Rajendra nagar police
-
HYD: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. గంజాయితో మరో బ్యాచ్
హైదరాబాద్, సాక్షి: నగరంలో మరోసారి మాదకద్రవ్యాల ముఠాల గుట్టు రట్టు అయ్యింది. పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడ్డారు పలువురు. విద్యార్థులే లక్ష్యంగా.. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి మరీ కేటుగాళ్లు ఈ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సనత్‌నగర్‌లో డ్రగ్స్ పార్టీ సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్వోటీ(Special Operation Team) బృందం దాడులు జరిపింది. ఈ తనిఖీల్లో MDMA(methylenedioxy-methylamphetamine)తో పట్టుబడ్డారు యువకులు. మొత్తం 4 గ్రాముల MDMA, 5 గ్రాముల గంజాయి తో పాటు OCB ప్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది ఎస్ఓటీ బృందం. ఈ దాడులకు సంబంధించి ఐదుగురు యువకుల్ని అరెస్ట్ చేసింది. మరోవైపు.. మేడ్చెల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో గంజాయి బ్యాచ్‌ను పోలీసులు పట్టుకున్నారు. రూ. 33,750 విలువ గల 1.35కేజీల గంజాయి సీజ్ చేశారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బుల సంపాదన ఆశతో గంజాయి దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో.. ఒడిషాకు చెందిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు మేడ్చెల్ ఎస్వోటీ పోలీసులు. వీళ్లంతా నగరంలో సెంట్రింగ్ వర్క్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
Drugs Case: పోలీసు కస్టడీకి కేపీ చౌదరి.. సినిమా వాళ్లతో లింకులు ఉన్నాయా?
డ్రగ్స్ రాకెట్లో ఇటీవల అరెస్ట్ అయిన సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్‌ను రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు కేపీ చౌదరిని చర్లపల్లి జైలు నుంచి రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు..తమదైన శైలీలో విచారణ చేస్తున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తరలిస్తుండగా కేపీ చౌదరి పోలీసులుకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. వారం రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు.. రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు ఈరోజు కేపీ చౌదరిని చర్లపల్లి జైలు నుంచి రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. (చదవండి: ఆ ఫోటోలు నావి కావు. . నాకు ట్వీటర్ ఖాతానే లేదు: జయవాణి) సినీ ప్రముఖులతో కేపీ చౌదరికి ఏమైనా లింకులు ఉన్నాయా? డ్రగ్స్‌ని ఇప్పటివరకు ఎవరెవరికి విక్రయించారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. .ఈరోజు, రేపు.. కేపీ చౌదరిని పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించనున్నారు. విచారణలో కేపీ చౌదరి ఇచ్చే సమాచారం ఆధారంగా డ్రగ్స్ వాడిన సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్ సినీ ప్రముఖులతో పరిచయం ఉన్న కే.పీ.చౌదరి ‘కబాలి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. -
బాలుడు కిడ్నాప్ కేసు సుఖాంతం
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన చిన్నారి ఖలీల్ కిడ్నాప్ కేసును ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. నిందితురాలని అదుపులోకి తీసుకుని... చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చింతల్మెట్కి చెందిన మహ్మద్, సాజిదాబేగం కుమారుడు ఖలీల్, కుమార్తె రేష్మలను సోమవారం ఉదయం ఇంటి వద్ద నుంచి ఓ మహిళ ఎత్తుకెళ్లింది. కానీ రేష్మను మార్గ మధ్యలో విడిచిపెట్టింది. దీంతో ఇంటికి వచ్చిన రేష్మ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో గతంలో వారి ఇంటి వద్దే నివసిస్తున్న ఫయిమ్ బేగం ఇటీవలే మరో ఇంటికి మారింది. అయితే ఆమెకు నలుగురు ఆడపిల్లలు.. మగ సంతానం లేదు. దీంతో ఖలీల్, రేష్మలకు అప్పటికే పరిచయం ఉన్న ఫయిమ్ సోమవారం చాక్లెట్ ఇస్తానని చెప్పడంతో ఇద్దరు చిన్నారులు ఆమె వద్దకు వెళ్లారు. దీంతో ఫయిమ్ బేగం ఖలీల్‌ను అపహరించుకుని పోయింది. రేష్మ ఇచ్చిన చిన్న క్లూతో పోలీసులు చిన్నారి ఖలీల్‌ను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. -
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మనోజ్ అరెస్ట్
హైదరాబాద్: మహిళా వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మనోజ్ (30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై అత్యాచార నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేయనున్నారు. రాజేంద్రనగర్ మండల పరిధిలోని బండ్లగూడ జాగీర్ గ్రామంలోని అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న మనోజ్ తన ఇంటికి ఎదురు ఫ్లాట్ లో ఉంటున్నఉత్తరప్రదేశ్ కు చెందిన వైద్యురాలిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. తనకు వైద్యం చేసేందుకని పిలిచి మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటపెడతానని బెదిరించి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. తనపై జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. కాగా, బాధితురాలు బుధవారం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు తల్లితండ్రులు, అపార్ట్ మెంట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంటి సొమ్ము.. దొంగలపాలు
హైదరాబాద్(అత్తాపూర్): బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి ఊడ్చుకెళ్లిన సంఘటన అత్తాపూర్‌లోని తేజస్వీనగర్‌లో జరిగింది. కాలనీకి చెందిన బసవప్ప ఇంట్లో ఆదివారం రాత్రి దోంగలు పడి ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం, రెండు కిలోల వెండి,టీవీ, లాప్టాప్తో పాటు రెండు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. బసవప్ప బీదర్ వెళ్లి తిరిగి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.