హీరోయిన్ రాగిణి ద్వివేదిపై కేసు నమోదు | Actress Ragini Dwivedi booked for not returning advance | Sakshi
Sakshi News home page

హీరోయిన్ రాగిణి ద్వివేదిపై కేసు నమోదు

Published Wed, Dec 9 2015 8:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

హీరోయిన్ రాగిణి ద్వివేదిపై కేసు నమోదు

హీరోయిన్ రాగిణి ద్వివేదిపై కేసు నమోదు

బెంగళూరు : ప్రముఖ కన్నడ సినీనటి రాగిణి ద్వివేదిపై మంగళవారం జేపీ నగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. రాగిణి ద్వివేదితో పాటు ఆమె సోదరుడుపై నిర్మాత వెంకటేశ్ ఫిర్యాదు చేశాడు.  వివరాల్లోకి వెళితే....'నాటికోలి' సినిమాలో రాగిణి ద్వివేది నటించేందుకు ఆమె సోదరుడు రుద్రాక్షి దీక్షిత్‌కు రూ.16 నుంచి రూ.17 లక్షలు చెల్లించానని, సినిమా చిత్రీకరణ నిలిచిపోయిన  నేపథ్యంలో డబ్బు తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరగా స్పందన లేదని నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

 

డబ్బు తిరిగి ఇచ్చేది లేదని, అవసరమైతే మరో సినిమాలో నటిస్తానని రాగిణి చెప్పడంతో పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు నిర్మాత తెలిపాడు. వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా నాని హీరోగా వచ్చిన  'జెండాపై కపిరాజు' చిత్రంలో రాగిణి నటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement