాజ్నాథ్ గోడ దూకారట..

న్యూఢిల్లీ:   జెడ్ ప్లస్ కేటగిరీ, ఎన్ఎస్జీ  కమాండోస్ పర్యవేక్షణ ఒకవైపు, వ్యక్తిగత భద్రతా దళాల పహారా మరోవైపు రక్షణగా ఉండే  అత్యున్నత స్థాయి వ్యక్తి అకస్మాత్తుగా ఇబ్బందిలో పడితే ఎలా ఉంటుంది. సెక్యూరిటీ సిబ్బందికి ముచ్చెమటలు పట్టవూ.. సరిగ్గా ఇలాంటి పరిస్థితే  కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సెక్యూరిటీ సిబ్బందికి ఎదురైంది.  సౌత్ ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన శౌర్యదివస్ సందర్భంగా  ఒక  కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న రాజనాథ్ సింగ్ తదితరులు  ఒక లిఫ్ట్లో  ఇరుక్కుపోయారు. దీంతో అందరూ కాసేపు భీతిల్లి పోయారట.


సాంకేతిక కారణాలతో లిఫ్ట్ ఆగిపోవడంతో  ముందుగా తేరుకున్న హోంమంత్రి సమయస్ఫూర్తిగా వ్యవహరించినట్టు సమాచారం. ఒక స్టూల్ సహాయంతో గోడెక్కి  ఒకరి తర్వాత ఒకరుగా అంతా బయటపడ్డారు. అయితే ముందు మిగతావారిని  సురక్షితంగా బయటకు తెచ్చేందుకు స్వయంగా హోంమంత్రే చొరవ చూపినట్టు సమాచారం. ఈ విషయాలను రాజ్నాథ్ సమావేశంలో అందరితో పంచుకొన్నారు. అందరిలోనూ హరిభాయ్ చౌదరి బరువు ఎక్కువ ఉన్నారని... ఈసారి మాత్రం ఆయనకు దూరంగా ఉండాలని చమత్కరిస్తూ రాజ్నాథ్   నవ్వులు పూయించారట.

కాగా సీఆర్పీఎఫ్  చీఫ్ ప్రకాష్ మిశ్రా , కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం డైరెక్టర్ బీకే సింగ్ , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ ప్రతిభాయ్ చౌదరి  తదితరులు లిఫ్టులో ఇరుక్కున్న వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement