అత్తాపూర్‌లో డబ్బు మూటల కలకలం
హైదరాబాద్: అత్తాపూర్ బ్రిడ్జి కింద పెద్ద నోట్ల మూటలు పడి ఉన్నాయని వదంతులు వ్యాపించడంతో.. స్ధానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. అటు నుంచి వెళ్తున్న వాహనదారులకు కూడా ఈ విషయం పాకడంతో.. తమ వాహనాలను వదిలి వారు కూడా డబ్బు కోసం పరుగులు తీశారు. దీంతో అత్తాపూర్ ఫ్లై ఓవర్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
కాగా, గత మూడు రోజులుగా నగరంలో డబ్బు మూటలు రోడ్లపై పడేశారనే పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఉప్పు కొరత ఉందనే వదంతులతో అర్ధరాత్రి వరకు క్యూలో నిల్చొని అధిక రేట్లకు ఉప్పు కొనుగోలు చేసిన నగర వాసులు ఇప్పుడు ఇలా ఎక్కడ పడితే అక్కడ నల్లడబ్బు మూటలు పడి ఉన్నాయని పరుగులు తీస్తున్నారు.
