advance amount
-
ఓలా స్కూటర్ అమ్మకాలు షురూ.. అడ్వాన్స్ పేమెంట్‌కి రెడీనా?
Ola Electric Scooter Sales: ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని దేశమంతటా ఆసక్తి నెలకొన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి, ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా ప్రీ బుకింగ్ చేసుకున్నవారు ఓలా సైట్ ద్వారా తమకు కావాల్సిన స్కూటర్ని ఎంపిక చేసుకుంటున్నారు. సేల్ మొదలైంది ఓలా స్కూటర్ని సొంతం చేసుకునేందుకు లక్ష మందికి పైగా ప్రీ బుకింగ్ చేసుకున్నారు. వీరిలో స్కూటర్ కొనేందుకు ఆసక్తి ఉన్న వారు ఓలా వెబ్‌సైట్‌కి వెళ్లి మోడల్, కలర్ ఆప్షన్లను ముందుగా ఎంచుకోవాలి. ఆ తర్వాత స్కూటర్ కొనుగోలుకు సంబంధించిన పేమెంట్ ఆప్షన్స్ ఈఎంఐలో కొంటున్నారా ? లేదా నేరుగా కొంటున్నారా అనే ఆప్షన్లను ఎంచుకోవాలి. ఓలా స్కూటర్‌కి ఫైనాన్స్ చేసేందుకు అనేక సంస్థలు, బ్యాంకులు రెడీగా ఉన్నాయి. ఎస్ 1 మోడల్‌కి కనీస డౌన్ పేమెంట్ రూ. 2,999 ఉండగా ఎస్ ప్రో మోడల్‌కి రూ. 3,199లు గా ఉంది. ఓన్లీ అడ్వాన్స్ పేమెంట్ ఓలా స్కూటర్లను నేరుగా హోం డెలివరీ ద్వారానే కస్టమర్లకు అందిస్తున్నారు. కొనుగోలు సెప్టెంబరు 15న ప్రారంభమైన స్కూటర్ డెలివరీ అక్టోబరులో ఉంటుందని ఓలా చెబుతోంది. ఈఎంఐ ఆప్షన్ కాకుండా నేరుగా కొనుగోలు చేసేవారు సైతం పుల్ పేమెంట్ చేయక్కర్లేదని ఓలా తెలిపింది. ఎస్ 1 (ధర రూ.99,999) మోడల్‌కి సంబంధించి అడ్వాన్స్ పేమెంట్‌గా రూ. 20,000 ఎస్ 1 ప్రో (ధర రూ.1,29,999) మోడల్‌కి సంబంధించి అడ్వాన్స్ పేమెంట్‌గా రూ. 25,000 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన డబ్బలును డెలివరీకి ముందు చెల్లించే వెసులుబాటు ఓలా అందిస్తోంది. ప్రీ బుకింగ్ చేయకపోతే ? జులైలో ప్రీ బుకింగ్ చేయని వాళ్లు సైతం ఓలా వెబ్సైట్ ద్వారా స్కూటర్‌ను కొనుగోలుకు ప్రయత్నించవచ్చు. ఓలా వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రీ బుకింగ్ టోకెన్ అమౌంట్‌ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొనుగులకు సంబంధించిన ఇతర ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓలా ప్రీ బుకింగ్, అడ్వాన్స్‌పేమెంట్‌కి సంబంధించిన మొత్తం రీఫండబుల్, ఎప్పుడైనా ప్రీ బుకింగ్ లేదా కొనుగోలు రద్దు చేసుకుంటే డబ్బు వాపస్ ఇస్తారు. ఇబ్బందులు అధిగమించి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ప్రీ బుకింగ్స్ జులైలో ప్రారంభమయ్యాయి. మార్కెట్లోకి స్కూటర్ రాకముందే లక్షకు పైగా ప్రీ బుకింగ్స్ సాధించి రికార్డు సృష్టించింది. సెప్టెంబరు 8న ఈ స్కూటర్ అమ్మకాలు ఆన్లైన్లో ప్రారంభించారు. అయితే టెక్నికల్ ఇష్యూస్ తలెత్తడంతో వారం రోజుల పాటు అమ్మకాలు వాయిదా వేశారు. తాజాగా సెప్టెంబరు 15న ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ వేదికగా అమ్మకాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఓలా చీఫ్ భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. Bring the revolution home! Ola S1 purchase is rolling out now!l We’re opening it in the order of reservation. Look for your invitation email or check the Ola app to know when it’s live for you! #JoinTheRevolution pic.twitter.com/FQlVDxJ6Ki — Bhavish Aggarwal (@bhash) September 15, 2021 చదవండి: ఈవీ ఛార్జింగ్ సమస్యలను సులభంగా చెక్ పెట్టొచ్చు: ఓలా సీఈఓ -
ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఈ కరోనా మహమ్మరి కాలంలో ఒక తీపికబురు అందించింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈపీఎఫ్ఓ చందాదారులు తమ ఖాతా నుంచి అడ్వాన్స్ తీసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇలాంటి విపత్కర మహమ్మారి సమయంలో చందాదారుల ఆర్ధికంగా అండగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగులు మూడు నెలల పాటు బేసిక్ శాలరీ, డీఏ జీతాన్ని లేదా భవిష్యనిధిలోని 75శాతం డబ్బును(ఏదీ తక్కువైతే అది) అడ్వాన్స్‌గా తీసుకునేందుకు వీలు కల్పించింది. గతంలో ఈ అవకాశాన్ని వినియోగించుకున్నవారు కూడా రెండోసారి అడ్వాన్స్ తీసుకోవచ్చని ప్రకటించింది. "ఈ మహమ్మారి సమయంలో కోవిడ్ -19 అడ్వాన్స్ ఈపీఎఫ్ సభ్యులకు గొప్ప సహాయంగా ఉంటుంది. ముఖ్యంగా నెలవారీ వేతనాలు రూ.15,000 కన్నా తక్కువ ఉన్నవారికి" అని కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ 7.6 మిలియన్లకు పైగా కోవిడ్ అడ్వాన్స్ క్లెయిమ్‌లను పరిష్కరించి మొత్తం రూ.18,698.15 కోట్లు పంపిణీ చేసింది. అంతేగాక, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొవిడ్ అడ్వాన్స్ క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో మూడు రోజుల్లోనే పరిష్కరిస్తోందని వెల్లడించింది. చదవండి: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆధార్ లింక్ చేయండి? -
మహేశ్‌తో మూవీ... సుక్కుకు భారీగా అడ్వాన్స్!
రంగస్థలం ఈ ఒక్క చిత్రం ఎందరి జీవితాలనో మార్చేసింది. హీరో, హీరోయిన్, సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులకు, ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్‌కు ఇది మరిచిపోలేని సినిమా. తన సినీ కెరీర్లోనే రంగస్థలం అతి పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత సుక్కు తదుపరి సినిమా ఏంటి? అనే దాని గురించి ఆలోచించిన ప్రేక్షకులకు ఊరట కలిగిస్తూ... మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మహేశ్, సుక్కు కాంబినేషన్లో సినిమా ఉంటుందని ఇటీవలే ప్రకటించేసింది. రంగస్థలం సినిమా చిత్రీకరణ సమయంలోనే సుకుమార్ మైత్రీ మూవీకే మళ్లీ సినిమా చేస్తాడని చెప్పారట. చెప్పిన ప్రకారమే మళ్లీ అదే సంస్థలో సినిమా చేస్తున్నాడు. అయితే మహేశ్‌తో చేయబోయే సినిమాకు ఈ లెక్కల మాష్టారుకు బాగానే లెక్కలు ముట్టజెప్పారట. దాదాపు ఆరు కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ కొన్ని ఇంటర్వ్యూలో సుక్కు...తనకు అడ్వాన్స్ తీసుకోవడం ఇష్టముండదని, తీసుకుంటే తనకు భయం వేస్తుందని చెప్పాడు. అయితే ప్రస్తుతంద సుక్కు ఆరు కోట్లు అడ్వాన్స్ అంటూ ఈ రూమర్ చక్కర్లు కొడుతోంది. మరి వీటిలో ఏది నిజమో సుకుమార్, నిర్మాతలకే తెలియాలి. -
హీరోయిన్ రాగిణి ద్వివేదిపై కేసు నమోదు
బెంగళూరు : ప్రముఖ కన్నడ సినీనటి రాగిణి ద్వివేదిపై మంగళవారం జేపీ నగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. రాగిణి ద్వివేదితో పాటు ఆమె సోదరుడుపై నిర్మాత వెంకటేశ్ ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే....'నాటికోలి' సినిమాలో రాగిణి ద్వివేది నటించేందుకు ఆమె సోదరుడు రుద్రాక్షి దీక్షిత్‌కు రూ.16 నుంచి రూ.17 లక్షలు చెల్లించానని, సినిమా చిత్రీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో డబ్బు తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరగా స్పందన లేదని నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బు తిరిగి ఇచ్చేది లేదని, అవసరమైతే మరో సినిమాలో నటిస్తానని రాగిణి చెప్పడంతో పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు నిర్మాత తెలిపాడు. వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా నాని హీరోగా వచ్చిన 'జెండాపై కపిరాజు' చిత్రంలో రాగిణి నటించిన విషయం తెలిసిందే.