`మగాడి దాష్టీకానికి ఆడవారు ఎలా బలవుతున్నారో దండు పాళ్యం గత సిరీస్ లో చూపించారు. కానీ మహిళలు వారిపై జరిగే అకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే ఎలా ఉంటుందో ‘రియల్ దండుపాళ్యం’లో చూపించారు’అని అన్నారు టియఫ్‌పిసి సెక్రటరి టి. ప్రసన్నకుమార్. రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. శ్రీ వైష్ణో దేవి పతాకంపై, సి.పుట్టస్వామి నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టియఫ్‌పిసి సెక్రటరి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ‘రియల్ దందుపాళ్యం’ట్రైలర్ చూశాక ఒక కర్తవ్యం, ప్రతిఘటన, మౌనపోరాటం చిత్రాలు గుర్తొచ్చాయి. ఈ సినిమా ప్రతి మహిళ చూడాలి. ఇన్ స్పైర్ అవ్వాలి. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలి’అన్నారు.
నిర్మాత సి పుట్ట స్వామి మాట్లాడుతూ..‘సొసైటీలో మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ ‘రియల్ దండుపాళ్యం’ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నో సంఘటనలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. అన్ని సెంటర్స్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది’అన్నారు.
‘ఈ చిత్రాన్ని ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను. గతంలో వచ్చిన సిరీస్ కన్నా రియల్ దండుపాళ్యం అద్భుతంగా ఉండబోతుంది. తెలుగులో తొలి సారి విడుదలవుతోన్ననేను నటించిన యాక్షన్ సినిమా ఇది. ఎంతో ఎగ్జైయిటింగ్ గా ఉంది. అన్నారు హీరోయిన్ రాగిణి ద్వివేది. ఇంకా ఈ కార్యక్రమంలో సురేశ్ కొండేటి, సంజీవ్ చౌహాన్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రామా నాయక్, మానస. శ్యామ్ సన్, శేఖర్ నాయక్, సందీప్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment