బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి ఊడ్చుకెళ్లిన సంఘటన అత్తాపూర్‌లోని తేజస్వీనగర్‌లో జరిగింది.
హైదరాబాద్(అత్తాపూర్): బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి ఊడ్చుకెళ్లిన సంఘటన అత్తాపూర్‌లోని తేజస్వీనగర్‌లో జరిగింది. కాలనీకి చెందిన బసవప్ప ఇంట్లో ఆదివారం రాత్రి దోంగలు పడి ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం, రెండు కిలోల వెండి,టీవీ, లాప్‌టాప్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు.
బసవప్ప బీదర్ వెళ్లి తిరిగి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.