షూటింగ్‌లో నటి రాగిణి ద్వివేదికి గాయాలు | Ragini Dwivedi Injured in Cinema Shooting | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో నటి రాగిణి ద్వివేదికి గాయాలు

Published Tue, Nov 21 2017 7:31 AM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

Ragini Dwivedi Injured in Cinema Shooting - Sakshi - Sakshi

బొమ్మనహళ్లి :  సినిమా షూటింగ్‌ సమయంలో ఓ ఫైటింగ్‌ సన్నివేశంలో నటి రాగిణి ద్వివేది  స్వల్పంగా గాయపడింది. దీంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాలు... ముస్సంజె మహేష్‌ దర్శకత్వంలో ఎం.ఎస్‌.సి.హెచ్‌ అనే కన్నడ సినిమాలో నటి రాగిణి నటిస్తోంది. ఈ సినిమాలో రాగిణి పోలీసు అధికారి పాత్ర పోషిస్తోంది. ఇక్కడి మినర్వమిల్‌లో షూటింగ్‌ జరుగుతుండగా ఓ ఫైటింగ్‌ సన్నివేశంలో సహాయ నటుడు చేయి తగిలి రాగిణి చెవికి గట్టిగా తగలడంతో ఆమె చెవి నుంచి రక్తం కారింది. హుటాహుటిన ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement