
శివప్రకాష్‌పై విరుచుకుపడ్డ రాగిణి ద్వివేది
టీనగర్: తనను గర్ల్ ఫ్రెండ్ అనడంపై నటి రాగిణి త్రివేది నిర్మాత శివప్రకాష్‌పై విరుచుకుపడ్డారు. అరియాన్, నిమిరిందు నిల్ చిత్రాలలో నటించారు రాగిణి ద్వివేది. కన్నడంలో అనేక చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నాట్టికోలి కన్నడ చిత్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం ఏర్పాట్లు జరిగాయి. ఆ సమయంలో కన్నడ చిత్ర నిర్మాత శివప్రకాష్ రాగిణి బాయ్‌ఫ్రెండ్ తానేనని, ఆమె తనకు గర్ల్ ఫ్రెండ్ అంటూ షాకింగ్ న్యూస్ విడుదల చేశారు. దీంతో రాగిణి షాక్‌కు గురై షూటింగ్‌కు కూడా వెళ్లకుండా మానుకుందట.
దీంతో నాట్టికోలి చిత్ర నిర్మాతకు ఐదున్నర లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం. దీంతో శివప్రకాష్‌పై నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. దీనిగురించి రాగిణి మాట్లాడుతూ తాను ఎవరితోను డేటింగ్ చేయలేదని, శివప్రకాష్ అభాండాలు వేశారన్నారు. అతనిపై ఫిర్యాదు చేయాల్సిందిగా సంబంధిత నిర్మాతలకు సూచించింది తానే నన్నారు. ఒక మహిళపై వేలెత్తి చూపే ముందు వారి కుటుంబీకుల గురించి ఆలోచించాలని, చౌకబారు పనులకు పాల్పడడం తప్పని గ్రహించండంటూ పరోక్షంగా శివప్రకాష్‌పై దాడిచేసింది. ఇదివరకే రాణాకు, రాగిణికి ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పుకార్లు వ్యాపించి సంచలనం సృష్టించాయి. వీటిని కూడా రాగిణి తోసిపుచ్చడం గమనార్హం.