
రంగస్థలం ఈ ఒక్క చిత్రం ఎందరి జీవితాలనో మార్చేసింది. హీరో, హీరోయిన్, సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులకు, ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్‌కు ఇది మరిచిపోలేని సినిమా. తన సినీ కెరీర్‌లోనే రంగస్థలం అతి పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత సుక్కు తదుపరి సినిమా ఏంటి? అనే దాని గురించి ఆలోచించిన ప్రేక్షకులకు ఊరట కలిగిస్తూ... మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మహేశ్, సుక్కు కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ఇటీవలే ప్రకటించేసింది.
రంగస్థలం సినిమా చిత్రీకరణ సమయంలోనే సుకుమార్ మైత్రీ మూవీకే మళ్లీ సినిమా చేస్తాడని చెప్పారట. చెప్పిన ప్రకారమే మళ్లీ అదే సంస్థలో సినిమా చేస్తున్నాడు. అయితే మహేశ్‌తో చేయబోయే సినిమాకు ఈ లెక్కల మాష్టారుకు బాగానే లెక్కలు ముట్టజెప్పారట. దాదాపు ఆరు కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ కొన్ని ఇంటర్వ్యూలో సుక్కు...తనకు అడ్వాన్స్ తీసుకోవడం ఇష్టముండదని, తీసుకుంటే తనకు భయం వేస్తుందని చెప్పాడు. అయితే ప్రస్తుతంద సుక్కు ఆరు కోట్లు అడ్వాన్స్ అంటూ ఈ రూమర్ చక్కర్లు కొడుతోంది. మరి వీటిలో ఏది నిజమో సుకుమార్, నిర్మాతలకే తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment