పిడుగు పాటుకు గురైన హోంగార్డు మృతి | homegaurd died | Sakshi
Sakshi News home page

పిడుగు పాటుకు గురైన హోంగార్డు మృతి

Published Fri, Aug 12 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

homegaurd died

దేవుదల (రేగిడి) : మండలంలోని దేవుదల గ్రామానికి చెందిన హోంగార్డు ఇనుమల యోగనాధరావు (35) గురువారం రాత్రి మృతి చెందాడు. గత నెల 29న పొలంలో పని చేస్తున్న సమయంలో సాయంత్రం పూట పిడుగుపాటుతో తీవ్ర అస్వస్థతకు గురైన యోగనాధరావును రాజాం కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. యోగనాధరావు పరిస్థితి పూర్తిగా విషమించడంతో కేజీహెచ్‌ వైద్యులు యోగనాథరావును ఇంటికి తీసుకువెళ్లమని చెప్పడంతో గురువారం రాత్రి కుటుంబ సభ్యులు తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్టు హెచ్‌సీ భాస్కరరావు శుక్రవారం తెలిపారు. యోగనాధరావు రాజాం పోలీసుస్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య కృష్ణ, తల్లిదండ్రులు మొయ్యమ్మ, సత్యన్నారాయణ ఉన్నారు. ఘటనకు సంబంధించి పాలకొండ సీఐ ఎన్‌.వేణుగోపాలరావు సూచనలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ భాస్కరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement