
ప్రముఖ కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది షూటింగ్‌లో గాయపడింది. వివరాల ప్రకారం.. రాగిణి ద్వివేది ప్రస్తుతం ‘‘నన్నొబ్బ బరతియా’’ అనే కన్నడ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ ఆమె ఎడమ చేతికి గాయమైంది. దీంతో వెంటనే షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన మూవీ టీం ఆమెను ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా కోలుకున్నాక తిరిగి ఆమె షూటింగ్‌లో పాల్గొననుంది.
ఇక తన గాయానికి సంబంధించిన ఫోటోను రాగిణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. మీ శరీరం దేన్నైనా తట్టుకోగలదు. మీరు ఒప్పించాల్సింది మీ మనస్సు. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అంటూ రాసుకొచ్చింది. కాగా 2009లో వచ్చిన ‘వీర మడక్కరి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాగిణి‘‘జెండాపై కపిరాజు’’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.
Comments
Please login to add a commentAdd a comment