సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మనోజ్ అరెస్ట్ | software engineer arrested for raping physiotherapist in Hyderabad | Sakshi
Sakshi News home page

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మనోజ్ అరెస్ట్

Published Thu, Oct 15 2015 12:53 PM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మనోజ్ అరెస్ట్ - Sakshi

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మనోజ్ అరెస్ట్

హైదరాబాద్: మహిళా వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మనోజ్ (30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై అత్యాచార నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేయనున్నారు.

రాజేంద్రనగర్ మండల పరిధిలోని బండ్లగూడ జాగీర్ గ్రామంలోని అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న మనోజ్ తన ఇంటికి ఎదురు ఫ్లాట్ లో ఉంటున్నఉత్తరప్రదేశ్ కు చెందిన వైద్యురాలిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. తనకు వైద్యం చేసేందుకని పిలిచి మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటపెడతానని బెదిరించి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. తనపై జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది.

కాగా, బాధితురాలు బుధవారం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు తల్లితండ్రులు, అపార్ట్ మెంట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement