
డ్రగ్స్ రాకెట్‌లో ఇటీవల అరెస్ట్ అయిన సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్‌ను రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు కేపీ చౌదరిని చర్లపల్లి జైలు నుంచి రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు..తమదైన శైలీలో విచారణ చేస్తున్నారు.
గోవా నుంచి డ్రగ్స్ తరలిస్తుండగా కేపీ చౌదరి పోలీసులుకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. వారం రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు.. రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు ఈరోజు కేపీ చౌదరిని చర్లపల్లి జైలు నుంచి రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
(చదవండి: ఆ ఫోటోలు నావి కావు. . నాకు ట్వీటర్ ఖాతానే లేదు: జయవాణి)
సినీ ప్రముఖులతో కేపీ చౌదరికి ఏమైనా లింకులు ఉన్నాయా? డ్రగ్స్‌ని ఇప్పటివరకు ఎవరెవరికి విక్రయించారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. .ఈరోజు, రేపు.. కేపీ చౌదరిని పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించనున్నారు. విచారణలో కేపీ చౌదరి ఇచ్చే సమాచారం ఆధారంగా డ్రగ్స్ వాడిన సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్ సినీ ప్రముఖులతో పరిచయం ఉన్న కే.పీ.చౌదరి ‘కబాలి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment